సైనిక చర్యపై సస్పెన్స్

యురీ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ పై ప్రతీకారం తీర్చుకోవాలంటూ దేశవ్యాప్తంగా డిమాండ్ బలంగా వినిపిస్తోంది. పాకిస్తాన్ పై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. పాక్ కు తగిన బుద్ధి చెప్పడానికి అనుసరించాల్సిన వ్యూహంపై కేంద్రం మంతనాలు జరుపుతోంది. తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం లేదు. అంతర్జాతీయంగా పాకిస్తాన్ ను ఓ దోషిగా నిలబెట్టింది. దాదాపు దోషిగా నిరూపించింది.

మరోవైపు మోడీ సర్కార్ మంతనాలు, కదలికలు సైనిక చర్యపై రకరకాల ఊహాగానాలకు తావిస్తున్నాయి. త్రివిధ దళాల అధిపతులతో ప్రధాని నరేంద్ర మోడీ శనివారం సుదీర్ఘంగా చర్చించారు. ప్రధాని అధికార నివాసంలో ఆర్మీ, నేవీ, వాయుసేన అధిపతులు మోడీతో భేటీ అయ్యారు. యురీ దాడి తర్వాత అనుసరించాల్సిన వ్యూహంపై వారితో మోడీ చర్చించారు. పాక్ ను దెబ్బతీయడం ఎలా అనేదానిపై జరిగిన చర్చల్లో ఏదో ఒక నిర్ణయానికి వచ్చారా లేదా అనేది మాత్రం తెలియదు. అయినప్పటికీ దీనిపై రకరకాల అంచనాలు వెలువడుతున్నాయి.

ఐక్యరాజ్య సమితి వేదికగా పాకిస్తాన్ ను పేరుపెట్టి మరీ ఉగ్రవాద దేశంగా భారత్ దాడి చేయడం అసాధారణం. కాశ్మీర్ పై జోక్యం చేసుకోవాలనే పాక్ ప్రధాని విన్నపాన్ని ఐరాస ప్రధాన కార్యదర్శి తిరస్కరించారు. పాకిస్తాన్ ను ఉగ్రవాద దేశగా ప్రకటించాలంటూ రిపబ్లికన్, డెమొక్రటిక్ పార్టీలకు చెందిన ఇద్దరు సభ్యులు అమెరికా హౌస్ ఆఫ్ కామన్స్ లో బిల్లును ప్రవేశ పెట్టారు. బలూచిస్తాన్ లో మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్న పాకిస్తాన్ పై ఆంక్షలు విధించాల్సి వస్తుందని ఐరోపా యూనియన్ హెచ్చరించింది.

ఇన్ని పరిణామాలు ఇంత వేగంగా చోటు చేసుకోవడం ఇదే మొదటిసారి. పాక్ ఉగ్రవాద దేశం అనడంలో ఇప్పుడే ఏ దేశానికీ అనమానం లేదు. ఇలా అంతర్జాతీయంగా మద్దతు కూడగట్టిన తర్వాత పరిమితగా భారత్ సైనిక చర్యకు దిగవచ్చనేది ఒక అంచనా. కేరళలోని కోజికోడ్ సభలో శనివారం మోడీ ప్రసంగం గమనిస్తే కొన్ని విషయాలు అర్థమవుతాయి.

పాకిస్తాన్ ప్రజలతో నేరుగా మాట్లాడుతున్నానంటూ అక్కడి ప్రభుత్వంపై అనూహ్యమైన దాడిచేశారు. ఒకేసారి స్వాతంత్ర్యం పొందిన భారత్, పాకిస్తాన్ మధ్య ఇంత తేడా ఎందుకుందనే ఆలోచన పాక్ ప్రజల్లో రేకెత్తించేలా మాట్లాడారు. పాక్ కు పీఓకేను పాలించడం చేతకాదు. పశ్చిమ పాక్, బాల్టిక్, గిల్గిట్, బలూచిస్తాన్ లను సరిగ్గా పాలించడం రాదని దుయ్యబట్టారు. యురీలో 18 మంది జవాన్ల బలిదానం వృథా కాదని కూడా హెచ్చరించారు. అంటే పాక్ పై ప్రతీకారం తీర్చుకోవడం తథ్యమనే చాలా మంది భావిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close