తాత‌య్య‌గా ప్ర‌భాస్‌??

బాహుబ‌లిలో రెండు పాత్ర‌ల్లో ద‌ర్శ‌న‌మిచ్చాడు ప్ర‌భాస్. అమ‌రేంద్ర బాహుబ‌లి, మ‌హేంద్ర బాహుబ‌లిగా క‌నిపించాడు. బాహుబ‌లి 2లోనూ అవే పాత్ర‌లు మ‌ళ్లీ రిపీట్ అవ్వ‌బోతున్నాయి. అంతేకాదు… వీటికి తోడుగా ధ‌ర్మేంద్ర బాహుబ‌లి అనే మూడో పాత్ర కూడా క‌నిపించ‌బోతోంద‌ట‌. ఆ పాత్ర లోకూడా ప్ర‌భాసే క‌నిపించ‌నున్నాడ‌ని ఓ టాక్ ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. ధ‌ర్మేంద్ర బాహుబ‌లి అంటే ఎవ‌రో కాదు. అమ‌రేంద్ర బాహుబ‌లి నాన్న‌. అంటే.. మ‌హేంద్ర బాహుబ‌లికి తాత‌య్య అన్న‌మాట‌. బాహుబ‌లి ది క‌న్‌క్లూజ‌న్‌లో కొన్ని కొత్త పాత్ర‌లు క‌నిపించ‌బోతున్నాయ‌న్న టాక్ ముందు నుంచీ వినిపిస్తోంది. అందులో కీల‌క‌మైన పాత్ర ధ‌ర్మేంద్ర బాహుబ‌లిదే అని స‌మాచారం.

అయితే సిక్స్ ప్యాక్‌లో హీమాన్‌లా ఉండే ప్ర‌భాస్‌ని… తాత‌య్య‌గా చూడ‌గ‌ల‌మా? అనే సందేహాలొద్దు. ఎందుకంటే.. ధ‌ర్మేంద్ర బాహుబ‌లికి సంబంధించిన కొన్ని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లు తెర‌పై క‌నిపిస్తాయ‌ని, వాటిలో ధ‌ర్మేంద్ర బాహుబ‌లి యంగ్‌లుక్‌లోనే ద‌ర్శ‌న‌మిస్తాడ‌ట‌. ఒక‌వేళ ఇదే నిజ‌మైతే ‘బాహుబ‌లి ది క‌న్‌క్లూజ‌న్‌’కు ఈ పాత్రే గొప్ప మ‌లుపు ఇవ్వ‌బోతోంద‌ని నిస్సందేహంగా చెప్పొచ్చు. అయితే ‘బాహుబ‌లి’ ప్రాజెక్టు మొద‌లైన‌ప్ప‌టి నుంచీ, ఇప్ప‌టి వ‌ర‌కూ ఈ సినిమాపై ర‌క‌ర‌కాల ఊహాగానాలు తెర‌పైకొచ్చాయి. అవ‌న్నీ దాదాపు క‌ల్పిత‌మైన విష‌యాలే. అయితే కొన్ని మాత్రం నిజ‌మ‌య్యాయి. మ‌రి ధ‌ర్మేంద్ర బాహుబ‌లి సంగ‌తేంటో తెలియాలంటే రాజ‌మౌళి నోరు విప్పాలి. లేదంటే… ‘బాహుబ‌లి 2’ వచ్చే వ‌ర‌కూ ఎదురు చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close