కేశినేని ఫ్యామిలీలో పొలిటికల్ చిచ్చు !

కేశినేని కుటుంబంలో రాజకీయ చిచ్చు ప్రారంభమైంది. త‌న పేరు,హోదాను ఉపయోగించుకొని, గుర్తు తెలియని వ్యక్తులు వ్య‌వ‌హ‌రాలు సాగిస్తున్నార‌ని కేశినేని నాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన సోదరుడు చిన్నీ పేరు చెప్పకుండా విజయవాడ పార్ల మెంటు సభ్యుడిగా తాను వినియోగించే వీఐపీ వాహన స్టిక్కర్ నకిలీది సృష్టించి, విజయవాడ, హైదరాబాద్ నగరాల్లో తిరుగుతు,త‌న పేరు వాడుకుంటున్నార‌ని ఆయ‌న ఆరోపించారు.వాహనం నెంబరు టీఎస్ 07 హెచ్ డబ్ల్యూ 7777గా పేర్కొంటూ విజ‌య‌వాడ పటమట పోలీసులకు ఎంపీ కేశినేని నాని ఫిర్యాదు చేశారు.

మే నెల 27న ఎంపీ నాని ఫిర్యాదు చేయగా జూన్ 9వ తేదీన పోలీసులు ఎఫ్ఐ ఆర్ నమోదు చేశారు. ఇదే వాహనాన్ని సోమవారం హైదరాబాద్ పోలీసులు గుర్తించి తనిఖీ చేశారు. అన్నీ సవ్యంగానే ఉన్నట్లు గుర్తించి వదిలివేశారు. ఆ వాహనం కేశినేని నాని సోదరుడు చిన్నీది తేలడంతో వివాదం ప్రారంభమయింది.విజయవాడ ఎంపీగా కేశినేని నాని టీడీపీ నుంచి రెండు సార్లు గెలుపొందారు. ఎన్నికల ప్రచారంలో కూడ సోదరుడు కేశినేని చిన్ని కీలకపాత్ర పోషించారు. ఇటీవల చిన్ని కూడా టీడీపీ టిక్కెట్ కోసం ప్రయత్నిస్తున్నారన్న సమాచారం రావడంతో కేశినేని నాని సోదరుడిపై ఆగ్రహం పెంచుకున్నట్లుగా తెలుస్తోంది.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న కుమార్తె, ప్ర‌స్తుత టీడీపీ కార్పోరేట‌ర్ శ్వేత‌ను తూర్పు నియోజ‌క‌వ‌ర్గం నుండి బ‌రిలో కి దింపాలని కేశినేని నాని భావిస్తున్నారు. అయితే చిన్నీ కూడా రేసులోకిరావడంతో ఇప్పుడు సంబంధాలు తెంచుకున్నట్లుగా కనిపిస్తోంది. తనపై నాని కేసు పెట్టడంతో చిన్నీ ప్రెస్‌మీట్ పెట్టారు. కేశినేని నాని మాకు శత్రువు కాదు.. మా సొంత అన్న అని, తాను కేవలం పార్టీలో సాధారణ కార్యకర్తనని చెప్పారు. పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేస్తానని తాను ఎవరినీ టిక్కెట్ అడగలేదని క్లారిటీ ఇచ్చారు. పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశాల ప్రకారం పని చేయడానికి తాను ఎప్పుడూ సిద్ధమేనన్నారు. చంద్రబాబు ఆదేశిస్తే, సోదరుడు కేశినేని నాని గెలుపు కోసం పని చేస్తానని చెప్పారు.

కుటుంబ పరంగా పరిష్కరించుకోవాల్సిన వివాదాన్ని పోలీస్ స్టేషన్ వరకూ తీసుకెళ్లడంతో కేశినేని కుటుంబం వ్యవహారం హాట్ టాపిక్ గా మారుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close