‘రాచకీయ’ వివాదాల సుడిగుండంలో ‘పాపం’ తిరుమలేశుడు!

1. తిరుమలలో రాజకీయ కార్యకలాపాలు నిషిద్ధం. నాడు, నేడు అదే మాట వల్లిస్తూనే ఉంటారు. కానీ, ఆచరణలో ‘కంచే చేను మేసిన’ సామెతగా ఉల్లంఘిస్తూనే ఉంటారు.

2. టిటిడి వ్యవస్థను సంకుచిత, స్వార్థపూరిత రాజకీయాల సుడిగుండంలోకి నెట్టారు, నెడుతూనే ఉన్నారు.

3. శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కళాశాల, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో 1975 – 80 మధ్య కాలంలో ఉన్నత విద్యను ఆర్జించే సదవకాశం నాకూ లభించింది. ఆ కృతజ్ఞత ఆ సంస్థ పట్ల నాకున్నది.

4. యస్.వి.ఆర్ట్స్ కళాశాలలో నాకు విద్యను బోధించిన గౌరవనీయమైన అధ్యాపకులు ఒకరు ఫోన్ చేసి రమణ దీక్షకులు గారు లేవనెత్తిన వివాదాస్పద అంశాలపై తన ఆవేదనను పంచుకొన్నారు. వారు దైవభక్తి ఉన్న వారే. ఉద్యోగ విరమణ తరువాత ఒక ప్రతిష్టాత్మక విద్యా సంస్థకు గౌరవ సంచాలకులుగా బాధ్యతలు నిర్వహిస్తూ, ఆ సంస్థ అభివృద్ధికి అవిరళ కృషి చేస్తూ, అందరి మన్ననలను పొందుతున్న పెద్దలు, టిటిడి కార్యకలాపాలపై లోతైన, స్పష్టమైన అవగాహన ఉన్న వారే. రమణ దీక్షితులు గారి ప్రవర్తన, ఆరోపణల పట్ల ఆవేదన చెంది, శిష్యుడను కాబట్టి నాతో పంచుకొన్నారు.

5. దేవుడున్నాడా! అన్న సందేహాన్ని వ్యక్తం చేసే నాలాంటి వాడికి పరాలేదు దేవుని సన్నిధిలో దశాబ్ధాల పాటు పూజలు, పునస్కారాలు చేసిన, చేస్తున్న వారికి కూడా దేవుడంటే భక్తి గానీ, భయం గానీ లేవని ఈ పరిణామాలు చెప్పకనే చెబుతున్నాయని సంతృప్తి కలుగుతున్నది. అది వేరే విషయం.

6. తిరుమల తిరుపతి దేవస్థానం(టిటిడి) ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక కార్యకలాపాలతో పాటు విద్యా వ్యాప్తికి, ప్రజారోగ్య పరిరక్షణ, అంగ వైకల్యం ఉన్న పిల్లల సంరక్షణ మరియు శిక్ష, తిరుమలతో పాటు తిరుపతి, దాని పరిసర ప్రాంతాలలో మౌలిక సదుపాయాల కల్పన, తదితర సామాజికాభివృద్ధి కార్యకలాపాలకు కూడా పెద్ద ఎత్తున భక్తులు సమర్పించుకొంటున్న కానుకల సొమ్ము నుండి వెచ్చిస్తున్నారు. తాము నిర్వహిస్తున్న సంస్థలతో పాటు స్వయం ఉపాథి రంగంలో భారీగా ఉపాథి కల్పిస్తున్న సంస్థ టిటిడి.

