పవన్-టీడీపీ x వైసీపీ-బీజేపీ: ఇది ‘సోష‌ల్’ పొత్తు….

నాలుగు రోజులు సాగిన పవన్ పర్యటన సాధించింది ఏమిటి? ఏ ఒక్క ప్రజా సమస్య అయినా పరిష్కారం అయిందా? కనీసం ఏ సమస్య పై అయినా అర్ధవంతమైన చర్చకు గాని, పరిష్కరించే ప్రయత్నాలకు గాని కారణం అయ్యిందా? అంటే సమాధానం ఏమొస్తుందో అందరికీ తెలిసిందే. కానీ ఈ స్టార్ హీరో పర్యటన కొన్ని మార్పు చేర్పులకు మాత్రం దోహదం చేసినట్టు పరిశీలకుల అంచనా. రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలెలా ఉన్నా సోష‌ల్ మీడియాలో పోరాట యోధులు మాత్రం కొత్త రూటు తీసుకునేందుకు కార‌ణ‌మైంది అంటున్నారు.

పవన్ క‌ళ్యాణ్ త‌న ప‌ర్య‌ట‌న‌లో అధికార పార్టీ కన్నా ఎక్కువ‌గా ప్ర‌తిప‌క్ష పార్టీనే టార్గెట్ చేయ‌డం, అదీగాక ఈ సారి నేరుగా జ‌గ‌న్ పేరు ప్ర‌స్తావించి మ‌రీ విమ‌ర్శ‌లు గుప్పించ‌డం, దానికి థీటుగా విపక్ష పార్టీ స్పందించ‌డం, జ‌న‌సేనానిపై ఆఘ‌మేఘాల మీద విరుచుకుప‌డ‌డం తెలిసిందే. ఈ నేప‌ధ్యంలోనే ఇప్ప‌టిదాకా సోష‌ల్ మీడియాలో పార్టీల మ‌ద్ధ‌తు దారులు యూట‌ర్న్ తీసుకున్న‌ట్టు క‌న‌ప‌డుతోంది. గ‌త కొంత‌కాలంగా పీఆర్పీ మ‌ద్ధ‌తు దారులు లేదా ప‌వ‌న్ అభిమానులు తెలుగుదేశం పార్టీ మీద విమ‌ర్శ‌లు సాగిస్తూండేవారు. అలాగే భాజాపాను, ప్ర‌ధాని మోడీని కూడా త‌ర‌చు విమ‌ర్శించేవారు. ఈ విమ‌ర్శ‌ల్లో వైసీపి నుంచి ఒక్క రోజా మీద త‌ప్ప మ‌రెవరీని పెద్దగా ల‌క్ష్యపెట్టేవారు కాదు.

అయితే ప‌వ‌న్ ప‌ర్య‌ట‌న నేప‌ధ్యంలో అక‌స్మాత్తుగా ఆయ‌న ఫ్యాన్స్‌సైతం వైసీపీ పార్టీ మీద నిప్పులు చెర‌గ‌డం ప్రారంభించారు. అచ్చం త‌మ నేత త‌ర‌హాలోనే అధికార‌ తెలుగుదేశం పార్టీని వదిలేసి జ‌గ‌న్‌, ఆయ‌న మ‌ద్ధ‌తుదార‌లు అంంద‌రిపై విమ‌ర్శ‌ల‌తో చెల‌రేగిపోతున్నారు. ఇక తెలుగుదేశం ఫాలోయ‌ర్స్ ఎప్ప‌టిలానే త‌మ జ‌గ‌న్ వ్య‌తిరేక‌త‌కు క‌ట్టుబ‌డ్డారు. మ‌రోవైపు దీనికి త‌గ్గ‌ట్టుగానే వైసీపీ ఫ్యాన్స్ కూడా ప‌వ‌న్‌పై దూకుడు పెంచారు. ఇందులో మ‌రింత విశేషం ఏమిటంటే… భాజాపా మ‌ద్ధ‌తుదారులు సైతం ప‌వ‌న్‌కు వ్య‌తిరేకంగా తీవ్ర‌స్థాయి విమ‌ర్శ‌ల‌కు పూనుకోవ‌డం.

ఈ నేప‌ధ్యంలో కాస్త సోష‌ల్ మీడియాను ప‌రిశీల‌న‌గా చూసిన వారికి వైకాపా, భాజాపా ఒక‌వైపు, తేదేపా, జన‌సైన్యం మ‌రోవైపు మొహ‌రించ‌డం చూస్తే అనిపించేది ఒక్క‌టే. ఎన్నిక‌ల‌కు ఇంకా ముందుగానే సోష‌ల్ మీడియా పొత్తులు ఖ‌రారు చేసేసిన‌ట్టుంది అని.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

“చెంగిచెర్ల” మీదుగా బీజేపీ ఎలక్షన్ ప్లాన్లు !

మేడ్చల్ నియోజకవర్గం చెంగిచెర్ల గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా ఘర్షణ జరిగింది. డీజే పాటలు పెట్టుకొని హోలీ సంబరాలు చేసుకుంటుండగా.. మరో వర్గానికి చెందిన వారు ఆ పాటలు ఆపాలని కోరారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close