రేవంత్ రెడ్డిపై పీజేఆర్ తనయుడి కేసు !

కొంపలంటుకుపోతున్నా సరే కాంగ్రెస్ నేతలు మారరు. ఆ విషయం మరోసారి నిరూపితమయింది. మాజీ ఎమ్మెల్యే , పీజేఆర్ తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి రేవంత్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెద్దమ్మతల్లి గుళ్లో బాలికపై అత్యాచారం జరిగిందని రేవంత్ రెడ్డి అన్నారని.. అలాంటిదేమీ జరగలేదని.. కాబట్టి తప్పుడు ప్రచారం చేసిన రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని విష్ణువర్థన్ రెడ్డి నేరుగా పోలీస్ కమిషనర్‌కే ఫిర్యాదు చేశారు. విష్ణువర్ధన్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా ఇలా ఫిర్యాదు చేశారని ఎవరికైనా తెలుస్తుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి అన్నది వేరు.

ఇటీవల ఓ పబ్ నుంచి మైనర్ బాలికను తీసుకెళ్లి గ్యాంగ్ రేప్‌కు పాల్పడిన కేసు సంచలనం సృష్టించింది. అందులో మజ్లిస్ , టీఆర్ఎస్ నేతల కుమారులు ఉన్నారు. ఆ కేసులో గ్యాంగ్ రేప్ జరిగింది.. పెద్దమ్మగుడి వెనుకాల ఉన్న ఖాలీ ఫ్లాట్‌లో . రేవంత్ రెడ్డి ఇదే విషయాన్ని చెప్పారు. పోలీసులు కూడా ఇదే చెప్పారు. కానీ విష్ణువర్దన్ రెడ్డి మాత్రం రేవంత్ స్పీచ్‌లో ఎక్కడో అన్వయ దోషం పట్టుకుని.. రేవంత్ రెడ్డిపై నేరుగా పోలీసులకే ఫిర్యాదు చేశారు. ఆయన రేవంత్ రెడ్డిని ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తున్నారని సులువుగానే అర్థం చేసుకోవచ్చు.

ఇటీవల విష్ణువర్ధన్ రెడ్డి సోదరి విజయారెడ్డిని రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌లో చేర్చుకున్నారు. అది ఆయనకు ఇష్టం లేదు. తన సీటు ఎక్కడ విజయారెడ్డికి ఇస్తారో అని ఆయన కంగారు పడుతున్నారు. కానీ ఆయన చలా రోజులుగా ఆయన కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డినే టార్గెట్ చేశారు. ఎప్పుడో అన్న మాటల్ని పట్టుకుని ఇప్పుడు విష్ణువర్ధన్ రెడ్డి రంగంలోకి దిగారంటే . మంచి టైమింగే చూసుకున్నారన్న వాదన వినిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close