ఎన్టీఆర్ కోసం హీరోయిన్ స్లిమ్ మంత్ర!

ఎన్టీఆర్ న్యూ మేకోవర్ అభిమానులను, ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. యంగ్ టైగర్ మజిల్స్ పెంచి, బాడీలోని ఎక్స్ట్రా ఫ్యాట్ కట్ చేసి, కొత్త సినిమాల కోసం ఫిట్‌గా రెడీ అయ్యాడు. అంతకు ముందు కంటే స్లిమ్ అయ్యాడు. హ్యాండ్సమ్‌గా కనిపిస్తున్నాడు. అతడి పక్కన అంతే అందంగా కనిపించడం కోసం హీరోయిన్ కూడా కొంచెం కష్టపడుతుంది. ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో హారిక హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్న సినిమా షూటింగ్ వచ్చే నెలలో స్టార్ట్ చేస్తారు. ఈ సినిమాలో ‘దువ్వాడ జగన్నాథమ్ డీజే’ ఫేమ్ పూజా హెగ్డే హీరోయిన్‌గా సెలెక్ట్ అయిన సంగతి తెలిసిందే. నిజం చెప్పాలంటే… పూజాది ప‌ర్‌ఫెక్ట్‌ ఫిగర్. ‘డీజే’లో బికినీలోనూ సందడి చేసింది. మంచి డ్యాన్సర్ కూడా. బన్నీ పక్కన బాగా డ్యాన్సులు చేసింది. అలాగని ఎన్టీఆర్ సినిమా కోసం రిలాక్స్ కావడం లేదు. ఎన్టీఆర్ కొత్త లుక్, మేకోవర్ చూశాక తానూ మరింత స్లిమ్ కావాలని డిసైడ్ అయ్యిందట. ప్రస్తుతం ఖాళీ సమయం దొరికితే వీలైనంత ఎక్కువసేపు వర్కవుట్స్ చేస్తోంది. రెగ్యులర్‌గా అందరూ చేసేట్టు కాకుండా ముందునుంచి పూజా హెగ్డే ఏరియల్ యాక్రోబాటిక్స్ చేస్తుంది. ఇప్పుడూ అదే పధ్ధతిని ఫాలో అవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.