దళిత దంపతులపై అరాచకానికి పాల్పడ్డ పోలీసు…?

✍ వ్యవసాయం చేసుకుంటూ జీవనాన్ని వెల్లదీస్తున్న ఒక సామాన్య కుటుంబానికి పోలీసులు చుక్కలు చూపించారు. ఈ ఘటన నూతనంగా ఏర్పడ్డ పెద్దపల్లి లో జరిగింది. రాత్రి పూట పొలానికి నీరు పెట్టడానికి వెళ్లిన దంపతులను పోలీసులు వివిధ ప్రశ్నలతో వేధించి నానా ఇబ్బందులకు గురి చేశారు. పిల్లలు మారం చేయడంతో ఆ దంపతులు పిల్లలతో కలిసి వారి సొంత ఆటోలో పొలానికి నీళ్లు పెట్టడానికి వెళ్లారు.

👉 అయితే అదే సమయంలో అక్కడ గస్తీ కాస్తున్న ఎస్సై వారిని చూసి ఏ పని మీద వచ్చారని ప్రశ్నించాడు.
అయితే వారు వెంటనే పొలానికి నీళ్లు పెట్టడానికి వచ్చానని చెప్పడం చాల్లే ఆపు నిన్ను చూస్తే పెద్ద కేసులా ఉన్నావ్.. దుకాణం నడుపుతున్నావా…? అని ప్రశ్నలతో వేధించారు. ఇంతలోనే అక్కడికి వచ్చిన ఆమె భర్త.. ఎస్సై ప్రవర్తనపై నిలదీశాడు. అంతే.. ఆ ఎస్సైకి ఎక్కడలేని కోపమొచ్చింది! నన్నే ప్రశ్నిస్తావా? అంటూ ఆయన్ను చితకబాదాడు. భార్య కాళ్లావేళ్లా పడ్డా కనికరించలేదు. జీపులో వారిద్దరినీ తీసుకెళ్లి స్టేషన్‌లో పడేశాడు. ధర్మారం ఎస్సై హరిబాబుపై అనుచితంగా ప్రవర్తించిన దేవేందర్, శ్యామలపై కేసు నమో దు చేశామని పెద్దపల్లి ఎస్సై శ్రీనివాస్‌ తెలిపా రు.

👉 దేవేందర్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించామన్నారు. ఏం చేస్తున్నారన్నందుకు ఎస్సైపై దౌర్జన్యం చేయడంతో వారిపై కేసు నమోదు చేశామని వివరించారు. శ్యామలను సోమవారం అరెస్టు చేస్తామన్నారు.

👉 తన భర్తను కొట్టొద్దని ఎంత వేడుకున్నా ఎస్సై శ్రీనివాస్‌ కనికరించలేదని శ్యామల కన్నీటి పర్యంతమైంది. పోలీసుల దెబ్బలకు నడవలేకపోతున్నాడని తెలిపింది. ఆదివారం తన భర్తను చూపించాలని పోలీసులను కోరినా చూపించలేదని వివరించింది. పోలీసుల తీరుకు నిరసనగా బొంపల్లికి చెందిన దళిత మహిళలు, సీఐటీయూ నాయకులు, టీఆర్‌ఎస్, టీడీపీ, బీజేపీ నాయకులు స్థానిక సివిల్‌ ఆస్పత్రి వద్ద రాస్తారోకో చేశారు. దళిత దంపతులపై అరాచకానికి పాల్పడ్డ పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఐద్వా జిల్లా కార్యదర్శి జ్యోతి డిమాండ్‌ చేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

ఐటెమ్ గాళ్‌…. పెద్ద స‌మ‌స్యే!

ఇది వ‌ర‌కు ఏ సినిమాలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలా? అని ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డేవారు. అనుకొన్నంత స్థాయిలో, సంఖ్య‌లో హీరోయిన్లు లేక‌పోవ‌డం, స్టార్ హీరోల క్రేజ్‌కు స‌రిప‌డా క‌థానాయిక‌లు దొర‌క్క‌పోవ‌డంతో...

ఇదేం స్ట్రాటజీ ఐ ప్యాక్ – గ్రాఫ్ పెరుగుతోందంటే ఆల్రెడీ తగ్గిపోయిందనే కదా అర్థం !

జగన్ మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరుగుతోందని ప్రచారం చేయాలి . మీకు ఎంత కావాలి ?. ఇది ఐ ప్యాక్ నుంచి వివిధ మీడియా సంస్థలకు.. సోషల్ మీడియా ఖాతాలకు .....

HOT NEWS

css.php
[X] Close
[X] Close