జగన్‌ పని చేయకపోతే.. పోసానిని చెప్పుతో కొట్టాలట..!

పోసాని కృష్ణమురళి.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోసం చెప్పుదెబ్బలు తింటారట..! ఈ విషయాన్ని ఆయనే చెప్పుకొచ్చారు. కొంత కాలంగా… వైసీపీకి బహిరంగంగా మద్దతు తెలుపుతున్న ఆయన.. ఈ సారి నేరుగా పాదయాత్రలో జగన్‌తో కలసి పాల్గొన్నారు. ఆ తర్వాత జగన్ మీడియా ముందటే తన తన్మయత్వాన్ని ప్రదర్శించారు. “ప్లీజ్..ఒకే ఒక్క చాన్స్ ” జగన్‌కు ఇవ్వండి.. ఆ తర్వాత ఇవ్వడానికేమీ లేకుండా చేస్తారన్నట్లుగా చెప్పుకొచ్చారు. పిల్లికి ఎలక సాక్ష్యంలాగా.. సీఎం అవడానికి జగన్ అన్నీ అర్హతలు ఉన్నాయని సర్టిఫికెట్ ఇచ్చేశారు. దాన్ని జగన్ మీడియా గొప్పగా ప్రకటించేసుకుంది.

ప్రజారాజ్యం పార్టీ తరపున ఓ సారి చిలకలూరి పేట నుంచి పోటీ చేసి డిపాజిట్ కోల్పోయిన పోసాని కృష్ణమురళికి రాజకీయ ఆశలు బాగానే ఉన్నాయి. టీడీపీ లాంటి పార్టీల్లో.. సామాజివర్గ పరంగా చూస్తే ఎక్కువ అవకాశాలు దొరకవనుకుంటారమో కానీ… ఆ పార్టీపై, ఆ పార్టీ అధినేత చంద్రబాబుపై వ్యక్తిగతంగా కూడా విమర్శలు చేసి.. ఇతర పార్టీల్లో ఫ్యాన్స్‌ను సంపాదిస్తూంటారు. ఆయన ఎప్పటికప్పుడు తనకు పోటీ చేయడం ఇష్టం లేదని చెబుతూంటారు. అయినా రాజకీయాలు మాత్రం చేస్తూంటారు. వైసీపీని మోసేస్తూంటారు.

అయినా ఇప్పుడు జగన్‌ను అంత అత్యవసరంగా మోయాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందో… పోసానికో ఏరుక..! ” జగన్‌ రెడ్డి నేను కమ్మ నాకు ఆ కులపిచ్చి లేదు. మేం క్లాస్‌మేట్స్‌ కాదు. మా ఇద్దరిది ఒక జిల్లా కాదు. కేవలం ఆయన కార్యదక్షత నాకు నచ్చింది. దైవసాక్షిగా, నా భార్య బిడ్డల సాక్షిగా, నాపై ఒట్టుపెట్టుకుని చెబుతున్నా. ఆయన చాలా మంచి వ్యక్తి. ఆయన్ని నమ్మి ఒక్కసారి అవకాశం ఇవ్వండి ” ఇదీ ఆయన చెప్పుకొచ్చిన వరుస. ఇక కాళ్లు పట్టుకోవడం ఒక్కటే. ఎన్నికల ముందుకొస్తే.. అదీ కూడా చేసేస్తా అన్నట్లు ఉన్నారు పోసాని. మరీ ఇంత దిగజారుడెందుకో..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close