7. కరవు కాటకాల మధ్య చిక్కి శల్యమౌతున్న వెనుకబడ్డ రాయలసీమ సమగ్రాభివృద్ధికి కూడా టిటిడి నిథులను వెచ్చించాలని, అనంతపురం, కడప, కర్నూలు జిల్లాలలో కూడా అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలని, ప్రత్యేకించి సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, చెరువులు మరియు కుంటల పునరుద్ధరణ, మరమ్మత్తులు వంటి నిర్మాణాత్మక కార్యక్రమాలకు కూడా నిథులను ఖర్చు చేయాలని, “మానవ సేవే మాధవ సేవ” అన్న భావనకు వాస్తవ రూపం కల్పించాలని, చాలా కాలం నుండి నాలాంటి వాళ్ళం కోరుతూనే ఉన్నాం.

8. ఆధ్యాత్మిక కార్యకలాపాలకు మాత్రమే టిటిడి నిథులను వెచ్చించాలని వాదించిన వారూ లేక పోలేదు. ఇక్కడ ఒక్క విషయాన్ని ప్రస్తావించాలి, శ్రీకృష్ణదేవరాయులు కాలంలో తిరుమలేశునికి కానుకల రూపంలో సమకూర్చిన నిథులను వెచ్చించి కుంటలు, చెరువులను నిర్మించి, తద్వారా వ్యవసాయాభివృద్ధికి, ఉపాథి కల్పనకు తోడ్పాటును అందించిన విషయాన్ని చరిత్ర పుటల నుండి ఎందుకు గ్రహించ లేక పోతున్నారు?

9. శ్రీకృష్ణదేవరాయులు ఏడు సార్లు తిరుమలేశుని దర్శించుకొన్నాడని, వచ్చిన ప్రతిసారి అత్యంత విలువైన వజ్ర వైడూర్యాలు కానుకలుగా సమర్పించి వెళ్ళారని, వాటిలో కొన్ని కనపడడం లేదని, అంటే తస్కరించబడ్డాయన్న అనుమానాలకు తావిచ్చే రీతిలో వ్యాఖ్యానాలు కూడా వినిపిస్తున్నాయి. అలాగే, మైసూరు మహారాజు సమర్పించుకొన్న విలువైన కానుకలకు సంబంధించిన వివాదం.

10. సుదీర్ఘ కాలం పాటు ప్రధాన అర్చకులుగా బాధ్యతలు నిర్వహించిన రమణదీక్షితులు గారు తిరుమలేసునికి అపచారం జరిగి పోతున్నదని, ఆయనకు సమర్పించబడిన కానుకల్లో పగిలి పోయిన వజ్రం ముక్కొకటి(వజ్రాన్ని వజ్రంతోనే కోయాలంటారు మరెలా పగిలి పోయిందో!) కనపడడం లేదని, దాన్ని విదేశాల్లో వేలం వేసి అమ్మబడిందన్న ఆరోపణలున్నాయన్న వివాదాస్పద వ్యాఖ్యలతో వాతావరణాన్ని వేడెక్కించారు.

11. అర్చకులకు వారసత్వ హక్కును రద్దు చేసిన ప్రభుత్వ పెద్దలు వారసత్వ రాజకీయాలను మాత్రం పుణికి పుచ్చుకొన్నారన్న సహేతుకమైన(తన ఉద్యోగం ఊడిందన్న కక్ష కొద్దే కావచ్చు!) రాజకీయ విమర్శతో పాటు పలు వివాదాస్పద అంశాలపై మీడియాకు ఇంటర్యూలు ఇస్తూ, డిల్లీ వరకు వెళ్ళి, కేంద్ర హోం శాఖా మంత్రిని, బిజెపి అధ్యక్షుడిని కలసి సిబిఐ విచారణ జరిపించాలని మొరపెట్టు కొన్నారు. మోడీకి మాత్రమే గట్టిగా భజన చేస్తున్న ఒక జాతీయ ఆంగ్ల భాష టీవి ఛానల్ కు ప్రత్యేక ఇంటర్యూ కూడా ఇచ్చారు.

