మూడు వారాల తర్వాత ఆత్మ నిర్భర ప్యాకేజీపై జనసేనాని రివ్యూ..!

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆత్మనిర్భర ప్యాకేజీ బాగుందని ఓ ప్రెస్‌నోట్‌ను.. జనసేన పార్టీ ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. నరేంద్రమోడీ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లాలా.. మధ్య తరగతి జీవితానికి మేలు జరిగేలా నిర్ణయాలు తీసుకుందని అందులో ప్రశంశల వర్షం కురిపించారు. ఎలా మేలు చేస్తుందో.. కొన్ని ఉదాహరణలు చెప్పారు. 2013లో హౌసింగ్ లోన్లు పది శాతం వడ్డీకి వచ్చేవని.. ఇప్పుడు ఎనిమిది నుంచి ఎనిమిదిన్నరకే వస్తున్నాయని పవన్ చెప్పి సంతృప్తి వ్యక్తం చేశారు. దీనితో పాటు.. ఆత్మనిర్భర ప్యాకేజీలోప్రకటించిన క్యాష్ రిజర్వ్ రేషియోల్లో మార్పులు.. ఇతర అంశాలన్నింటీ పవన్ పొడిగారు. అవన్నీ లాక్‌డౌన్ వల్ల మధ్య తరగతి జీవితాల్లో మార్పులు తీసుకొస్తాయని సంతోషం వెలిబుచ్చారు.

ఇదంతా బాగానే ఉంది కానీ… సమయం..సందర్భం లేకుండా… ఆత్మనిర్భర ప్యాకేజీపై ఈ రివ్యూను ట్విట్ చేయడం ఏమిటన్నదానిపై చాలా మందిలో సందేహం కలుగుతోంది. ఆత్మనిర్భర ప్యాకేజీ ప్రకటించి.. ఇరవై రోజులు పైనే అవుతోంది. మే పన్నెండో తేదీన నరేంద్రమోడీ జాతినుద్దేశించి ప్రసంగిస్తూ.. ఇరవై లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రకటించారు. ఆ తర్వాత ఐదు రోజుల పాటు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. వరుసగా ప్రెస్‌మీట్లు పెట్టి.. ప్యాకేజీల్లోని అంశాలను వివరించారు. వాటిపై ఎవరు చేయాల్సిన విశ్లేషణలు వాళ్లు చేశారు. ఎవరికి అర్థమయింది వారు చెప్పారు. రాజకీయపార్టీలు తమకు ఎంత కావాలో అంత విశ్లేషించాయి. ఆ ఎడిసోడ్ అయిపోయింది. ఆ ప్యాకేజీ పాతబడిపోయింది.

అయితే.. హఠాత్తుగా పవన్ కల్యాణ్ ఇప్పుడు.. ఆ ప్యాకేజీపై ఎందుకు రివ్యూ చేశాలో మాత్రం సస్పెన్స్‌గానే ఉంది. బహుశా పవన్ కల్యాణ్ అప్పటి నుంచి సీరియస్‌గా ప్యాకేజీని స్టడీ చేసి.. ఇప్పుడు తన అభిప్రాయాన్ని చెప్పి ఉంటారని భావిస్తున్నారు. రాజకీయాల్లో దేనికైనా టైమింగ్ ఉండాలి. ఏ అంశంపై వేడి ఉన్నప్పుడు.. ఆ ఆంశంపై స్పందించాలి. అది పొలిటికల్ రాడార్ నుంచి పోయిన తర్వాత స్పందిస్తే.. పద్దగా పట్టించుకునేవాళ్లు ఉండరు. మరి జనసేనాని దీన్ని తెలుసుకుంటారో లేదో..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

ఐటెమ్ గాళ్‌…. పెద్ద స‌మ‌స్యే!

ఇది వ‌ర‌కు ఏ సినిమాలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలా? అని ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డేవారు. అనుకొన్నంత స్థాయిలో, సంఖ్య‌లో హీరోయిన్లు లేక‌పోవ‌డం, స్టార్ హీరోల క్రేజ్‌కు స‌రిప‌డా క‌థానాయిక‌లు దొర‌క్క‌పోవ‌డంతో...

ఇదేం స్ట్రాటజీ ఐ ప్యాక్ – గ్రాఫ్ పెరుగుతోందంటే ఆల్రెడీ తగ్గిపోయిందనే కదా అర్థం !

జగన్ మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరుగుతోందని ప్రచారం చేయాలి . మీకు ఎంత కావాలి ?. ఇది ఐ ప్యాక్ నుంచి వివిధ మీడియా సంస్థలకు.. సోషల్ మీడియా ఖాతాలకు .....

HOT NEWS

css.php
[X] Close
[X] Close