కేరళకు మొన్న ప్రకృతి విపత్తు…! ఇప్పుడు రాజకీయ విపత్తు..!

అయ్యప్ప స్వామిని ఇద్దరు మహిళలు దర్శించుకున్నారంటూ.. బయటకు వచ్చిన వీడియో.. అగ్గి రాజేసింది. కేరళ మొత్తం ఇది అంటుకుంది. రాజకీయ అవసరం కోసం కాచుకు కూర్చున్న పార్టీలు… తమ శాయశక్తులా… కేరళ ఇమేజ్‌ను.. దెబ్బ తీసి.. తమ రాజకీయ పార్టీల ఇమేజ్‌ను.. పెంచుకునే ప్రయత్నం చేశారు. ప్రజల ఆస్తులు, వారి జీవితాలను కనీసం పరిగణనలోకి తీసుకోవడం లేదు.

సుప్రీంకోర్టు తీర్పు నచ్చకపోతే బీజేపీ ఆర్డినెన్స్ ఇవ్వొచ్చు కదా..!?

శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశానికి అవకాశం కల్పిస్తూ… సమాన హక్కుల పేరిట.. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పుడు… దాదాపుగా అందరూ స్వాగతించారు. చివరికి ఆరెస్సెస్ కూడా. గతంలో శనిసింగనాపూర్ లాంటి ఆలయాల్లో మహిళలకు ప్రవేశం లేకపోతే.. ఆరెస్సెస్ లాంటి సంస్థలే కోర్టుకెళ్లి ప్రవేశం ఇప్పించారు. శబరిమల ఆలయంలోకి మహిళలను అనుమతించాల్సిందేనంటూ… పోరాడిన సంస్థల జాబితాలో ఆరెస్సెస్ కూడా ఉంది. తీర్పును స్వాగతించిన గంటల వ్యవధిలోనే మాట మార్చి… ధిక్కరించడం ప్రారంభించారు. ఆందోళనలకు తెర తీశారు. కేరళలో ఉనికి కోసం తంటాలు పడుతున్న బీజేపీ కోసం… అయ్యప్ప స్వామిని ఆయుధంగా వాడుకోవడం ప్రారంభించారు. బీజేపీకి సంప్రదాయాల పట్ల.. అంత నమ్మకం ఉంటే… ఒక్క ఆర్డినెన్స్ ఇస్తే సమస్య పరిష్కారం అయిపోతుంది. ఎవరూ.. వ్యతిరేకించరు. కానీ.. ప్రజల జీవితాలను ఎంతగా చిన్నాభిన్నం చేసి అయినా సరే.. రాజకీయం చేయడమే బీజేపీకి కావాలి కాబట్టి.. ఈ వివాదం ఇలా రగులుతూనే ఉంచుంది.

సంప్రదాయాలకు చట్టాలు వర్తింప చేసి ఏం సాధించారు..?

సంప్రదాయాలకు చట్టాలు వర్తిస్తాయని.. సుప్రీంకోర్టు ఎలా అనుకుందో కానీ… శబరిమల ఆలయంలోకి.. మహిళలు కూడా వెళ్లవచ్చని.. అందరికీ సమానత్వం ఉందని తీర్పు ఇచ్చింది. కానీ… అది భక్తుల విశ్వాసం. అక్కడ అధికారికంగా ఎలాంటి నిషేధం లేదు. కారణం ఏదైనా ..యాభై ఏళ్లలోపు మహిళల్ని అనుమతించరు. అనుమతించరు అనే దాని కన్నా… వెళ్లరు అని చెప్పడం కరెక్ట్. అయ్యప్పపై విశ్వాసం ఉన్న వాళ్లే.. ఆలయానికి వెళ్తారు. ఆ విశ్వాసం ఉన్న వాళ్లెవరూ… సంప్రదాయాలను.. అధిగమించరు. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ.. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది కాబట్టి.. అయ్యప్పపై నమ్మకం లేకపోయినా… గుళ్లోకి వెళ్లడాన్ని తమ జన్మహక్కుగా భావించారు… ఇద్దరు మహిళలు. అది తమ హీరోయిజానికి ప్రతీకగా ఫీలయ్యారు. వారికి నమ్మకం లేని దేవుడి దగ్గరకు తీసుకెళ్లడానికి అక్కడి ప్రభుత్వం మరింత నాటకాలు ఆడింది. ఫలితంగా కేరళ రాజుకుంది.

ఈ రాజకీయ విపత్తు నుంచి కేరళను కాపాడే వాళ్లెవరు..?

కొద్ది రోజుల కిందట…కేరళకు వరదలు వస్తే… దేశమే కాదు.. ప్రపంచం మొత్తం స్పందించింది. గాడ్స్ ఓన్ కంట్రీ కష్టాల్లో ఉందని.. తలా ఓ చేయి వేశారు. అది ప్రకృతి విపత్తు కాబట్టి… కులమతాలకు అతీతంగా అందరూ స్పందించారు. కానీ.. ఇప్పుడు రాజకీయ విపత్తు.. కేరళను చుట్టుముట్టింది. దీని నుంచి ఎవరూ కాపాడలేరు. బయట శక్తులు పెట్టిన చిచ్చుకు కేరళ ప్రజలు.. తమలో తాము విభజనకు గురై సొంత రాష్ట్రాన్ని అతలాకుతలం చేసుకుంటున్నారు. ఇప్పుడు ఎవరూ సాయం చేయడానికి రారు. రాజకీయ విపత్తులో కేరళ నష్టపోవాల్సిందే..!

—- సుభాష్

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

విశ్వ‌క్ ‘లైలా’వ‌తారం!

https://www.youtube.com/watch?v=9STsOoGDUfA లేడీ గెట‌ప్పులు వేయాల‌న్న ఆశ‌.. ప్ర‌తీ హీరోకీ ఉంటుంది. స‌మ‌యం సంద‌ర్భం క‌ల‌సి రావాలంతే! ఒక‌ప్ప‌టి అగ్ర హీరోలంతా మేక‌ప్పులు మార్చి, శారీలు క‌ట్టి - ఆడ వేషాల్లో అద‌ర‌గొట్టిన‌వాళ్లే. ఈత‌రం హీరోలు...

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close