పోలవరం మాయ..! కాంట్రాక్టర్‌ను ఎంపిక చేసి రివర్స్ టెండర్..!?

పోలవరం రివర్స్ టెండర్లపై హైకోర్టు స్టే విధించినా ఏపీ సర్కార్ ఆగడం లేదు. డబ్బులిచ్చే కేంద్రం హెచ్చరిస్తున్నా.. లెక్క చేయడం లేదు. ఇలా ఎందుకు చేస్తున్నారో…? ఎందుకు ఇంత హడావుడి పడుతున్నారో..? ఎందుకు పాత కాంట్రాక్టర్లపై అంత వేగంగా వేటు వేశారో..? సామాన్యులకు అర్థం కావడం లేదు. అయితే.. ఆ రివర్స్ టెండర్ల కోసం మార్చిన రూల్స్… ఒక్కొక్కటిగా బయటకు వస్తూంటే.. ఇప్పటికే కాంట్రాక్టర్‌ను ఖరారు చేశారని… వారికి అధికారికంగా అప్పగించడానికే.. టెండర్ల ప్రక్రియ ప్రారంభించారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

రివర్స్ టెండర్లలో నిబంధనలన్నీ రివర్స్..!

మనం ఏదైనా ఇల్లు కట్టుకోవాలని.. ఎవరికైనా… కాంట్రాక్టుకు ఇవ్వాలంటే… ముందుగా ఏం చూస్తాం..? ఆయన అంతకు ముందు ఏ ఇళ్లు కట్టాడు..? ఎంత బాగా కట్టాడు..? మనకు కావాల్సిన టైప్ ఇళ్లు ఎన్ని కట్టాడు..? ఎలా కట్టాడు..? అనేది చూసుకుంటాం. అలాగే ఆయనకు ఇల్లు కట్టడానికి అవసరమైన సాంకేతికత అందుబాటులో ఉందా లేదా.. అన్నది కూడా చూసుకుంటాం. ఇక పోలవరం లాంటి భారీ ప్రాజెక్టుల కాంట్రాక్టు చేపట్టాలంటే… ఇవి ఇంకా ఎక్కువ పరిశీలించాల్సి ఉంటుంది. కానీ పోలవరం రివర్స్ టెండర్లలో… ఇవేమీ చూడరు. కేవలం… తమకు పనులు చేపట్టగలిగే ఆర్థిక సామర్థ్యం ఉందని.. బ్యాంక్ గ్యారంటీ లేదా.. డిమాండ్ డ్రాఫ్ట్ చూపిస్తే చాలు… కాంట్రాక్టర్లను ఖరారు చేస్తారు. సాంకేతిక, ఆర్థిక అర్హతలను కూడా… ఇంత వరకూ ఖరారు చేయలేదు. టెండర్లలో పేర్కొనలేదు. డీడీని చూసి టెండర్ ఖరారు చేసి… అప్పుడు ఆ అర్హతలు డిసైడ్ చేస్తారట. అంటే.. తమకు కావాల్సిన వారికి ఏ అర్హతలు ఉన్నాయో… వాటిని డిసైడ్ చేసి.. కాంట్రాక్టర్‌ను ఎంపిక చేస్తారు. అంటే.. ” ఇప్పటికే నిర్ణయించిన వ్యక్తి లేదా సంస్థకు కాంట్రాక్ట్ ఇవ్వడానికి..” ఈ రివర్స్ అన్నమాట.

“ఆ కాంట్రాక్టర్” కోసమే ఇతర నిబంధనలూ మార్పు..!?

పోలవరం రివర్స్ టెండర్లకు ఇప్పటికే కాంట్రాక్టర్ ను ఖరారు చేశారని.. వారికి ఏ ఏ అర్హతలు ఉన్నాయో.. లెక్క చూసుకుని.. వాటినే… రివర్స్ టెండర్లలో పెట్టారని.. ఇతర నిబంధనల సడలింపుతోనూ అర్థమవుతోందన్న అభిప్రాయం ఏర్పడుతోంది. గతంలో అనుభవం … పదేళ్లు ఉండేది. కానీ ఇప్పుడు చాలా కంపెనీలను ఎలిమినేట్ చేయడానికి 15 ఏళ్లు మార్చారు. ఈ విషయంలో…కావాల్సిన అనుభవం పెంచేసిన ప్రభుత్వం మరి సకాలంలో పనులు చేసిందా లేదా.. అన్న విషయాలను పరిగణనలోకి తీసకోవడానికి సిద్ధంగా లేదు. గత ఐదేళ్లలో మూడేళ్లు సక్రమంగా… నెట్‌వర్త్ మెయిన్‌టెయిన్ చేస్తే చాలన్నట్లుగా నిబంధనలు మార్చారు.

కేంద్ర విజిలెన్స్ నిబంధనలు కూడా పాటించనంత పాదర్శకత..!?

రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగానే వ్యవహరిస్తోంది. రివర్స్ టెండర్ల పేరుతో… స్వంత వారికి కాంట్రాక్టర్లను కట్ట బెట్టేందుకు కావాల్సినంతగా నిబంధనలు మార్చేస్తోంది. అయితే.. ఇవన్నీ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ నిబంధనలకు విరుద్ధం. సీవీసీ నిబంధనల ప్రకారం.. ప్రస్తుతం కాంట్రాక్టర్ టెక్నికల్, ఫైనాన్షియల్ అర్హతలను గుర్తించి.. షార్ట్ లిస్ట్ చేశారు. ఆ తర్వాత ఎల్ -1 కాంట్రాక్టర్‌ను ఇతర నిబంధనల ప్రకారం ఖరారు చేస్తారు. కేంద్ర, రాష్ట్రాల కాంట్రాక్టులన్నీ ఇవే నిబంధనలతో ఉంటాయి. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం.. ఈ రూల్స్ మార్చేశారు. అందుకే.. అందరిలోనూ అనుమానాలు ప్రారంభమయ్యాయి. ఇది ఇలాగే ఉంటే.. న్యాయవివాదాల్లో చిక్కుకోవడం చాలా సులువని.. పోలవరం నిర్మాణాన్ని ముందుగు సాగదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

బస్సు యాత్ర : వైసీపీ రాంగ్ స్ట్రాటజీ

ఎన్నికల షెడ్యూల్ వచ్చినా నోటిఫికేషన్ రావడానికి సమయం ఉండటంతో...జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రను ప్లాన్ చేసుకున్నారు. ఇరవై ఒక్క రోజుల పాటు ఇరవై ఒక్క పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి బస్సు యాత్ర...

చ‌ర‌ణ్ సినిమాలో.. సుకుమార్ హ్యాండ్ ఎంత‌?

సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌పై ద‌ర్శ‌కుడు సుకుమార్ ఓ సినిమా తీశాడంటే అందులో త‌న క్రియేటీవ్ ఇన్వాల్వ్‌మెంట్ కూడా త‌ప్ప‌కుండా ఉంటుంది. 'విరూపాక్ష‌' సినిమా స్క్రీన్ ప్లేలో సుకుమార్ ఇచ్చిన ఇన్ పుట్స్ బాగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close