ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తే నష్టపోయేది ఎవరు?

ఇప్పుడు రాజకీయ పార్టీల నేతలు తమ ప్రత్యర్దులని ఏ మాటన్నా తిరిగి అది బ్యాక్ ఫైర్ అవుతోంది. అందుకు ప్రధాన కారణం అందరూ కలిసికట్టుగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేస్తూ, రాజకీయాలలో నైతిక విలువలని మరో మెట్టు క్రిందకు దించడమే. ఒకప్పుడు తెదేపా ఎమ్మెల్యేలను, నేతలను తెరాస ఫిరాయింపులకి ప్రోత్సహిస్తునప్పుడు అది ‘అన్యాయం..అక్రమం..అప్రజాస్వామికం..’ అంటూ విమర్శలు గుప్పించిన తెదేపాయే ఇప్పుడు వైకాపా ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయింపులకి ప్రోత్సహిస్తోంది. కనుక ఇప్పుడు అది తెరాసని తప్పు పట్టలేని పరిస్థితి కల్పించుకొంది. ఒకప్పుడు వైకాపా కూడా కాంగ్రెస్, తెదేపాల ఎమ్మెల్యేలని పార్టీ ఫిరాయింపులకి ప్రోత్సహించింది కనుక ఇప్పుడు అది కూడా తెదేపాను తప్పు పట్టలేదు కానీ ఆనాడు వారిచేత రాజీనామాలు చేయించి ఉపఎన్నికలకి వెళ్ళింది కనుక తెదేపాను నిలదీస్తోంది.

ఈ ప్రాంతీయ పార్టీలు రాష్ట్ర స్థాయిలో పోరాడుకొంటుంటే, జాతీయ పార్టీలయిన కాంగ్రెస్, భాజపాలు జాతీయ స్థాయిలో పోరాడుకొంటున్నాయి. అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలలో ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికయిన కాంగ్రెస్ ప్రభుత్వాలను దొడ్డి దారిన భాజపా కూల్చివేసినందుకు కాంగ్రెస్ పార్టీ దానిపై విమర్శలు గుప్పిస్తోంది. దాని ఆవేదన సహేతుకమే కానీ ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా దేశంలోని కాంగ్రెసేతర ప్రభుత్వాలను ఇలాగే కూల్చివేసింది కనుక భాజపా కూడా దానిని వేలెత్తి చూపగలుగుతోంది. 60 సం.లలో 91సార్లు కాంగ్రెసేతర ప్రభుత్వాలను కూల్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని భాజపా తెలంగాణా శాసనసభ పక్ష నేత లక్ష్మణ్ విమర్శించారు. అటువంటి పార్టీకి ప్రజాస్వామ్యం గురించి ప్రశ్నించే హక్కు లేదని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన తప్పునే భాజపా ప్రభుత్వం కూడా చేస్తోంది కనుక అది తప్పు కాదని ఆయన చెపుతున్నట్లుంది.

ఈవిధంగా రాజకీయ పార్టీలన్నీ కలిసి ప్రజాస్వామ్యాన్ని ఖూని చేసేస్తూ, దాని ఎవరూ ప్రశ్నించకూడదని కోరుకొంటుంటే చివరికి ఇది ఎక్కడికి దారి తీస్తుందో ఎవరూ ఊహించలేరు. ప్రజాస్వామ్యాన్ని దాని విలువలను కాపాడుకొన్నంతవరకే రాజకీయ పార్టీలకి మనుగడకి అవకాశం ఉంటుంది. ఉదాహరణకి ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాలలో ప్రతిపక్షమే లేకుండా చేయాలని తెదేపా, తెరాసలు చేస్తున్నాయి. అలాగే దేశంలో భాజపాయేతర ప్రభుత్వాలను కూల్చివేయాలని భాజపా ప్రయత్నిస్తోంది. అవి చేస్తున్న ఈ అనైతిక రాజకీయాలు, అవలంభిస్తున్న అప్రజాస్వామిక విధానాల వలన చివరికి మళ్ళీ అవే నష్టపోతున్నాయి. తెలంగాణాలో తెదేపా తుడిచిపెట్టుకొనిపోవడం, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలలో కాంగ్రెస్ ప్రభుత్వాలు కూలిపోవడమే అందుకు ప్రత్యక్ష ఉదాహరణలు. రేపు మళ్ళీ పరిస్థితులు మారితే, అప్పుడు భాజపా, తెదేపా, తెరాసలకు కూడా మళ్ళీ ఇవే చేదు అనుభవాలు ఎదుర్కోకతప్పదు. కనుక రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు తమకి రక్షణ కవచం వంటి ప్రజాస్వామ్యాన్ని చిద్రం చేస్తే, ప్రతిపక్షంలోకి మారిన తరువాత వాటిని కాపాడేందుకు ఆ కవచం ఉండదు. అప్పుడు దాని గురించి ఎంత వగచినా ప్రయోజనం కూడా ఉండదు. ఇంత చిన్న విషయాన్ని పట్టించుకోకుండా అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు చెలరేగిపోతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పరశురాం డబ్బులు వెనక్కి ఇస్తాడా ?

ఫ్యామిలీ స్టార్ నిరాశ పరిచింది. విజయ్ దేవరకొండ, పరసురాం సక్సెస్ కాంబినేషన్ లో మంచి అంచనాలతో వచ్చిన సినిమా అంచనాలని అందుకోలేకపోయింది. గీతగోవిందం మ్యాజిక్ మరోసారి వర్క్ అవుట్ అవుతుందని భావించారంతా. కానీ...

మాధవీలత ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా మాధవీలత ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. పాతబస్తీ గడ్డపై బీజేపీ ఎగరేసి ఒవైసీకి ఓటమి రుచి చూపిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు....

ఎన్నికల వరకు జగన్ అంతే..!?

ఏపీ సీఎం జగన్ రెడ్డిపై రాయి దాడి జరిగి రెండు వారాలు కావొస్తోంది. బస్సు యాత్రలో భాగంగా ఓ వ్యక్తి రాయి విసరడంతో జగన్ ఎడమ కంటిపైన స్వల్ప గాయమైంది. బ్యాండేజ్...

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close