ధృవ మూవీ…ఆ క్యారెక్టర్ అదిరిపోతుందంతే

థనీ ఒరువన్ సినిమాను రీమేక్ చేయాలని రామ్ చరణ్ డిసైడ్ అయిన మరుక్షణం నుంచి కూడా విమర్శలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. థనీ ఒరువన్ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ అవడంతో పాటు, రెగ్యులర్ మసాలాలు లేకుండా పూర్తిగా కాన్సెప్ట్‌నే నమ్ముకుని తెరకెక్కించిన సినిమా కావడమే దానికి ప్రధాన కారణం. తమిళ్‌లో యాక్ట్ చేసిన హీరోకి రామ్ చరణ్ అంత మాస్ ఇమేజ్ లేదు. సినిమా అంతా కూడా విలన్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. హీరోయిన్‌తో రొమాన్స్‌కి స్కోప్ లేదు. అలాగే కేవలం రెండు మూడు సాంగ్స్‌తోనే సరిపెట్టాల్సిన కథ. ఇప్పటి వరకూ ఆరెంజ్ మినహా అన్నీ మాస్ మసాలా సినిమాలే చేసిన రామ్ చరణ్ సడన్‌గా థనీ ఒరువన్ లాంటి కాన్సెప్ట్ బేస్డ్ సినిమా రీమేక్ చేయాలని ఫిక్స్ అయ్యేసరికి అనుమానాలే ఎక్కువగా జెనరేట్ అవుతున్నాయి.

ఆ అనుమానాలకు తెరదించుతూ ఓ మాంచి కమర్షియల్ పాయింట్‌కి సంబంధించిన న్యూస్ అయితే బయటకు వచ్చింది. కాన్సెప్ట్‌ని డిస్టర్బ్ చేయకుండా తెలుగులో కొన్ని మార్పులు చేస్తున్నారని తెలిసింది. అలాంటి ఓ మార్పుకు సంబంధించిన న్యూస్ బయటకు వచ్చింది. థనీ ఒరువన్ సినిమాలో హిలేరియస్ కామెడీ క్యారెక్టర్ ఒకటి ఉంది. అరవింద్ స్వామి తండ్రి పాత్ర అది. ధృవ టీం అందరూ కలిసి ఆ క్యారెక్టర్‌ని బాగా డెవలప్ చేశారట. సొంత బుర్రను అస్సలు వాడకుండా కొడుకు అయిన అరవింద్ స్వామి ఎలా చెప్తే అలా గుడ్డిగా చేసుకుంటూ పోయే క్యారెక్టర్ అది. సినిమా మొత్తం మీద ఉన్న ఒకే ఒక్క కామెడీ క్యారెక్టర్ కూడా అదే. ఇప్పుడు ఆ కేబినెట్ మంత్రి క్యారెక్టర్‌ని పోసాని కృష్ణమురళి చేత చేయిస్తున్నారు. ఆల్రెడీ ఈ క్యారెక్టర్‌కి సంబంధించిన సీన్స్ కొన్ని షూట్ చేశారు. ఫైనల్ రష్ చూసుకున్న చరణ్‌తో సహా యూనిట్ మొత్తం కూడా ఫుల్ హ్యాపీగా ఫీలయ్యారట. రామ్ చరణ్ హీరోగా వచ్చిన ‘నాయక్’ సినిమా విజయంలో పోసాని కామెడీ చాలా చాలా కీ రోల్ ప్లే చేసింది. ఈ సారి అంతకుమించిన కామెడీనే ‘ధృవ’లో ఉండబోతోంది. పోసాని కామెడీ క్యారెక్టర్ ధృవ సినిమాకు చాలా చాలా హెల్ప్ అవడం ఖాయంగా కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close