పవన్ కళ్యాణ్ అంత రిస్క్ ఎందుకు చేస్తున్నాడు?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏం చేసినా ….ఏమీ చేయపోయినా సంచలనమే అవుతూ ఉంటుంది. ఎప్పుడూ వార్తల్లో వ్యక్తే అవుతూ ఉంటాడు. 2014లో జనసేన పార్టీ అంటూ హడావిడి చేనసినప్పటి నుంచీ తెలుగు వార్తల్లో పవన్ కళ్యాణ్ పేరు వినిపించని రోజులు చాలా తక్కువ. మన దగ్గర చాలా మంది నాయకులు చాలా చాలా లౌక్యంగా మాట్లాడేస్తూ ఉంటారు. తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ అనేలా ఉంటుంది వాళ్ళ వ్యవహారం. అందుకే విమర్శలు కూడా మరీ అంత ఎక్కువగా రావు. కానీ పవన్ శైలి అది కాదు. ‘పంచెలూడగొడతా…ప్రశ్నిస్తా…’ అనే టైప్.

అభిమానులు కూడా పవన్ నుంచి ఆవేశపూరితమైన హీరోయిజాన్ని కోరుకుంటున్నారు. రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఏదో చేస్తాడు అని నమ్మేవాళ్ళలో కూడా ఎక్కువమంది పవన్ ఆవేశానికి కనెక్ట్ అయిన వాళ్ళే. అలాగే నిజాయితీ గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడినంత సిన్సియర్‌గా మన నాయకులు ఎవ్వరూ మాట్లాడరు.

అయితే 2014 ఎన్నికల తర్వాత పవన్ ప్రచారం చేసిన చంద్రబాబు, మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ పవన్ కళ్యాణ్‌లో చాలా మార్పు వచ్చింది. అందరు రాజకీయ నాయకుల్లాగే లౌక్యం ప్రదర్శిస్తున్నాడు. తనను తాను సమర్ధించుకుంటున్నాడు. అధికారంలో ఉన్నవాళ్ళను చాలా సుతిమెత్తగా, ఇంకా కరెక్ట్‌గా చెప్పాలంటే భయంగా భయంగా విమర్శిస్తున్నాడు. ఈ వైఖరి పవన్ అభిమానులకు కూడా పెద్దగా నచ్చడం లేదు. అయితే ఇప్పుడు మరోసారి తన హీరోయిజం ఎలా ఉంటుందో, ఆవేశం ఎలా ఉంటుందో చూపించాడు పవన్. అభిమాని కుటుంబాన్ని పరామర్శించినప్పుడు అవసరమైతే సిబిఐ ఎంక్వైరీ కూడా జరిగేలా చేద్దాం అనే రేంజ్‌లో చాలా ఆవేశంగా స్పందించాడు. అలాగే తిరుపతిలో సభ గురించి కూడా షార్ప్ డెసిషన్ తీసుకున్నాడు. pkఅన్నింటికీ మించి సెక్యూరిటీ ఇవ్వలేమని చేతులెత్తేసిన పోలీసులతో నేను, నా అభిమానులే అన్నీ చూసుకుంటాం అనే స్థాయిలో లిఖిత పూర్వకంగా రాసిచ్చేశాడట. ఇప్పటి వరకూ పవన్ కళ్యాణ్ చుట్టూ కొంత మంది బౌన్సర్స్ ఉండడమే చూశాం. వై.ఎస్. జగన్‌లాగా ఈయనకు కూడా ప్రైవేట్ సెక్యూరిటీ సెటప్ అంతా ఉందేమో తెలియదు. కానీ పవన్ మాత్రం చాలా డేరింగ్ స్టెప్ తీసుకున్నాడు. రిస్క్ చేస్తున్నాడు.

