మేం పార్టీలు పెట్టిన‌ప్పుడే కుల చ‌ర్చ ఎందుకొస్తోంది..?

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ విశాఖ‌లో ప‌ర్య‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. పోర్టు క‌ళావాణి ఆడిటోరియంలో జరిగిన ఓ స‌మావేశంలో ఆవేశంగా మాట్లాడారు. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం కంటే ముందుగానే జ‌న‌సేన‌కు కామ‌న్ మేన్ ప్రొటెక్ష‌న్ ఫోర్స్ రూపంలో పునాదులు ప‌డ్డాయ‌ని ప‌వ‌న్ చెప్పారు. చిరంజీవి స్థాయి వ్య‌క్తి రాజ‌కీయాల్లోకి వ‌స్తే పెనుమార్పులు వ‌స్తాయ‌న్న కార‌ణంతో అప్ప‌ట్లో పాల‌క వ‌ర్గాలు అడ్డుకునే ప్ర‌య‌త్నం చేశాయ‌న్నారు. ఆయ‌న వ‌స్తే ఏదైనా చేసేస్తార‌నే భ‌యంతో కుటుంబంపై దాడి చేయ‌డం మొద‌లుపెట్టారన్నారు. అప్పుడు త‌న‌కు కోపం వచ్చింద‌నీ, ఆ స్థాయి వ్య‌క్తి మీదే ఇలా దాడులు జ‌రిగితే సామాన్యుడు ఎలా బ‌తుకుతాడ‌నే ఆవేద‌న క‌లిగింద‌న్నారు.

వీడికి ఉన్న కోపంతో తీవ్ర‌వాద ఉద్య‌మాల‌కు వెళ్లిపోతాడ‌న్న భ‌యంతో అన్న‌య్య త‌న‌కో రివాల్వ‌ర్ కొనిచ్చార‌ని ప‌వ‌న్ చెప్పారు. త‌న జీవితంలో మొట్ట‌మొద‌ట తుపాకీతో ప్రేమ‌లో ప‌డ్డాన‌ని ప‌వ‌న్ అన్నారు. అయితే, అన్న‌య్య కుటుంబంపై దాడి జ‌రిగేస‌రికి, ఒక సామాజిక న్యాయానికి ప్ర‌య‌త్నిస్తున్న వారిపైనే ఇలాంటివి జ‌రుగుతుంటే ర‌గిలిపోయాన‌నీ, అందుకే కామ‌న్ మేన్ ప్రొటెక్ష‌న్ ఫోర్స్ పెట్టాన‌న్నారు. ఆరోజున తాను అంద‌రికీ అర్థం కాక‌పోయి ఉండొచ్చ‌నీ, చాలా కొద్దిమంది మేధావుల‌కు మాత్ర‌మే తాను అర్థ‌మ‌య్యాన‌ని ప‌వ‌న్ చెప్పుకొచ్చారు! జ‌నసైనికులు అర్థం చేసుకున్నార‌న్నారు.

ఆ త‌రువాత‌, చుట్టుప‌క్క‌ల ఉన్న‌వారంతా ఆ పార్టీకి కులం అంట‌గ‌ట్టార‌న్నారు. అంద‌రి క్షేమం కోరి ఒక వ్య‌క్తి వ‌స్తే కులం పేరు చెప్పి, ప్రాంతం పేరు చెప్పి లేనిపోనివి ఆపాదించే ప్ర‌య‌త్నం చేశార‌న్నారు. త‌న విష‌యంలో కూడా కొంద‌రు ఇలాంటి ప్ర‌య‌త్న‌మే చేయ‌బోతే కాళ్లు విరగ్గొడ‌తా అని వార్నింగ్ ఇచ్చాన‌న్నారు. ‘మీరు పార్టీలు పెడితే కులాలు రావా, మేం పార్టీలు పెడితే కులాలు వ‌స్తాయా..? ఏం న్యాయం ఇది..?’ అంటూ ఆవేశంగా ప‌వ‌న్ స్పందించారు. 2014లో టీడీపీ వారే తన దగ్గరకు వచ్చారనీ, సపోర్టు చేయమంటే చేశాననీ, తాను స్వయంగా వెళ్లి మద్దతు ఇవ్వ‌లేదు క‌దా అని ప‌వ‌న్ చెప్పుకొచ్చారు.

ప్ర‌జారాజ్యం పార్టీ పెట్టి, భారీ రాజ‌కీయ మార్పుల‌కు చిరంజీవి శ్రీ‌కారం చుట్టి ఉండొచ్చు. కానీ, ఎన్నిక‌ల త‌రువాత అదే ల‌క్ష్యంతో ఆయ‌న కొన‌సాగ‌లేదే..! కాంగ్రెస్ లో విలీనం చేసేశారు క‌దా! మ‌రి, ఆ స‌మ‌యంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ ఏం చేసిన‌ట్టు అనుమానం ఇలాంటి మాట‌లు విన్నాక క‌లుగుతుంది. ఆరోజే చిరంజీవి మ‌ద్ద‌తుగా నిలిచి, ప్ర‌జారాజ్యంలో తానూ ఒక మూల‌స్తంభాన్ని అనే స్థాయి భ‌రోసా ప్ర‌జ‌ల‌కు ఎందుకు క‌ల్పించ‌లేక‌పోయారు…? అదే చేసి ఉంటే ఇవాళ్ల కొత్త‌గా జ‌న‌సేన అంటూ పార్టీ ప్ర‌త్యేకంగా పెట్టాల్సిన అవ‌స‌ర‌మే ఉండేది కాదు క‌దా! చిరంజీవిదీ, ప‌వ‌న్ క‌ల్యాణ్ దీ ఒకే ల‌క్ష్య‌మైతే.. రెండు పార్టీలు స్థాపించాల్సిన అవ‌స‌రం ఏమొచ్చింద‌నే ప్ర‌శ్న కూడా ఇలాంటి ప్ర‌సంగాలు విన్నాక క‌లుగతుంది క‌దా! ఇక‌, కులం ముద్ర విష‌యానికొస్తే.. ఆంధ్రాలో కులం ముద్ర లేని పార్టీ ఏది..? అంద‌రూ ఆ తానులో ముక్క‌లే. కాబ‌ట్టి, అదేదో కొత్త‌గా జ‌న‌సేన‌కు ప‌డుతున్న ముద్ర‌గా చూడాల్సిన అవ‌స‌రం లేదు. కాక‌పోతే, అన్ని కులాల‌వారికీ ఇస్తున్న ప్రాధాన్య‌త‌ను బ‌ట్టీ ఆయా పార్టీల మ‌నుగ‌డ ఆధార‌ప‌డి ఉంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close