‘పోర్న్ పవన్’ అట … ఇక ‘కత్తి’ రించాల్సిందే !

అసలే కోతి దానికి కల్లు తోడైంది అన్నట్టుంది వ్యవహారం. ఒక నోటి దూలకి మరొక నోటి దురద తోడైతే.. ఇక ఆ డబుల్ కంపుకు అడ్డేమిటి? పైగా ఇలాంటి దరిద్రపు వాగుడుకి ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ‘ అంటూ కవచం ఒకటి.

ప్రముఖులు, పోలీసులు, దేవుళ్ళ దగ్గరనుంచి సామాజిక కార్యకర్తలు, మహిళలు దాకా ఎవరినీ వదలకుండా ఏది పడితే అది అనేస్తూ నోటి తీట తీర్చుకునే వర్మకు గొప్ప ఫాలోవర్ దొరికాడు ‘కత్తి మహేష్’ రూపంలో.

పవన్ కళ్యాణ్ ను తిట్టి ఫ్రీగా పబ్లిసిటీ కొట్టేసిన కత్తి… ఆ హైప్ రుచి మరిగినట్టుంది. పవన్ ఫాన్స్ తో గొడవ వ్యవహారం కోడిగుడ్లు దాడి దాకా వెళ్లి సద్దుమణిగింది,రాజీ కుదిరింది. అయినా మహేష్ మాత్రం తన పంథా మార్చుకున్నట్టు కనిపించడం లేదు. అడపా దడపా పవన్ పొలిటికల్ స్ట్రాటజీని విమర్శిస్తూనే ఉన్నాడు. సరే… రాజకీయo అంటే జనానికి సంబంధించింది కాబట్టి ఓకే.

కానీ తాజాగా వర్మ పవన్ పై చేసిన పోర్న్ కళ్యాణ్ అనే ఒక చౌకబారు కామెంట్ ను కత్తి వావ్ అంటూ అభినందించడం చూస్తే… పవన్ ను ఏదో ఒకటి అని ప్రచారం పొందే పని కత్తి ఇంకా మానలేదని అర్ధం అవుతోంది. పోర్న్ కల్యాణ్ అంటూ వర్మ చేసిన ట్వీట్ కు మద్దతు ఇస్తూ… అది పర్ఫెక్ట్ పేరు అంటూ కత్తి అభినందించాడు. ఏమన్నా అంటే ఫ్యాన్స్ నన్ను కామెంట్ చేయడం ఆపలేదు అని తప్పించుకోవడం !

తాను పోర్న్ చూస్తానంటూ గొప్పగా జనానికి చెప్పుకున్నవాడు , ” అవును, నేను ఉమనైజేర్ నే ” అని టి.వి. ఛానెల్లో చెప్పుకున్నవాడు కలిసి లక్షలాదిమంది అభిమానులు ఉన్న హీరోని ఇలా వ్యాఖ్యానించడం కూడా ‘ఫ్రీడం ఆఫ్ స్పీచ్’ అని భావించాలా? ఈ తోకలు ఇకనైనా ‘కత్తి’రించాలా? ఇప్పుడు పవన్ ప్రస్తావన జనం నుంచి వర్మ  పై నిన్న , ఈరోజు జరుగుతున్న పోలీసు కేసు దృష్టిని మరల్చడానికే!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com