పదేళ్లుగా దారి తప్పిందెవరు పూనమ్?

“భరిస్తున్న అమ్మాయిలకి ఇంకా కొన్ని కష్టాలు, తెగించిన అమ్మాయిల కోసం ప్రీమీట్లు, ఇల్లులు… పది సంవత్సరాల నుంచి ఎవరు దారి తాప్పారో చూడండి?” – ఇదీ సెన్సేషనల్ పూనమ్ కౌర్ లేటెస్ట్ ట్వీట్! ఇందులో ఆమె ఎవర్ని టార్గెట్ చేసిందనేది అంతు చిక్కడం లేదు. పూనమ్ కౌర్ ట్వీట్లు, స్టేట్మెంట్లు ఇటు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాదు… పొలిటికల్ ఫీల్డులోనూ ప్రకంపనలు సృష్టిస్తాయేమోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

“జల్సాలు చూపిస్తూ అజ్ఞాతవాసంలో ఏసేస్తాడు… జాగ్రత్త! నమ్మకద్రోహి” అంటూ గత రాత్రి ప్రేక్షకులకు అర్థం అయ్యేలా ట్వీట్ చేసిన పూనమ్, ఈ రోజు ఎందుకనో దాగుడుమూతలు ఆడారు. రాజకీయంగా, సినిమాల పరంగా పూనమ్ కౌర్ ప్రతి అడుగు కొందరి అడుగులను ప్రభావితం చేసే అవకాశం వుందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. కానీ, ఆమె మాత్రం ధైర్యం చేసి ఎవరి మీదా ఆరోపణలు చేయలేకపోతున్నారు. అమావాస్యకి, పౌర్ణమికి ట్విట్టర్‌లో మాటల బాంబులు పేలుస్తుంటారు. ఇంకెన్ని రోజులు ఇదే విధంగా చేస్తారో? మళ్ళీ మళ్ళీ ఇదే ధోరణి కొనసాగితే ఆమెను పట్టించుకొనేవారు ఎవరూ వుండరు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at [email protected]