రామ్ చ‌ర‌ణ్ కోసం ప్లాన్ బి

ఆర్‌.ఆర్‌.ఆర్ షూటింగ్‌కు అన్ని ఏర్పాట్లూ జ‌రుగుతున్నాయి. హైద‌రాబాద్ శివార్లలోని అల్యూమినియం ఫ్యాక్ట‌రీలో ఇది వ‌ర‌కే వేసిన సెట్లో.. ఇప్పుడు కొత్త షెడ్యూల్ మొద‌లెడ‌తారు. ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌పై యాక్ష‌న్ ఘ‌ట్టంతో ఈ షెడ్యూల్‌కి శ్రీ‌కారం చుడ‌తారు. అయితే… ముందు రామ్ చ‌ర‌ణ్‌కి సంబంధించిన స‌న్నివేశాల్ని పూర్తి చేయాల‌న్న‌ది రాజ‌మౌళి ఆలోచ‌న‌. ఎందుకంటే… `ఆర్‌.ఆర్‌.ఆర్‌` ముగిసిన వెంట‌నే ‘ఆచార్య‌’ సెట్లో చ‌ర‌ణ్ అడుగుపెట్టాలి. ఈ మేర‌కు చిరంజీవి నుంచి కూడా రాజ‌మౌళికి ఇది వ‌ర‌కే విన్న‌పాలు అందాయి. దాన్ని దృష్టిలో ఉంచుకున్న రాజ‌మౌళి – ముందుగా చ‌ర‌ణ్ క‌నిపించే స‌న్న‌వేశాల్ని వీలైనంత త్వ‌ర‌గా ముగించాల‌ని అనుకుంటున్నారు.

అయితే అదంత తేలిక కాదు. చ‌ర‌ణ్‌కి జోడీగా న‌టిస్తున్న అలియా భట్ కాల్షీట్లు సెట్ కావాలి. అలియా కాల్షీట్ల‌ని బ‌ట్టే… చ‌ర‌ణ్‌తో షూటింగ్ ఎంత త్వ‌ర‌గా ముగించొచ్చ‌న్న విష‌యం ఆధార ప‌డి ఉంటుంది. అజ‌య్ దేవ‌గ‌ణ్‌కి సంబంధించి మ‌రో కీల‌క‌మైన షెడ్యూల్ బాకీ ఉంది. అందులోనూ చ‌ర‌ణ్ ఉంటాడు. అవి కూడా కుద‌రాలి. అందుకే కొత్త షెడ్యూల్స్ విష‌యంలో రాజ‌మౌళి ప్లాన్ ఏ, ప్లాన్ బిల‌ను రెడీ చేసుకున్నారు. ప్లాన్ ఏ ప్ర‌కారం… అనుకున్న‌వి అనుకున్న‌ట్టు జ‌ర‌క్క‌పోతే.. ప్లాన్ బిని ఫాలో అవుతారు. ఇప్పుడు ఆర్‌.ఆర్‌.ఆర్ నుంచి చ‌ర‌ణ్ బ‌య‌ట‌ప‌డాలంటే.. అలియా, అజ‌య్‌ల డేట్లు స‌ర్దుబాటు అవ్వాలి. మ‌రి ఏం జ‌రుగుతుందో ??

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రియదర్శి తాటతీసే ‘డార్లింగ్’

హనుమాన్ విజయం తర్వాత నిర్మాత నిరంజన్ రెడ్డి కొత్త సినిమా ఖరారు చేశారు. ప్రియదర్శి హీరోగా ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి డార్లింగ్ అనే టైటిల్ పెట్టారు. అశ్విన్ రామ్ దర్శకుడు....

నినాదాలు చేస్తే సస్పెండ్ చేస్తారా..?

ఏపీ సీఎం జగన్ బస్సు యాత్రలో జై పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు చేసిన విద్యార్థులను సస్పెండ్ చేసింది ఆదిత్య విశ్వవిద్యాలయం. ఈమేరకు సర్క్యులర్ జారీ చేసిన వర్సిటీ అధికారులు.. సీఎం...

మార్గదర్శిపై జగన్ ప్రచారాన్ని రోజా కూడా నమ్మలేదే !

మార్గదర్శి నిండా మునిగిపోయిందని చిట్స్ పాడుకున్న వారికి డబ్బులు ఇవ్వడం లేదని జగన్ రెడ్డి అండ్ సీఐడీ కంపెనీ చేసిన ప్రచారం అంతా ఇంతా కాదు. కోర్టుల్లో చెప్పారు.. కేసుల్లో...

టీడీపీ కూటమికి వంగవీటి రాధా విస్తృత ప్రచారం !

ఎన్డీఏ కూటమి తరపున స్టార్‌ క్యాంపెయినర్‌ రంగంలోకి దిగారు వంగవీటి రాధా. గతంలో కాంగ్రెస్, PRP, వైసీపీ నుంచి పోటీ చేసిన ఆయన ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్నారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close