జనసేన, వైసీపీల వాదన మోడీ వినిపించారేమిటి..? ఇంత కన్నా కుట్రేముంటుంది..?

ఆంధ్రప్రదేశ్‌లో చాలా రోజులుగా కుట్ర రాజకీయాలు జరుగుతున్నాయని తెలుగుదేశం పార్టీ అనుమానిస్తోంది. ప్రత్యేకహోదా కేంద్రంగా..తమను ప్రజల ముందు దోషిగా నిలబెట్టే ప్రయత్నంలో భాగంగానే.. ప్యాకేజీ డ్రామా ఆడారని టీడీపీ అధినేత చంద్రబాబు చాలా గట్టిగా నమ్ముతున్నారు. పధ్నాలుగో ఆర్థిక సంఘం పేరు చెప్పి… ప్రత్యేకరోదా ఇవ్వడం సాధ్యం కాదని… కేంద్రం.. టీడీపీ అధినేతకు స్పష్టం చేసింది. పేరు లేకుండా అన్ని ప్రయోజనాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఓ ప్రకటన కూడా చేశారు. కానీ అమలు చేయలేదు. కానీ చంద్రబాబు ప్యాకేజీ తీసుకున్నారంటూ… ఓ వైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మరో వైపు పవన్ కల్యాణ్ రచ్చ ప్రారంభించారు. వీరిద్దరి వెనుక బీజేపీ ఉందని.. ఒక్కొక్క ఆధారం బయటకు వస్తూండటంతో.. టీడీపీ తట్టుకోలేకపోయింది. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేసింది.

కానీ తెలుగుదేశం పార్టీని అప్పటికే ట్రాప్‌లోకి లాగేశారు. ప్రత్యేకహోదాకు అంగీకరించారంటూ.. ప్రధానమంత్రి నరేంద్రమోడీ.. పార్లమెంట్‌లో ప్రసంగించడమే ఇందుకు నిదర్శనం. అసలు హోదా ఇస్తామన్న ప్రధానే.. ప్యాకేజీకి చంద్రబాబు అంగీకరించారని చెప్పుకొచ్చారు. అది అసాధ్యమన్న తర్వాతే కదా చంద్రబాబు అంగీకరీంచింది. అదేదో తప్పయినట్లు… ప్రజల ముందు ఏదో తప్పు చేసినట్లుగా చిత్రీకరించడానికి మోదీ.. అలాంటి ప్రకటన చేయడం ఎందుకు..?. ప్రత్యేకహోదా పోరాటంలో… వైసీపీని తాము ప్రొత్సహించినట్లు ప్రధాని మోదీ పరోక్షంగా అంగీకరించారు. వైసీపీలో ట్రాప్‌లో పడుతున్నానని… చంద్రబాబును మోడీ హెచ్చరించారట. టీడీపీ అధినేత అప్పటికైనా కుట్రలు కనిపెట్టారు కాబట్టి.. సరిపోయింది.. లేకపోతే ఈ పాటికి కార్నర్ చేసి ఉండే వారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీకి ఎలాంటి రాజకీయ ఆసక్తులు లేవు. ఏ పార్టీకి సీట్లు వచ్చినా .. అవి తమకే అనుకుంటోంది. ఈ విషయంలో చంద్రబాబు కన్నా.. జగనే బెటరని మోదీ భావిస్తున్నారు. ఎందుకంటే.. జగన్ జుట్టు కేసులతో తన చేతుల్లో పెట్టుకోవచ్చనుకుంటున్నారు. ఈ కారణగానే… ప్రత్యేకహోదా పేరుతో ప్యాకేజీ ఇస్తామని.. ఓ వైపు చంద్రబాబును కన్విన్స్ చేసి.. అదే తప్పన్నట్లుగా జగన్‌తో ప్రచారం చేయించారు. సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఇప్పుడీ కుట్రలన్నింటికి.. అవిశ్వాస తీర్మానంలో.. చంద్రబాబుపై మోడీ చేసిన వ్యాఖ్యలే ఉదాహరణగా నిలుస్తున్నాయి

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com