వీఎఫ్ఎక్స్ ప‌నులు జ‌రుపుకుంటున్న ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’

లాక్ డౌన్ వ‌ల్ల ప్ర‌పంచం స్థంభించిపోయింది. సినిమా ప‌నులూ ఎక్క‌డిక‌క్క‌డ ఆగిపోయాయి. షూటింగులు బంద్ అయ్యాయి. అయితే కొన్ని సినిమాలు మాత్రం సైలెంట్ గా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుపుకుంటున్నాయి. అందులో `ఆర్‌.ఆర్‌.ఆర్‌` కూడా ఉంది. ఈ సినిమాకి సంబంధించిన వీఎఫ్ఎక్స్ ప‌నులు జ‌రుగుతున్నాయ‌ని రాజ‌మౌళి క్లారిటీ ఇచ్చేశారు. ప్ర‌పంచంలోని వివిధ స్టూడియోలకు ఈ సినిమాకి సంబంధించిన వీఎఫ్ఎక్స్ ప‌నులు అప్ప‌గించారు. అందులో కొన్ని లాక్ డౌన్ వ‌ల్ల ప‌నులు చేయ‌డం లేదు. అయితే కొన్ని సంస్థ‌లు వ‌ర్క్ ఫ్రమ్ హోం విధానంలో ప‌నిచేస్తుంటాయి క‌దా. అలాంటి సంస్థ‌ల్లో వీఎఫ్ఎక్స్ ప‌నులు జ‌రుగుతున్నాయి. వీడియో కాన్పిరెన్స్ ద్వారా మాట్లాడుతూ.. త‌న‌కు ఎలాంటి ఎఫెక్ట్స్ కావాలో అవ‌న్నీ ఆన్ లైన్ ద్వారానే చెబుతున్నాడ‌ట రాజ‌మౌళి. ఇప్ప‌టికి 75 శాతం షూటింగ్ పూర్త‌యింద‌ని, అనుకున్న స‌మ‌యానికే సినిమాని విడుద‌ల చేయ‌గ‌ల‌మ‌ని ఆశాభావం వ్య‌క్తం చేశాడు రాజ‌మౌళి. ఎన్టీఆర్ పుట్టిన రోజున కూడా ఓ టీజ‌ర్ వ‌స్తుంద‌ని హింట్ ఇచ్చాడు. అందుకు సంబంధించిన ప‌నులూ జ‌రుగుతున్నాయ‌ట‌. ఆర్‌.ఆర్‌.ఆర్ విష‌యంలో ఫ్యాన్స్ రిలాక్స్ అయిపోవొచ్చిక‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఐటెమ్ గాళ్‌…. పెద్ద స‌మ‌స్యే!

ఇది వ‌ర‌కు ఏ సినిమాలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలా? అని ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డేవారు. అనుకొన్నంత స్థాయిలో, సంఖ్య‌లో హీరోయిన్లు లేక‌పోవ‌డం, స్టార్ హీరోల క్రేజ్‌కు స‌రిప‌డా క‌థానాయిక‌లు దొర‌క్క‌పోవ‌డంతో...

ఇదేం స్ట్రాటజీ ఐ ప్యాక్ – గ్రాఫ్ పెరుగుతోందంటే ఆల్రెడీ తగ్గిపోయిందనే కదా అర్థం !

జగన్ మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరుగుతోందని ప్రచారం చేయాలి . మీకు ఎంత కావాలి ?. ఇది ఐ ప్యాక్ నుంచి వివిధ మీడియా సంస్థలకు.. సోషల్ మీడియా ఖాతాలకు .....

భీమవరం రివ్యూ : రౌడీ రాజకీయానికి గడ్డు కాలమే !

ఏపీలో వీఐపీ నియోజకవర్గాల్లో భీమవరం ఒకటి. పవన్ కల్యాణ్ ఇప్పుడు అక్కడ పోటీ చేయకపోయినా అంది దృష్టి ఈ నియోజకవర్గంపై ఉంది. తాను నామినేషన్ వేసినా పవనే అభ్యర్థి అని ...

కాంగ్రెస్‌తో కాదు రేవంత్ తోనే బీజేపీ, బీఆర్ఎస్ పోటీ !

తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో తాము కాంగ్రెస్ తో కాకుండా రేవంత్ తో పోటీ పడుతున్నట్లుగా రాజకీయాలు చేస్తున్నారు. రేవంత్ ను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని ఏమీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close