ఆ ఇద్ద‌రు ద‌ర్శ‌కుల గురించి క్లారిటీ ఇచ్చిన ప్ర‌భాస్

ప్ర‌భాస్ తో సినిమా చేయాల‌ని ఎవరికి ఉండ‌దు..?? అగ్ర ద‌ర్శ‌కులు ప్ర‌భాస్ తో సినిమా చేయాల‌ని ప‌రి త‌పిస్తున్నారు. ప్ర‌భాస్ మాత్రం కొత్త ద‌ర్శకుల‌తో ప్ర‌యాణం చేస్తున్నాడు. ఈలోగా బోలెడ‌న్ని గాసిప్పులు. ‘కేజీఎఫ్‌’ ద‌ర్శ‌కుడితో ప్ర‌భాస్ ప‌నిచేయ‌బోతున్నాడ‌ని, ఇద్ద‌రి మ‌ధ్యా చ‌ర్చ‌లు కూడా జ‌రిగాయ‌ని వార్త‌లొచ్చాయి. మ‌రోవైపు కొర‌టాల శివ‌తో ప్ర‌భాస్‌సినిమా ఉంటుంద‌ని చెప్పుకున్నారు. మిర్చితో కొర‌టాల‌కు ద‌ర్శ‌కుడిగా అవ‌కాశం ఇచ్చింది ప్ర‌భాసే. ఆ సినిమాతో కొర‌టాల టాప్ ద‌ర్శ‌కుడు అయిపోయాడు. ఇప్పుడు మ‌ళ్లీ వీరిద్ద‌రూ క‌లిసి సినిమా చేయ‌బోతున్నార‌ని వార్త‌లొచ్చాయి. ఈ రెండు సినిమాల‌పై ప్ర‌భాస్ స్పందించాడు. కేజీఎఫ్ ద‌ర్శ‌కుడితో సినిమా చేస్తున్నాన‌న్న విష‌యంలో ఎలాంటి వాస్త‌వం లేద‌ని తేల్చేశాడు. త‌మ మ‌ధ్య అలాంటి సంప్ర‌దింపులేం జ‌ర‌గ‌లేద‌ని చెప్పాడు.

అయితే కొర‌టాల శివ‌తో మాత్రం సినిమా ఉంటుంద‌ని, అయితే అదెప్పుడ‌న్న‌ది చెప్ప‌లేమ‌ని చెప్పాడు. బాలీవుడ్ అవ‌కాశాల గురించి మాట్లాడుతూ “బాలీవుడ్‌లో హీరోలంతా నాతో బాగానే ఉంటారు. రణ‌బీర్ సింగ్‌, అక్ష‌య్ కుమార్ బాగా మాట్లాడ‌తారు. ఈమ‌ధ్య అమీర్ ఖాన్ కూడా ఫోన్ చేశారు. బాలీవుడ్‌లో మ‌ల్టీస్టార‌ర్ సినిమాలు చేసే అవ‌కాశం వ‌స్తే త‌ప్ప‌కుండా చేస్తా. అక్క‌డ మ‌ల్టీస్టార‌ర్ల‌కు మంచి ఆద‌ర‌ణ ఉంది” అన్నాడు. మ‌రి భ‌విష్య‌త్తులో అలాంటి ఛాన్స్ వ‌స్తుందేమో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పవన్‌ను ఆశీర్వదించిన పిఠాపురం !

పిఠాపురం చరిత్రలో ఎప్పుడూ లేనంత భారీ ర్యాలీ జరిగింది. పవన్ తాను అద్దెకు తీసుకున్న చేబ్రోలులోని ఇంటి నుంచి నామినేషన్ వేసేందుకు ఆర్వో ఆఫీసుకు వచ్చేందుకు ఐదు గంటలకుపైగా సమయం...

సూరత్ తరహాలో సికింద్రాబాద్ చేజారుతుందా..?

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మల్కాజ్ గిరి, సికింద్రాబాద్ , చేవెళ్లలో ఎలాగైనా గెలవాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. మల్కాజ్ గిరి, చేవెళ్లలో అభ్యర్థుల ప్రచారంలో దూకుడుగా సాగుతున్నా సికింద్రాబాద్ లో మాత్రం...

వైసీపీకి ఏబీవీ భయం – క్యాట్ ముందు హాజరు కాని ఏజీ !

సస్పెన్షన్ లో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు కేసును వీలైనంతగా లేటు చేసేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. విచారణకు హాజరు కావాల్సిన అడ్వాకేట్ జనరల్ డుమ్మా కొట్టారు. అదే కారణం...

అప్పుల క‌న్నా ప‌న్నులే ఎక్కువ‌… ప‌వ‌న్ ఆస్తుల లిస్ట్ ఇదే!

సినిమాల్లో మాస్ ఇమేజ్ ఉండి, కాల్ షీట్ల కోసం ఏండ్ల త‌ర‌బ‌డి వెయిట్ చేసినా దొర‌క‌నంత స్టార్ డ‌మ్ ఉన్న వ్య‌క్తి ప‌వ‌న్ క‌ళ్యాణ్. పిఠాపురం నుండి పోటీ చేస్తున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close