పోలీసులకు మనవాళ్ళు చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. అంతకంటే కూడా ఎక్కువగా భయపడతారు. కొట్టటానికి, కాల్చిపడేయడానికి వాళ్ళకు అధికారం లేదు. కానీ మన సినిమాలు, మీడియా కలిసి పోలీసులకు సర్వాధికారాలూ ఉన్నాయి. వాళ్ళు ఏమైనా చేయగలరు అన్న ఇంప్రెషన్ ఇచ్చాయి. అందుకే సరిపడినంత మంది స్టాఫ్ లేకపోయినప్పటికీ జనాలను భయపెట్టి అదుపులో ఉండేలా చేయగలరు పోలీసులు. ప్రైవేట్ సెక్యూరిటీ అంటే జనాలకు ఆ భయం ఉండే అవకాశం లేదు. పవన్ కళ్యాణ్ మాటలు వినాలి. ఆయన అభిప్రాయాలేంటో తెలుసుకోవాలి. ఆయన ఆశయాల కోసం పనిచేయాలి అని అనుకునే జనాల కంటే కూడా ఆయనతో ఒక ఫొటో దిగాలి. షేక్ హ్యాండ్ ఇవ్వాలి. దగ్గరగా చూడాలి…లాంటి ఆలోచనలతో సభకు వచ్చే అభిమానులే ఎక్కువగా ఉంటారనడంలో సందేహం లేదు. పవన్ కళ్యాణ్‌కి హార్డ్ కోర్ ఫ్యాన్స్ చాలా ఎక్కువ. అలాంటి వాళ్ళందరూ కూడా పవన్‌ని దగ్గరగా చూసే అవకాశం వస్తే ఆ ఛాన్స్ అస్సలు వదులుకోరు. ఆ సమయంలో పవన్ మాట కూడా వినరు. అలాగే పవన్‌ని వ్యతిరేకించే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ప్రత్యర్థి రాజకీయ పార్టీల అభిమానులున్నారు.

పవన్ కళ్యాణ్ తన నైజాన్ని మరోసారి చూపించారు. చాలా డేరింగ్ స్టెప్ తీసుకున్నారు. అభిమాని చనిపోయాడన్న ఆవేధనలో ఆవేశంగా నిర్ణయం తీసుకున్నాడేమో తెలియదు. పవన్ కళ్యాణ్ స్పందనలు ఎప్పుడూ కొంచెం ఆవేశపూరితంగానే ఉంటాయి మరి. ఎలాంటి దుర్ఘటనలూ జరగకూడదనే అందరూ కోరుకుంటారు. కానీ ఇలాంటి రిస్కీ డెసిషన్స్ తీసుకోవడం మాత్రం పవన్ కళ్యాణ్ స్థాయికి తగదు. అలాగే పాజిటివ్‌గా మాట్లాడుకుంటే… అభిమానులను కంట్రోల్ చేయడంలో పవన్ సక్సెస్ అయ్యాడంటే మాత్రం….వాళ్ళ ఆవేశాన్ని అదుపులో పెట్టి….వాళ్ళు తన మాటలు వినేలా…తన ఆశయాల కోసం వాళ్ళు నిబద్ధతతో, పరిణితి చెందిన ఆలోచనలతో పనిచేసేలా చేయగలిగాడంటే మాత్రం పవన్ రాజకీయ జీవితం చాలా కాలం ఉంటుందనడంలో సందేహం లేదు. మరి పవన్ కళ్యాణ్‌కి అంతటి మాస్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయా? మేనేజ్‌మెంట్ స్కిల్స్ ఉన్నాయా?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

విశ్వ‌క్ ‘లైలా’వ‌తారం!

https://www.youtube.com/watch?v=9STsOoGDUfA లేడీ గెట‌ప్పులు వేయాల‌న్న ఆశ‌.. ప్ర‌తీ హీరోకీ ఉంటుంది. స‌మ‌యం సంద‌ర్భం క‌ల‌సి రావాలంతే! ఒక‌ప్ప‌టి అగ్ర హీరోలంతా మేక‌ప్పులు మార్చి, శారీలు క‌ట్టి - ఆడ వేషాల్లో అద‌ర‌గొట్టిన‌వాళ్లే. ఈత‌రం హీరోలు...

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close