12. మిరాసీదారుల వ్యవస్థను రద్దు చేసిన నాటి వరకు వెంకటేశ్వరునికి భక్తులు సమర్పించుకొన్న కానుకలన్నింటికీ “కస్టోడియన్స్” గా వ్యవహరించింది మిరాసీదారులే కదా! అటుపై కొన్ని ఆరోపణలు వెలుగు చూసినప్పుడు ప్రభుత్వం చేత నియమించబడిన ఉన్నత స్థాయి విచారణ కమిటీలు, నిజనిర్ధారణ చేసి, సమర్పించబడిన నివేదికలూ భద్రంగానే ఉంటాయి కదా! మళ్ళీ ఈ ఆరోపణల గోల ఏంటన్న సందేహం నా లాంటి వారికి రావడం సహజం.

13. రాజ్యాంగ బద్ధమైన పదవుల్లో ఉన్న పెద్దలు, ప్రభుత్వాల అధినేతలు, మంత్రివర్యులు, కార్పోరేట్ రంగం అధిపతులు, పారిశ్రామిక వేత్తలు, బడా కాంట్రాక్టర్లు, సహజ వనరులను అడ్డంగా దోచుకొన్న – దోచుకొంటున్న మాఫియా గ్యాంగ్ లీడర్లు, సెలబ్రెటీలు, వగైరా వగైరా బాపత్తు వాళ్ళు తిరుమలకు వస్తే ఎర్రతివాచీ పరచి రాచమర్యాదలతో స్వాగత సత్కారాలు చేస్తున్నారు. ప్రసార మాధ్యమాల్లో ప్రముఖంగా వార్తల ప్రచురణ, టీవీల్లో ఇంటర్యూల ప్రసారం నిత్యకృత్యంగా మారి పోయింది. తిరుమలలో వ్యాపార దోరణి బాగా పెరిగి పోయిందన్న భక్తుల సద్విమర్శలను పట్టించుకొనే వారే కరవయ్యారు.

14. దేవునికి సంబంధించిన సంస్థ కాబట్టి టిటిడి చాలా పవిత్రంగా, భక్తులకు మరియు ప్రజలకు జవాబుదారీతనంగా వ్యవహరిస్తున్నదని, అవినీతి – అక్రమాలకు తావు లేకుండా పారదర్శంగా కార్యకలాపాలను నిర్వహిస్తున్నదని నేనైతే భావించడం లేదు. రాజకీయ అవినీతి రాజ్య మేలుతున్న ఈ కాలంలో టిటిడికి కూడా ఆ అంటు వ్యాథి బాగా సోకింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

15. చివరిలో ఒక ముచ్చట చెబుతా! నేను యస్.వి.ఆర్ట్స్ కళాశాలలో విద్యనార్జించే కాలంలో, 1976లో, తిరుమలలోని ఉన్నత పాఠశాల విద్యార్థులను కూడగట్టి అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్(ఎ.ఐ.ఎస్.ఎఫ్.) శాఖను నెలకొల్పడానికి వెళితే అనుమతించ లేదు. తిరుమలలోని యువతను సమీకరించి అఖిల భారత యువజన సమాఖ్య(ఎ.ఐ.వై.ఎఫ్.)ను నెలకొల్పడానికి కూడా అడ్డం పడ్డారు. తిరుమలలో సభలు, సమావేశాలు, మీడియా ప్రతినిథులతో సమవేశాలను నిర్వహించడం, అన్ని రకాల రాజకీయ కార్యకలాపాలు నిషిద్ధం అన్నారు. నాడు ఆ నిబంధనలను గౌరవిస్తూనే, విద్యార్థి, యువజన సమాఖ్యల అనుబంధ శాఖలను నెలకొల్పాం.

నేడు చూస్తున్నాం, ఏ విధంగా తిరుమలను సంకుచిత, స్వార్థ రాజకీయాలకు కేంద్ర స్థానంగా మార్చారో, ప్రధాన అర్చకులు కూడా అందులో భాగస్వాములైనారో! బోధపడుతూనే ఉన్నది.

టి.లక్ష్మీనారాయణ – పొలిటికల్ అనలిస్ట్

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close