భాజపాకి రెండు రాష్ట్రాలలో రాజకీయ శూన్యమే  

రాజకీయ పార్టీలు కూడా ప్రతీ జిల్లాలో, రాష్ట్రంలో జరిగే ఎన్నికలలో తమ పార్టీయే గెలుస్తుందని కలలు కంటుంటారు. అందుకోసం అవి ఒక కొత్త పదం కనిపెట్టాయి. అదే…రాజకీయ శూన్యత. భాజపాకి ఇప్పుడు దానినే తారక మంత్రంగా జపిస్తోంది.

రెండేళ్ళ క్రితమే ఆంధ్రాని ఆ ‘శూన్య జాబితా’లో చేర్చిన భాజపా ఇప్పుడు తాజాగా తెలంగాణా రాష్ట్రాన్ని కూడా చేర్చేసింది. ఆ రెండు రాష్ట్రాలలో కూడా దానికి అంతా (రాజకీయ) శూన్యమే కనిపిస్తోందిట! కనుక దానిని భర్తీ చేయవలసిన బాధ్యతని కూడా తన భుజస్కంధాలపైకే ఎత్తుకోక తప్పడంలేదు పాపం.

తెలంగాణా రాష్ట్ర భాజపా అధ్యక్షుడిగా డా. లక్షణ్ నిన్న బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు పార్టీ నేతలను, కార్యకర్తలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ “తెలంగాణాలో రాజకీయ శూన్యత కనబడుతోంది నాకు. నానాటికి అది ఇంకా పెరుగుతోందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో భాజపా ఎదగడానికి ఇప్పుడు మంచి సానుకూల పరిస్థితులు, అవకాశం ఉన్నాయి. వాటిని వినియోగించుకొని వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో భాజపా బలపడి ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాలి. తెలంగాణాలో భాజపాకి బలమయిన క్యాడర్, ప్రజాధారణ రెండూ ఉన్నాయి. పార్టీలో నాయకులు హైదరాబాద్ లో కంటే జిల్లాలలో గ్రామాల్లోనే ఎక్కువ తిరుగుతూ ప్రజాసంపర్కం పెంచుకోవాలి. ప్రతీ గ్రామంలో భాజపా జెండా ఎగరాలి. విజయానికి ఇంతకంటే షార్ట్ కట్స్ లేవు..ఉండవు,” అని చెప్పారు.

తెలంగాణాలో తెరాస పార్టీ తన అధికారాన్ని సుస్థిరం, శాస్వితం చేసుకొనే ఉద్దేశ్యంతోనే రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలనన్నిటినీ ఒకటొకటిగా తుడిచిపెట్టేస్తోంది. కనుక అక్కడ ఏర్పడింది రాజకీయ శూన్యత కాదు అధికార కేంద్రీకరణ…ఇంకా చెప్పాలంటే వంశపారంపర్య పాలనకి దానిని నాందిగా చెప్పుకోవచ్చు. ఆంధ్రాలో అధికారంలో ఉన్న తెదేపా కూడా ఇప్పుడు అదే ఫార్ములాని ఫాలో అయిపోతోంది కనుక అక్కడా అదే పరిస్థితి నెలకొని ఉందని చెప్పవచ్చు. కనుక దానర్ధం భాజపాకి అవకాశాలు ఏర్పడ్డాయని కాదు.

తెలంగాణాలో భాజపా అసలు పరిస్థితి ఏమిటో అందరూ చూస్తూనే ఉన్నారు. రాష్ట్రంలో భాజపా బలపడే అవకాశాలున్నప్పటికీ పార్టీ నేతలందరూ కేవలం హైదరాబాద్ కే పరిమితం అయిపోతున్నారని ఏడాదిన్నర క్రితం అమిత్ షా చెప్పిన మాటలనే మళ్ళీ ఇప్పుడు వెంకయ్య నాయుడు కూడా చెప్పాడం గమనార్హం. హైదరాబాద్ కే అంటుకుపోయి కూర్చొన్నా కూడా భాజపా గ్రేటర్ ఎన్నికలలో గెలవలేకపోయింది. మరి అటువంటప్పుడు రాష్ట్రంలో ఏవిధంగా అధికారంలోకి రావాలని కలలు కంటోందో?

ఇంక ఆంధ్రాలో తెదేపాతో తెగతెంపులు చేసుకొంటే భాజపా పరిస్థితి ఏమిటో వారికే తెలుసు. కనుక రాజకీయ శూన్యం పేరిట ఆత్మవంచన చేసుకొంటూ తమ పార్టీ భవిష్యత్కా ని శూన్యం చేసుకొనే బదులు, ఇప్పటి నుంచే అందరూ కలిసి పార్టీని గ్రామస్థాయి నుంచి పటిష్టం చేసుకొంటే మంచిది కదా.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close