ప‌వ‌న్ నువ్వేంటి?? ఆ స్పీచేంటి??

సాధార‌ణంగా ప‌వ‌న్ క‌ల్యాణ్‌కి మైకు ప‌ట్టుకుంటే మాట‌లు రావు. అది సినిమా ఫంక్ష‌న్ అయితే అస్స‌లు రావు. త‌న సినిమాల గురించి మాట్లాడ‌డానికే మొహ‌మాట‌ప‌డిపోతుంటాడు ప‌వ‌న్‌. మ‌రొక‌రి ఫంక్ష‌న్ అయితే పొడిపొడిగా మాట్లాడేసి వెళ్లిపోతుంటాడు. అలాంటిది రంగ‌స్థ‌లం స‌క్సెస్ మీట్లో్ సుదీర్ఘంగా సాగిన ప‌వ‌న్ స్పీచ్ చూస్తే ఎవ్వ‌రికైనా ఆశ్చ‌ర్యం వేయ‌క మాన‌దు. ఈ సినిమాని ఆకాశానికి ఎత్తేసేలా సాగింది ప‌వ‌న్ స్పీచ్‌. ఈ చిత్రానికి ప‌ని చేసిన ప్ర‌తీ ఒక్క‌రినీ పేరు పేరునా గుర్తు చేసుకున్నాడు. ఆఖ‌రికి జ‌బ‌ర్‌ద‌స్త్ బ్యాచ్‌తో స‌హా. అన్నిటిలోనూ హైలెట్ ఏంటంటే.. రంగ‌స్థ‌లం సినిమాని ఆస్కార్‌కి పంపాల‌ని స్టేట్‌మెంట్ ఇవ్వ‌డం.

ఇదంతా ఒక ఎత్తు.. బాహుబ‌లితో పోలిస్తూ చ‌ర‌ణ్ మాట్లాడ‌డం మ‌రో ఎత్తు. బాహుబ‌లిని అప్ప‌ట్లో ఎలా ప్రోత్స‌హించాలో.. ఇప్పుడు రంగ‌స్థ‌లం సినిమానీ అలానే ప్రోత్స‌హించాల‌ని కోర‌డం కాస్త ఆస‌క్తిక‌రంగా, ఆశ్చ‌ర్యంగా అనిపించింది. బాహుబ‌లి పాన్ ఇండియా ఇమేజ్‌తో జ‌నంలోకి వెళ్లింది. ఆ సినిమా మార్కెట్‌, దానికొచ్చిన క్రేజ్ పూర్తిగా వేరు. పైగా అది మిగిలిన భాష‌ల్లోనూ ఆడింది. రంగ‌స్థ‌లం అలా కాదు. ఇదంతా ప‌క్క‌న పెడితే.. ‘వ‌ర్గాల‌కు అతీతంగా, రాజ‌కీయాల‌కు అతీతంగా’ అనే మరో మాట కూడా చ‌ర్చ‌కు దారితీసేదే. ప‌వ‌న్ ఎప్పుడూ, ఏ సినిమా ఫంక్ష‌న్లోనూ ఇలా మాట్లాడింది లేదు. వ‌ర్గాలు, రాజ‌కీయాలు అన్నాడంటే సినిమా ప‌రిశ్ర‌మ‌లో వ‌ర్గాల కుమ్ములాట‌లూ, రాజ‌కీయాలూ ఉన్న‌ట్టే క‌దా?

ఓ సినిమా కోసం ప‌వ‌న్ ఇంత‌గా గొంతు చించుకోవ‌డం వెనుక కార‌ణం ఏమిట‌న్న‌ది అంతుప‌ట్ట‌దు. ఇది వ‌ర‌కూ చ‌ర‌ణ్‌కి విజ‌యాలొచ్చాయి. మ‌గ‌ధీర లాంటి చ‌రిత్ర సృష్టించిన సినిమా తీసిన‌ప్పుడు కూడా ప‌వ‌న్ ఇంత‌లా స్పందించ‌లేదు. ఇప్పుడే ప‌వ‌న్ వేదిక ఎక్క‌డం, చ‌ర‌ణ్‌ని ఆకాశానికి ఎత్తేయ‌డం ఎందుక‌న్న‌ది అభిమానుల్ని వెంటాడుతున్న ప్ర‌శ్న‌. మొన్న సినిమా చూడ‌డం, స‌క్సెస్ మీట్‌కి వ‌స్తాన‌డ‌డంలో ఎవ‌రికీ ఎలాంటి అభ్యంత‌రాలూ, అనుమానాలూ రావు. కానీ ఈ సినిమాకి తానే బ్రాండ్ అంబాసిడ‌ర్ అయిన‌ట్టు మ‌రీ నెత్తిన పెట్టుకున్నాడు. దీని వెనుక ఉన్న ఆంత‌ర్య‌మేంటో?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

ఎంపీ అభ్యర్థిగా బర్రెలక్క నామినేషన్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన బర్రెలక్క పార్లమెంట్ ఎన్నికల్లోనూ పోటీ చేస్తున్నారు. నాగర్ కర్నూల్ లోక్ సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఆమె నామినేషన్ దాఖలు చేశారు. తన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close