పవన్ డైలమా : ఓడించి ఓడిపోవడమా..? గెలిచి గెలిపించడమా..?

గౌరవం ఉన్న చోట స్నేహం చేయలేమని చెబుతూ.. తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి పవన్ కల్యాణ్ షాక్ ఇచ్చారు. అంతే కాదు.. అక్కడ ఇక పార్టీని బలోపేతం చేయడానికి సీరియస్‌గా ప్రయత్నాలు ప్రారంభించారు. పవన్ కల్యాణ్ హఠాత్తుగా వేస్తున్న అడుగులు… గౌరవం లేని చోట ఉండలేమని పవన్ కల్యాణ్ నిఖార్సుగా చెబుతున్నారు. పవన్ హఠాత్తుగా వేస్తున్న అడుగులు జనసైనికుల్ని ఆశ్చర్యానికి…  ఓ రకంగా ఆనందానికి గురి చేస్తున్నాయి. ఏపీ జనసైనికులు సైతం.. అలాంటి నిర్ణయం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

రాజకీయ వ్యూహాల్లో తగ్గబోనని నిరూపించిన పవన్..!

బలానికి తగ్గ బెట్టు చూపిస్తేనే ఎవరైనా విలువను కాపాడుకుంటారు. కానీ పవన్ కల్యాణ్ అతి మంచితనమో.. మొహమాటమో… మరో కారణమో కానీ.. భారతీయ జనతా పార్టీ వద్ద తన బలాన్ని తగ్గించుకుంటూనే ఉన్నారు. అది తెలంగాణలో కావొచ్చు.. ఆంధ్రలో కావొచ్చు. తెలంగాణలో గ్రేటర్ ఎన్నికల్లో అభ్యర్థులతో నామినేషన్లు దాఖలు చేయించి మరీ పవన్ కల్యాణ్ బీజేపీ అడిగిందని పోటీ నుంచి విరమించుకుంటున్నారు. అడగగానే ఒప్పుకున్నారనో..  గెలుపు క్రెడిట్ అంతా తమకే దక్కాలని ఆశపడ్డారేమో కానీ తర్వాత బీజేపీ నేతలు పవన్ కల్యాణ్‌ను కించ పర్చడం ప్రారంభించారు. ఇది మనసులో పెట్టుకున్న పవన్ కల్యాణ్… సడెన్ షాక్ ఇచ్చారు. పవర్ షాక్ తగిలిన తర్వాత బీజేపీ తెలంగాణ నాయకత్వం.. పవన్‌కు ఇబ్బంది ఉంటే తమతో మాట్లాడాల్సి ఉందని సన్నాయి నొక్కులు నొక్కింది. కానీ.. అప్పటికే పరిస్థితి చేయిదాటిపోయింది. ఈ మొత్తం ఎపిసోడ్‌లో పవన్ కల్యాణ్ ఓ స్పష్టమైన సందేశం మాత్రం పంపారు.. అదే.. ఎవరెన్ని మాటలు అన్నా.. పడటం లేదని.. అన్నీ రాసి పెట్టుకుంటున్నామని సమయం చూసి.. షాక్ ఇస్తామని..సందేశం పంపారు.

తెలంగాణ నేతలకు తగ్గని ఏపీ బీజేపీ నేతల తీరు..!

ఆంధ్రప్రదేశ్‌లోనూ పవన్ కల్యాణ్‌కు గౌరవం దక్కుతోందా.. అన్న చర్చ ఇప్పుడు ప్రారంభమయింది. భారతీయ జనతా పార్టీ నేతలు పవన్ కల్యాణ్‌తో పొత్తును టేకిట్ గ్రాంట్‌గా తీసుకుంటున్నారు. జనసేన పార్టీకి అస్థిత్వమే లేదని.. తమది జాతీయ స్థాయిలో అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి.. జనసేన తాము చెప్పినట్లుగానే చేయాలన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. గత ఎన్నికల్లో బీజేపీ నేతలకు కనీసం ఒక్క శాతం ఓట్లు కూడా రాలేదు. కానీ జనసేనకు ఆరు శాతం వరకూ ఓట్లు వచ్చాయి. అదే సమయంలో… పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో జనసేన ప్రభావం చూపించింది. కానీ బీజేపీ ఎక్కడా చూపించలేదు. జనసేన బలంతో ఒకటీ అరా సీట్లు గెల్చుకుని స్వారీ చేయడం ప్రారంభించింది. తిరుపతి లోక్‌సభ పరిధిలో కనీస బలం లేకపోయినా… తామే సీటు తీసుకుంది. ఇందు కోసం ముందు నుంచీ మైండ్ గేమ్ ప్రారంభించారు. పొత్తు ధర్మం పాటించకుండా ఇష్టం వచ్చినట్లుగా ప్రకటనలు చేశారు. ఈ క్రమంలో ఏపీ బీజేపీ నాయకత్వంపైనా పవన్ కల్యాణ్ పలుమార్లు హైకమాండ్‌కు ఫిర్యాదులు చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది.

పవన్ రాజకీయ వ్యూహాలే విజయానికి సోపానాలు..!

పవన్ కల్యాణ్ గెలవలేకపోవచ్చు కానీ ఓడిస్తానని చాలా గొప్పగా చెప్పేవారు. ఇప్పుడు అది నిజం అవుతోంది. అయితే ఆయన ఓడటం.. ఓడించడం… అధికార పార్టీని గెలిపించడం అవుతోంది. తన ఓట్ల బలాన్ని అధికారంగా మార్చుకునే వ్యూహాన్ని జనసేన అధినేత ఆలోచించుకుని…బీజేపీ కబంధ హస్తాల నుంచి బయటపడాలన్న సూచనలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. బీజేపీతో పెట్టుకుంటే ఒరిగేదేమీ ఉండదని.. వారి లోపాయికారీ రాజకీయ ఒప్పందాలకు పవన్ కల్యాణ్‌ను టూల్‌గా వాడుకుంటున్నారన్న విశ్లేషణలు ఉన్నాయి. ఈ విషయంలో పవన్ కల్యాణ్… ఒకటికి .. రెండు సార్లు విశ్లేషించుకోవాలేమో.. ఓడించి ఓడిపోవడం కన్నా…   గెలిచి.. గెలింపించడం బెటర్ ఆప్షన్ అవుతుంది..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close