అటల్‌పై సెంటిమెంట్‌ ప్రదర్శన …! ఎవరి స్కోర్ ఎంత..?

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి మరణంతో.. . రెండు రోజుల పాటు… దేశం మొత్తం… ఆయన గుణగుణాల గురించి చర్చించుకున్నారు. సోషల్ మీడియా మొత్తం… ఏకపక్షంగా సంతాపం ప్రకటించింది. అయన ఎలాంటి విలువలు పాటించేవారని కొత్తకొత్తగా చెప్పుకున్నారు. ఇక రాజకీయ నాయకుల సందేశాల గురించి అయితే… అతిశయోక్తులకు దగ్గరగా ఉన్నాయి. ప్రజలు ఆయనో గొప్ప లీడర్ గా… భారతదేశానికి ఓ గొప్ప… పుత్రునిగా కీర్తించారు. ఇందులో మరో అభిప్రాయానికి తావు లేదు. రాజకీయ పార్టీల సోషల్ మీడియా విభాగాలు…. అటల్ ఇమేజ్‌ను తమకు తమకు ఉపయోగపడేలా మార్కెటింగ్ చేసుకున్నాయి. ఇందులోనూ రెండు రకాల వ్యూహాలు అమలు చేశాయి.

రాజకీయ పరంగా బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, ప్రధానమంత్రి నరేంద్రమోడీ అనుసరిస్తున్న వ్యూహాలు కొన్నాళ్లుగా తీవ్ర విమర్శలకు కారణం అవుతున్నాయి. ఇది అటల్ జీ బీజేపీ కాదనే విమర్శలు ఇతర పార్టీల నుంచి వస్తున్నాయి. ఈ పాయింట్ నే పట్టుకుని… విపక్ష పార్టీల సోషల్ మీడియా విభాగాలు… మోడీ, షాలను టార్గెట్ చేసుకున్నాయి. వాజ్‌పేయికు నివాళి అర్పిస్తూ… రాజకీయపోస్టులు వెల్లువలా పెట్టారు. దీనికి కౌంటర్ గా … బీజేపీ సోషల్ మీడియా విభాగం, కార్యకర్తలు… అటల్ ను బీజేపీ ఎంతగా గౌరవించిందో… పోస్టులు హోరెత్తించారు.

అటల్ బిహారీ వాజ్‌పేయి గొప్ప నాయకుడే. కానీ అటు మీడియా… ఇటు సోషల్ మీడియాతో పాటు వివిధ రాజకీయ పార్టీల్లోనూ అంతులేని ఉద్విగ్నత చెలరేగడానికి మాత్రం కారణం ఎన్నికల వాతావరణమేనని చెప్పక తప్పదు. విలువలు పాటించే.. గొప్ప నేతగా.. అటల్… ఆరేళ్ల పాటు ప్రధానిగా ఉండి.. చేసిన పనులు మైల్ స్టోన్స్ గా నిలిచే ఉన్నాయి. కానీ ఆయనను ప్రజలను తిరస్కరించారు. ఆయన ఆచరించిన హిందూత్వ భావజాలం పట్ల.. ఎన్నో విమర్శలు కూడా ఉన్నాయి. ఆయన అధికారంలో ఉన్నప్పుడు… వాజ్‌పేయి వాజమ్మ అని విమర్శలు రోజూ కనిపించేవి. అంటే వాజ్‌పేయిది ఫెయిల్యూర్ స్టోరీనే. కానీ చనిపోయారు కాబట్టి… పొగడాలన్నట్లుగా పరిస్థితి ఉంది. అందులోనూ ఎవరి రాజకీయం వారు చేసుకున్నారు. పోయినోళ్లంతా మంచోళ్లు…! వాజ్‌పేయి విషయంలోనూ అంతే…!!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

భయమే బంగారమాయెనా…

హారర్ సినిమా అనగానే ఆడియన్స్ లిమిట్ అయిపోతారు. స్టార్ హీరోలు ఈ కథలని వినడానికి పెద్ద ఆసక్తి చూపించారు. కానీ చాలా మంది ఫిల్మ్ మేకర్స్ కి హారర్ సినిమాలంటే క్రేజ్. నిజానికి...

భయమా..? అభద్రతాభావమా..?

కొద్ది రోజుల కిందట వరకు దేశవ్యాప్తంగా బీజేపీకి అనుకూల పరిస్థితి ఉన్నప్పటికీ ఎన్నికలకు సమయం సమీపించే కొద్దీ ఆ పార్టీ గ్రాఫ్ వేగంగా పతనం అవుతూ వస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కాంగ్రెస్...

ఖ‌మ్మం పంచాయితీ మ‌ళ్లీ షురూ… ఈసారి కాంగ్రెస్ లో!

ఖ‌మ్మం జిల్లా రాజ‌కీయాలు అంటేనే ఎప్పుడూ ఏదో ఒక పంచాయితీ న‌డుస్తూనే ఉంటుంది. అధికార పార్టీలో నాయ‌కుల మ‌ధ్య స‌యోధ్య చాలా క‌ష్టం. మొన్న‌టి వ‌ర‌కు బీఆర్ఎస్ అధికారంలో ఉన్న స‌మ‌యంలో తుమ్మ‌ల‌,...

దాస‌రికి ఇదే ఘ‌న‌మైన నివాళి!

మే 4... ద‌ర్శ‌క ర‌త్న దాస‌రి నారాయ‌ణ‌రావు జ‌న్మ‌దినం. దాస‌రి పుట్టిన రోజుని ద‌ర్శ‌కుల దినోత్స‌వంగా జ‌రుపుకొంటుంది టాలీవుడ్. ద‌ర్శ‌కుల‌కు కూడా స్టార్ స్టేట‌స్ క‌ల్పించిన దాస‌రికి ఇది స‌రైన నివాళే. అయితే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close