9వ తేదీన జనసేన జిల్లా కమిటీలు..! పవన్ కసరత్తు..!

జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యూహం మార్చారు. పోరాటయాత్రలు, కవాతుల పేరుతో.. ఇంత కాలం.. కాలం గడిపిన ఆయన ఇప్పుడు… బుద్దిగా జిల్లాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. వరుసగా రెండు రోజుల పాటు… శ్రీకాకుళం, నెల్లూరు జిల్లాల నుంచి వచ్చిన అభిమానులతో.. సమీక్షా సావేశం నిర్వహించారు. పార్టీకి అసలు సంస్థాగత నిర్మాణమే లేకపోవడంతో.. ముందుగా ఆ దిశగా ఏదైనా కొంత ప్రయత్నం చేయాలని అనుకుంటున్నారు. జిల్లాల వారీగా కనీసం తాత్కాలిక కార్యవర్గాలను అయినా ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. మొదటి రోజు… శ్రీకాకుళం జిల్లాల నుంచి వచ్చిన అభిమానులతో పవన్ సమావేశమయ్యారు. పార్టీ విధివిధానాల గురించి చెప్పారు. శ్రీకాకళం జిల్లాలో అన్ని కులాల వారు జనసేనను అభిమానిస్తున్నారని, కులాల మధ్య సయోధ్యను మరింత పెంచాల్సిన అవసరం ఉందని అభిమానులతో… చెప్పుకొచ్చారు. శ్రీకాకుళం నేతల్లో సమన్వయం పెరగాలని కూడా సూచించారు.

జిల్లాల వారీ సమీక్షల్లో.. నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొంటున్నారు. మరో ఇద్దరు సీనియర్ నేతలు కడా.. జిల్లాల నుంచి వచ్చిన వారితో మాట్లాడుతున్నారు. నెల్లూరు నేతలతో జరిగిన సమావేశంలో వారసత్వ రాజకీయాలపై.. పవన్ ఫైరయ్యారు. నెల్లూరు జిల్లాలో కేవలం పది కుటుంబాలే రాజకీయం చేస్తున్నాయని, ఇటువంటి రాజకీయాలకు స్వస్తి పలకాల్సిందేనన్నారు. రాజకీయ వారసత్వంతో మనుగడ సాగిస్తున్న కుటుంబాలను రాజకీయంగా ఎదుర్కొవడానికి యువత శక్తి యుక్తులతో, ఓపికతో పనిచేసి ప్రజలకు చేరువ కావాలని సూచించారు. ఈ నెల 9 వ తేదిన స్వల్ప కాలానికి పని చేసే జనసేన జిల్లా కమిటీని ప్రకటిస్తామని పవన్ కళ్యాణ్ వారికి చెప్పారు.

పండగ నాటికి అన్ని జిల్లాల సమావేశాలను పూర్తి చేసి, పండుగ తరువాత నుంచి జిల్లాలకు వెళ్లాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. ఇప్పటికే ఐదు జిల్లాల పర్యటన పూర్తయింది. మరో 8జిల్లాలు తిరగాల్సి ఉంది. సార్వత్రిక ఎన్నికలకు సిద్దమయ్యేందుకు వంద రోజుల పాటు పర్యటనకు శ్రీకారం చుట్టే చర్యల్లో భాగంగా అన్ని జిల్లాలలో కమిటీలను ఏర్పాటు చేసేందుకు తొలుత ఆ జిల్లాలలోని కీలక నేతలతో పవన్ కళ్యాణ్ సమావేశమవుతున్నారు. కార్యకర్తలతకు దిశా, నిర్ధేశం చేస్తున్నారు. పొత్తులపై ఇప్పటికే స్పష్టమైన ప్రకటన చేయడంతో కార్యకర్తల్లో ఉన్న అయోమయాన్ని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

ఐటెమ్ గాళ్‌…. పెద్ద స‌మ‌స్యే!

ఇది వ‌ర‌కు ఏ సినిమాలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలా? అని ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డేవారు. అనుకొన్నంత స్థాయిలో, సంఖ్య‌లో హీరోయిన్లు లేక‌పోవ‌డం, స్టార్ హీరోల క్రేజ్‌కు స‌రిప‌డా క‌థానాయిక‌లు దొర‌క్క‌పోవ‌డంతో...

ఇదేం స్ట్రాటజీ ఐ ప్యాక్ – గ్రాఫ్ పెరుగుతోందంటే ఆల్రెడీ తగ్గిపోయిందనే కదా అర్థం !

జగన్ మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరుగుతోందని ప్రచారం చేయాలి . మీకు ఎంత కావాలి ?. ఇది ఐ ప్యాక్ నుంచి వివిధ మీడియా సంస్థలకు.. సోషల్ మీడియా ఖాతాలకు .....

HOT NEWS

css.php
[X] Close
[X] Close