రివ్యూ: ఫలానా అబ్బాయి.. ఫలానా అమ్మాయి

దర్శకుడిగా తీసిన రెండు సినిమాలతోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్రని సంపాయించుకున్నారు శ్రీనివాస్ అవసరాల. ఆయన సినిమాల్లో సహజమైన సన్నివేశాలు, సంభాషణలు, సున్నితమైన భావోద్వేగాలు, మనసుకు హాయినిచ్చే సంగీతం ప్రధాన ఆకర్షణగా వుంటాయి. ఇప్పుడు నాగశౌర్యతో మూడో సినిమాగా తీసిన ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ ప్రమోషనల్ కంటెంట్ లో కూడా ఈ అంశాలన్నీ కనిపించాయి. మరి ప్రమోషన్స్ తో పాజిటివ్ బజ్ క్రియేట్ చేసిన ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ ప్రయాణం ఎలా సాగింది? కొంత విరామం తర్వాత అవసరాల నుంచి వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులని ఎంతలా ఆకట్టుకుంది?

సంజయ్ (నాగశౌర్య) అనుపమ (మాళవిక నాయర్) ఇంజనీరింగ్ కాలేజీలో కలుస్తారు. సంజయ్ కంటే అనుపమ ఒక ఏడాది సీనియర్. ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడుతుంది. మాస్టర్స్ చేయడానికి లండన్ వెళ్తారు. అక్కడ స్నేహం ప్రేమగా మారుతుంది. ఇద్దరూ సహజీవనం చేస్తారు. అంతా సజావుగా సాగుతున్న సమయంలోఅనుమపకు అనారోగ్యం చేస్తుంది. ఆపరేషన్ జరుగుతుంది. అనుపమకి ఆపరేషన్ జరిగినప్పుడూ ఫ్రండ్స్ అంతా వుంటారు కానీ తను ఎంతగానో ప్రేమించిన సంజయ్ మాత్రం పక్కన ఉండడు. ఇది అనుపమని చాలా బాధిస్తుంది. ఈ సంఘటన తర్వాత వారి మధ్య దూరం పెరుగుతుంది. సంజయ్ నుంచి విడిపోతుంది అనుపమ. తర్వాత ఈ జంట కలిసిందా లేదా ? అసలు సంజయ్ హాస్పిటల్ కి రాకపోవడానికి కారణం ఏమిటి ? అనేది మిగతా కథ.

ఒక అమ్మాయి అబ్బాయి కలుస్తారు. ఓ కారణం వల్ల విడిపోతారు. మళ్ళీ కలుస్తారు. ప్రతి ప్రేమకథలో దాదాపుగా ఇదే జరుగుతుంది. ‘ఫలానా’లో కూడా ఇదే జరిగింది. కొన్ని ప్రేమ కథల్లో ప్రేమికులే కాకుండా ఇంకొన్ని బలమైన పాత్రలు కూడా వుంటాయి. ఇందులో మాత్రం అమ్మాయి అబ్బాయి ప్రయాణం పైనే ద్రుష్టి పెట్టాడు అవసరాల. అయితే ఇద్దరి ప్రయాణం చూపిస్తున్నాడు ఆ రెండు పాత్రలని ఆసక్తిగాతీర్చి దిద్దాలి. సంఘర్షణ, ఆసక్తిఆకరమైన నాటకీయత జోడించాలి. అప్పుడే వారి ప్రయాణంపై ప్రేక్షకులకు ఆసక్తి కలుగుతుంది. అయితే ఫలానా లో ఇదే మిస్ అయ్యింది.. దర్శకుడు అవసరాల ఎంతసేపూ బ్యూటీఫుల్ మూమెంట్స్ పైనే ద్రుష్టిపెట్టాడు కానీ.. ఆ మూమెంట్స్ తో డ్రామాని, సంఘర్షణని క్రియేట్ చేయలేకపోయారు.

