రవిప్రకాష్‌ను అరెస్ట్ చేస్తేనే “మిషన్” కంప్లీట్ అవుతుందా..?

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ అరెస్ట్ చేసి కొన్ని రోజుల పాటైనా జైల్లో పెట్టాలనే లక్ష్యంతో పోలీసులు పని చేస్తున్నట్లుగా… తెలుస్తోంది. గత మూడు రోజులుగా.. ఆయన సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట హాజరయ్యారు. తాను సీఈవోగా ఉన్న సమయంలో.. కంపెనీ సెక్రటరీ.. దేవేందర్ అగర్వాల్… సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లుగా… ఆయనపై.. కొత్త యాజమాన్యం కేసు పెట్టింది. ప్రధానంగా ఇదే కేసు. మరో రెండు కేసులు ఉన్నాయి. మూడు రోజుల పాటు విచారణ జరిపింది మాత్రం.. ఫోర్జరీ కేసు పైనే.

పిలిపించి కూర్చొబెట్టి పంపించేసిన పోలీసులు..!?

విచారణలో.. పోలీసులు.. రవిప్రకాష్‌ను.. అంత లోతుగా ప్రశ్నించే ప్రయత్నం చేయలేదని.. తెలుస్తోంది. అదే సమయంలో… రవిప్రకాష్ కూడా పొడి పొడి సమాధానాలే ఇచ్చారు. మొదటి రోజు సాయంత్రం ఆయన సైబర్ క్రైమ్ ఆఫీసుకు రాగా… పెద్దగా ప్రశ్నించకుండానే.. తర్వాతి రోజు రమ్మని పంపించేశారు. రెండో రోజు… సుదీర్ఘంగా ఆఫీసులో కూర్చొబెట్టి… చాలా పరిమిత సమయం మాత్రమే.. పోలీసులు ప్రశ్నలు సంధించారు. రాత్రి రవిప్రకాష్‌ను పంపేసిన తర్వాత… ఆయన విచారణకు సహకరించడం లేదని మీడియాకు సమాచారం ఇచ్చారు. మూడో రోజు కూడా విచారణకు పిలిపించి.. రోజంతా ఖాళీగా కూర్చొబెట్టారు. అదే సమయంలో.. మరో కేసు విషయంలో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు రావాలని నోటీసులు ఇచ్చి పంపారు.

సహకరించడం లేదని ఎందుకు చెబుతున్నారు..?

పోలీసుల్ని గుప్పిట్లో పెట్టుకుని… హైదరాబాద్‌ అమ్రిష్ పురి వంటి విలన్… వేధిస్తున్నారని రవిప్రకాష్ అంటున్నారు. పోలీసుల వ్యవహారశైలి కూడా అలాగే ఉందన్న విమర్శలు వస్తున్నాయి. విచారణకు… రవిప్రకాష్ హాజరవుతున్నప్పుడు… తప్పనిసరిగా అరెస్ట్ చేయాలన్న పరిస్థితి ఉండదు. కానీ రవిప్రకాష్ విచారణకు హాజరు కావడం లేదనే సమాచారాన్ని మీడియాకు పంపి… సుప్రీంకోర్టు చెప్పినట్లుగా.. 48 గంటల మందు నోటీసు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. దాన్ని చూపి.. అరెస్ట్ కు రెడీ అవుతున్నట్లుగా తెలుస్తోంది. రవిప్రకాష్ చెబుతున్నట్లు.. కొంత మంది పెద్దల లక్ష్యం అదే కాబట్టి… దాన్ని నెరవేర్చే అవకాశం ఉందంటున్నారు.

శివాజీని ఎందుకు పట్టుకోలేకపోతున్నారు..?

రవిప్రకాష్ సన్నిహితుడు శివాజీ మాత్రం విచారణకు హాజరు కావడం లేదు. నిజానికి.. ఆయన పాత్ర ఈ కేసులో చాలా పరిమితం. ఆయన రవిప్రకాష్ వద్ద షేర్లు కొన్నారు. వారు ఎప్పుడు ఒప్పందాలు చేసుకున్నారు.. అది సక్రమమా.. అక్రమమా.. అన్నది వారిద్దరి మధ్య వ్యవహారం. ఎందుకంటే.. షేర్లు రవిప్రకాష్‌వి. కొనుక్కున్నది శివాజీ. ఆ స్వేచ్చ వారికి ఉంది. అయినప్పటికీ.. శివాజీని ఈ కేసులో మరో నిందితుడుగా పోలీసులు ప్రచారం చేస్తూండటంతోనే అసలు చిక్కు వస్తోంది. ఆయన కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నట్లు చెబుతున్నారు. కానీ పోలీసులు అరెస్ట్ చేయబోరని.. ఆయనే విచారణకు వచ్చే వరకూ ఎదురు చూస్తారన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

4 చోట్ల టీడీపీ అభ్యర్థుల మార్పు ?

తెలుగుదేశం పార్టీ నలుగురు అభ్యర్థులను మార్చాలని నిర్ణయించుకుంది. నరసాపురం సిట్టింగ్ ఎంపీ అయిన కనుమూరు రఘురామకృష్ణరాజు ఉండి అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దింపడం దాదాపు ఖాయమే. మంతెన రామరాజుకు...

విజయమ్మ బర్త్‌డే విషెష్ : షర్మిల చెప్పింది.. జగన్ చెప్పాల్సి వచ్చింది !

వైఎస్ విజయలక్ష్మి పుట్టిన రోజును వైఎస్ జగన్ గత మూడేళ్లలో ఎప్పుడూ తల్చుకోలేదు. సోషల్ మీడియాలో చిన్న పోస్టు కూడా పెట్టలేదు. కానీ ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో జగన్ కు...

ఆసుపత్రి వ్యాపారంపై మాధవీలత సంచలన వ్యాఖ్యలు

మాధవీలత... బీజేపీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి. ఎంఐఎంకు పెట్టని కోటగా ఉన్న హైదరాబాద్ సెగ్మెంట్ లో ఈసారి జెండా పాతుతామని చెప్తున్నా బీజేపీ నేతల వ్యాఖ్యలకు తగ్గట్టుగానే మాధవీలత అందరి దృష్టిని...

బీఆర్ఎస్ కు బిగ్ షాక్ – కాంగ్రెస్ లోచేరిన కేటీఆర్ బావమరిది..!

లోక్ సభ ఎన్నికల ముంగిట బీఆర్ఎస్ కు షాక్ ల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, కీలక నేతలు పార్టీని వీడుతుండగా తాజాగా కేటీఆర్ బావమరిది ఎడ్ల రాహుల్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close