జగన్ రెడ్డి చెప్పే ఫేక్ గణాంకాలను పయ్యావుల కేశవ్ ప్రెస్మీట్ పెట్టి రోస్ట్ చేశారు. అసెంబ్లీకి వచ్చి చెప్పకపోయినా కనీసం ప్రెస్మీట్ పెట్టారని అయినా తాను సమాధానం ఇస్తానని ఆయన ప్రతి విషయానికి కౌంటర్ ఇచ్చారు. దీంతో వైసీపీ చేసిన తప్పిదాలు.. ఆ పార్టీ హయంలో జరిగిన ఆర్థిక విధ్వంసం మొత్తం బయటకు వచ్చింది. ఇప్పుడు పయ్యావుల కేశవ్ తప్పులు చెప్పారని చెప్పడానికి పేర్ని నానిని వైసీపీ రంగంలోకి దింపింది. వైసీపీలో తనకు మించిన మేధావి లేడని ఆయన అనుకుంటారు. అందుకే.. జగన్ చెప్పింది తప్పని ఆర్థిక శాఖ కార్యదర్శితో సంతకం పెట్టి చెప్పించాలని ఆయన సవాల్ చేశారు.
జగన్ చేసిందిరాజకీయ విమర్శలు. రాజకీయంగా ఆర్థిక మంత్రి నేరుగా సమాధానం ఇచ్చారు. రాజకీయానికి అధికారులకు సంబంధం ఏముంటుంది? వారు జగన్మోహన్ రెడ్డికి ఎందుకు సమాధానం ఇస్తారు? . అధికారవర్గాలను రాజకీయాలకు వాడుకున్నది జగన్ రెడ్డి. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలను కూడా తిట్టమని కలెక్టర్లకే దిశానిర్దేశం చేసిన వ్యక్తి సీఎం. అలాంటి వ్యక్తి ఏమైనా చేయించరు కానీ.. అధికారులను అధికార పనులకు..రాజకీయాలతో పని లేకుండా పని చేయించుకునే పద్దతిని చంద్రబాబు పాటిస్తారు.
అధికారులు ఎవరూ కౌంటర్ ఇవ్వరు కాబట్టి తన వాదన నెగ్గుతుందని పేర్ని నాని అనుకుంటున్నట్లుగా ఉన్నారు. పయ్యావుల చెప్పింది తప్పు అయితే గణాంకాలతో సహా చెప్పాలి. మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అయితే ఇలాంటివి చక్కగా చెప్పగలరు కానీ ఆయన మాత్రం తెర మీదకు రావడం లేదు. అసలు ఏపీకే రావడంలేదు. ఎప్పుడైనా సజ్జల నుంచి విజ్ఞప్తులు వస్తే కుదిరితే..హైదరాబాద్లో ప్రెస్మీట్ పెడుతున్నారు. ఈ సారి ఆ బాధ్యత పేర్ని నానికి రావడంతో ఇలాంటి విమర్శలు చేశారు.
