కత్తి మహేష్ పై ఏపీలో అప్రకటిత ఆంక్షలు..! ప్రెస్‌మీట్‌ను అడ్డుకున్న పీలేరు పోలీసులు..!!

హైదరాబాద్ నుంచి బహిష్కరణకు గురైన కత్తి మహేష్ పై ఆంధ్రప్రదేశ్ లోనూ ఆంక్షలు కొనసాగుతున్నాయి. రాముడు, సీతపై ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో.. ఆయనను హైదరాబాద్ పోలీసులు ఆరు నెలల పాటు నగర బహిష్కరణ విధించి.. కర్ణాటకలో విడిచిపెట్టారు. కత్తి మహేష్… రెండు రోజుల కిందట.. చిత్తూరు జిల్లా పీలేరు నియోజకకవర్గంలో ఉన్న స్వగ్రామానికి వచ్చారు. అక్కడ ఆయన మీడియా సమావేశం పెట్టాలనుకున్నారు. ఈ విషయం తెలిసి చిత్తూరు జిల్లా పోలీసులు కత్తి మహేష్‌ను అదుపులోకి తీసుకుని బెంగళూరు తీసుకెళ్లారు. అక్కడ విడిచిపెట్టారు.

కత్తి మహేష్ ను లా అండ్ ఆర్డర్ కారణంగా చూపి.. ఓ నరగం నుంచి బహిష్కరించడంతో ఏపీ పోలీసులు కూడా.. ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేయకపోయినా.. అదే తరహా ట్రీట్ మెంట్ ఇస్తున్నారు. కత్తి మహేష్.. మీడియా సమావేశంలో మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు మాట్లాడతారన్న ఉద్దేశంతోనే పోలీసులు ఆయననను పీలేరు నుంచి తరలించినట్లు చెబుతున్నారు. హైదరాబాద్ నుంచి నగర బహిష్కరణ చేసిన తర్వాత సోషల్ మీడియాలో తన అభిప్రాయాలను పోస్ట్ చేస్తున్నారు కత్తి మహేష్. అయితే రాముడిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.పైగా రాముడికి సంబంధించిన ఓ భక్తి గీతాన్ని స్వయంగా ఆలపించి సోషల్ మీడియాలో పెట్టారు. దానికి పరిపూర్ణానంద కూడా అభినందించారు.

కత్తి మహేష్.. సమాజంలో అశాంతికి కారణమయ్యేలా మాట్లాడుతున్నారన్న అభియోగాలు ఉండటంతో.. ఆయన ప్రెస్ మీట్లను ప్రసారం చేయడానికి మీడియా సంస్థలు కూడా సిద్ధంగా లేవు. రాముడిపై కత్తి మహేష్ చేసిన వ్యాఖ్యలను పదే పదే ప్రసారం చేసిన సంస్థకు ఇప్పటికే..తెలంగాణ పోలీసులు నోటీసులు ఇచ్చారు. అదే సమయంలో పరిపూర్ణానంద చేయబోయిన యాత్ర విషయంలో.. ప్రజల్లో అలజడి రేపడానికి ప్రయత్నించందన్న కారణంతో.. ఆయనకు సంబంధించిన భారత్ టుడే చానల్ ప్రసారాలనును దాదాపుగా నిలిపివేయించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా మీడియా వాచ్ కోసం ఓ బృందాన్ని ఏర్పాటు చేసింది. దీంతో.. కత్తి మహేష్ ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా.. ప్రసారం చేసేందుకు టీవీ చానళ్లు ఆలోచించాల్సిన పరిస్థితి. అసలు మీడియా ముందుకు రాకుండా… రెండు రాష్ట్రాల పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. దీంతో కత్తి మహేష్ కు ఆరు నెలలు పబ్లిసిటీ రాదని చెప్పుకోవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

రేవంత్ రెడ్డి యార్క‌ర్… ప్ర‌తిప‌క్షాలు క్లీన్ బౌల్డ్ అయిన‌ట్లేనా?

గ‌త కొంత‌కాలంగా బీఆర్ఎస్ రైతుల చుట్టూ రాజకీయం మొద‌లుపెట్టింది. పంట ఎండిపోతుంద‌ని, సాగుకు విద్యుత్ అంద‌టం లేద‌ని, ధాన్యం కొనుగోలు ఏమైంద‌ని, రుణమాఫీపై మౌనం ఎందుకు అంటూ నేత‌లంతా మూకుమ్మ‌డిగా రేవంత్ స‌ర్కారుపై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close