చాలా చిన్న కథ ఇది. హాస్పిటల్ కి ఎందుకు రాలేదని ఇంటర్వెల్ కి ముందు సంజయ్ ని అడుగుతుంది అనుపమ. అక్కడే సమాధానం చెబితే ఈ కథ ముగిసిపోతుంది. కానీ ఆ పాయింట్ సెకండ్ హాఫ్ కి తీసుకొచ్చి..కథకు బలం చేకూరని సన్నివేశాలతో మరో గంట సహనానికి పరీక్ష పెట్టారు. ఈ కథని చెప్పడానికి అవసరల నాన్ లినియర్ స్క్రీన్ ప్లే ని వాడుకున్నారు. ఒక అమ్మాయి అబ్బాయి మధ్య పదేళ్ళ ప్రయాన్ని చాప్టర్ లుగా విభజించి చూపించాడు. ఏళ్ళు గడుస్తున్న కొద్ది వారో ప్రయాణంలో పరిణితి చూపించాలనేది దర్శకుడి తాపత్రయం. అయితే ఈ ప్రయత్నం తెరపైకి అంత ఆసక్తి రాలేదు. ఏ చాప్టర్ ఎప్పుడు నడుస్తుంది ? ఏ చాప్టర్ లో సీన్ చూస్తున్నామనే అయోమయం సామాన్య ప్రేక్షకుడిలో నెలకొనే పరిస్థితి. కాస్ట్యుమ్స్ ని సరిగ్గా పరిశీలిస్తే గానీ ఒక ఐడియా రాదు. నిజానికి ఇంత గంధరగోళం అనవసరం. ఈ కథని సింపుల్ గా లినియర్ గా చెప్పినా పెద్ద తేడా వుండదు.

అవసరాల రైటింగ్ లో ఒక చమ్మక్ వుంటుంది. లండన్ లో సంజయ్ స్నేహితుడు బ్రిటిష్ అమ్మాయి కి అవకాయ్ గురించి చెప్పే సన్నివేశం నవ్విస్తుంది. అలాగే సెకండ్ హాఫ్ లో నీలిమ రత్నబాబు పాత్రలో కూడా ఫన్ వుంటుంది. ఈ రెండు చోట్ల అవసరల మార్క్ స్పష్టంగా కనిపిస్తుంది. మిగతా చాలా చోట్లా సింపుల్ గా ఫ్లాట్ గా సాగిపోయిందనే భావన కలుగుతుంది. ప్రతి ప్రేమ కథలో వినోదం వుండాలని లేదు. సంజయ్, అనుపమ రెండూ పరిణితి చెందిన పాత్రలే. ఇలాంటి పాత్రలతో ప్రేమ కథ చెబుతున్నపుడు సంఘర్షణ బలంగా వుండాలి. ఇదే ఇందులో కొరవడింది. భావోద్వేగాలు తెరపై బలంగా రాలేదు.

2000 నుంచి 2010 వరకూ జరిగే ప్రయాణం ఈ కథ. ఈ ప్రయాణంలో నాగశౌర్యకు విభిన్నంగా కనిపించే అవకాశం ఇచ్చిన సినిమా ఇది. అప్పుడే ఇంటర్ పూర్తయిన కుర్రాడిగా, పీజీ చేస్తున్న యువకుడిగా, బిజినెస్ లో స్థిరపడిన వ్యక్తిగా ఇలా డిఫరెంట్ లుక్స్ లో కనిపించాడు నాగశౌర్య. సంజయ్ పాత్రలో తన నటన సహజంగా వుంది. వయసుకు తగ్గ పరిణితి చూపించాడు. అలాగే మాళవిక నాయర్ కూడా తెరపై చాలా సహజంగా కనిపించింది. వీరిద్దరి కెమిస్ట్రీ బావుంది.అవసరాల శ్రీనివాస్ చిన్న గెస్ట్ రోల్ లాంటి పాత్ర చేశాడు. సంజయ్ స్నేహితుడు, అలాగే నీలిమ రత్నబాబు పాత్రలు సరదా వుంటాయి. మిగతా పాత్రలు అంత ప్రాధన్యత లేదు.
సాంకేతికంగా సినిమా బావుంది. కల్యాణి మాలిక్ పాటలు వినసొంపుగా వున్నాయి. అయితే క్లాస్ టచ్ మరీ ఎక్కువైపోయింది. నేపధ్య సంగీతం లిమిటెడ్ గా చేశారు. నేపద్యం సంగీతం లేని చాలా సన్నివేశాలు ఇందులో కనిపిస్తాయి. కనుల చాటు మేఘమా పాట వినడానికి బావుంది. కెమరాపనితనం నీట్ గా వుంది. ఫ్రేమ్స్ అన్నీ అందంగా తీర్చిదిద్దారు.’’మార్చుకోవ‌డానికి చిన్నగా చిరిగిన వంద నోటా వాడు`అనే మాటలో అవసరాల చమత్కాం కనిపిస్తుంది. తనదైన శైలిలో ఓ ఫీల్ గుడ్ ప్రేమకథని ప్రజంట్ చేయాలనుకున్నాడు అవసరాల. అయితే టైటిల్ లో ఉన్నంత ఫీలు సినిమాలో కనిపించలేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close