పందెం కోడి “బండి” దెబ్బకు ఠారెత్తుతున్న పోలీసులు..!

పందెం కోడి తరహాలో సై అంటే సై అని రాజకీయం చేస్తున్న బండి సంజయ్ దెబ్బకు పోలీసులు సైతం హడలెత్తిపోతున్నారు. బీజేపీ కార‌్యకర్తలపై చిన్న లాఠీచార్జ్ జరిగినా ఆయన..  నేరుగా సీఎం ఫామ్‌హౌస్‌ ముట్టడికి  పిలుపునిస్తున్నారు. నేరుగా తాము కూడా దాడి చేస్తామని హెచ్చరిస్తున్నారు. అలా అనడమే కాదు.. క్షేత్ర స్థాయిలో రంగంలోకి దిగిపోతున్నారు. జనగాంలో బీజేపీ నేతలు పెట్టిన ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తీసేశారని… మున్సిపల్ ఆఫీసులో రచ్చ చేశారు బీజేపీ కార్యకర్తలు. వారు భయపడి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు … వచ్చి ఆ బీజేపీ కార్యకర్తల్ని కొట్టుకుంటూ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అలా తీసుకెళ్లిన వారిలో జనగాం పట్టణ బీజేపీ అధ్యక్షుడు కూడా ఉన్నారు. కొడుతున్న దృశ్యాలు మీడియాలో హైలెట్ కావడంతో బండి సంజయ్ … కాలుదువ్వేశారు.

వెంటనే చలో జనగాంకు పిలుపునిచ్చారు. కార్యకర్తలను తీసుకుని వెళ్లిపోయారు. చివరికి పోలీసులు.. ఆ ఘటనపై విచారణకు ఆదేశించాల్సి వచ్చింది. బండి సంజయ్ ను సంతృప్తి పరచడానికి పోలీసులు … తమ విధుల్లో భాగంగా చేసిన  ఓ చిన్న పాటి లాఠీచార్జ్ పైనా విచారణ చేయిస్తున్నారు ఉన్నతాధికారులు. కాదంటే బండి సంజయ్ ఏ ఆందోళనలకు పిలుపునిస్తారో.. ఏ డీజీపీ ఆఫీసును ముట్టడిస్తారో… ఫామ్‌హౌస్‌లోకి ఎక్కడ చొరబడతారోననన్న ఆందోళన వారిలో కనిపిస్తోంది. అందుకే ఎందుకొచ్చిన తంటా అన్నట్లుగా సర్దుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు.
 
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు మంచి రంజు మీద ఉన్న పొలిటికల్ పుంజు ఏదంటే..  చుట్టూ చూడాల్సిన పని లేదు. టక్కున బండి సంజయ్ పేరు చెప్పేయవచ్చు.  మాటలతో అయినా చేతలతో అయినా ఆయన ముందూ వెనుకా చూడకుండై సై అంటున్నారు. తిరుగులేని శక్తిగా ఉన్న టీఆర్ఎస్ ఇలాకాలోకి వెళ్లి తొడకొడుతున్నారు. ఆయన తీరు చూసి.. టీఆర్ఎస్ నేతలు డిక్కీ బలిసిన కోడి చికెన్ షాప్ ముందుకెళ్లి తొడకొట్టినట్లుగా ఉందని సైటెర్లు వేస్తున్నారు. అయితే..  ఈ పందెం కోడిని తేలిగ్గా తీసుకోవడానికి వారు కూడా సిద్ధంగా లేరు. సీరియస్‌గానే తీసుకుంటున్నారు.  

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సుప్రీం చెప్పినా ఎన్నికలు జరిగే పరిస్థితి లేదన్న వెంకట్రామిరెడ్డి..!

ఉద్యోగ సంఘాల నేత వెంకట్రామిరెడ్డి .. ఎస్ఈసీ నిమ్మగడ్డను చంపే హక్కు కూడా ఉందన్నట్లుగా మాట్లాడి సంచలనం సృష్టించారు. ఇప్పుడు తన మాటలు వక్రీకరించారని చెప్పుకోవడానికి మీడియా ముందుకు వచ్చి మరింత వివాదాస్పదమైన...

వ్యాక్సినేషన్ ఉన్నా గుజరాత్‌లో స్థానిక ఎన్నికల నోటిఫికేషన్..!

పంచాయతీ ఎన్నికల అంశం ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర ఉత్కంఠకు కారణం అవుతోంది. వ్యాక్సినేషన్ వల్ల ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని ఏపీ సర్కార్ సుప్రీంకోర్టులో బలంగా వాదించాలని నిర్ణయించుకుంది. ఎన్నికలు జరపాలని అనుకుంటే వ్యాక్సినేషన్...

అప్పట్నుంచి గడ్డం తీసుకోని ఎల్వీ సుబ్రహ్మణ్యం..!

మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణం హఠాత్తుగా గుంటూరులో కనిపించారు. రామ మందిరానికి విరాళాలు సేకరించే ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. గబుక్కున ఆయనను చూసిన వారు చాలా మంది పోల్చుకోలేకపోయారు. ఎవరో స్వామిజీ ప్యాంట్,...

నిమ్మగడ్డ కింకర్తవ్యం..!?

ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఓ స్ట్రిక్ట్ ఐఏఎస్ అధికారిగా పని చేసుకుంటూ పోతున్నారు. ఓ రాజ్యాంగ వ్యవస్థకు అధిపతిగా తనకు ఉన్న అధికారాలను పక్కాగా ఉపయోగించుకుంటున్నారు. సర్వీస్ రూల్స్...

HOT NEWS

[X] Close
[X] Close