ఇన్ సైడ్ టాక్‌: పెద్ద హీరోల‌పై విరుచుకుప‌డిన పోసాని

సీఎంతో.. టాలీవుడ్ ప్ర‌ముఖుల స‌మావేశం ముగిసింది. `ఎండ్ కార్డ్ కాదు.. శుభం కార్డు ప‌డుతుంది… అంతా మంచే జ‌రుగుతుంది` అని చిరంజీవి ఎప్ప‌టిలానే ఆశాజ‌న‌క‌మైన సందేశాన్నిచ్చారు. అయితే.. స‌మావేశంలో ఏం జ‌రిగిందో, ఏయే విష‌యాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయో.. ఎవ్వ‌రికీ తెలీదు. ఇప్ప‌ట్లో చెప్ప‌రు కూడా. అయితే ఈ స‌మావేశంలో పోసాని కృష్ణ‌ముర‌ళి మాత్రం పెద్ద హీరోల‌పై పెద్ద ఎత్తున విరుచుకుప‌డిన‌ట్టు స‌మాచారం. హీరోలంతా.. పారితోషికాలు భారీగా పెంచేశార‌ని, దాని వ‌ల్ల నిర్మాణ వ్య‌యం పెరిగింద‌ని, టికెట్ రేట్లు పెంచ‌డం బ‌దులుగా, పారితోషికాలు త‌గ్గించుకుంటే, అన్నీ స‌వ్యంగానే ఉంటాయ‌ని, హీరోల జ‌ల్సాల కోసం, సామాన్య ప్రేక్ష‌కుడిపై భారం వేయ‌డం త‌గ‌ద‌ని, చిరు, మ‌హేష్‌, ప్ర‌భాస్ ల ముందే.. పోసాని ఆవేశంగా రెచ్చిపోయిన‌ట్టు టాక్‌. అయితే పోసాని మాట్లాడుతుండ‌గానే.. జ‌గ‌న్ క‌ల్పించుకుని `ప‌క్క‌దారికి వెళ్లొద్దు` అంటూ కంట్రోల్ చేసిన‌ట్టు తెలుస్తోంది.

రోజూ నాలుగు ఆట‌ల‌కు అద‌నంగా..5వ ఆట‌కి జ‌గ‌న్ ప్ర‌భుత్వం సానుకూలంగా ఉంది. అయితే.. టికెట్ రేట్ల విష‌యంలో ఇంకా ఓ స్ప‌ష్ట‌మైన అవ‌గాహ‌న‌కు రావాల్సివుంద‌ని స‌మాచారం. అందుకోసం మ‌రో మీటింగ్ అవ‌స‌రం ఉండొచ్చ‌ని తెలుస్తోంది. ఈసారి మీటింగ్ లో ఫిల్మ్‌ ఛాంబ‌ర్ నుంచి ప్రాతినిథ్యం లేదు. అందుకే… ఈసారి ఫిల్మ్ ఛాంబ‌ర్ ప్ర‌తినిథుల‌తో ప్ర‌త్యేకంగా స‌మావేశం ఏర్పాటు చేసే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. వారం ప‌ది రోజుల్లో జీవో వ‌స్తుంద‌ని అంద‌రూ చెబుతున్నా, ఈ జీవో రావ‌డం అంత తేలిక కాద‌ని, ఇంకాస్త స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close