మైత్రి నిర్మాతలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభాస్..!

బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ నేషనల్ ఫిగర్ అయ్యాడన్న సంగతి తెలిసిందే. ఆ సినిమాతో వచ్చిన క్రేజ్ తో తనతో సినిమా కోసం క్యూలు కడుతున్నారు దర్శక నిర్మాతలు. ఇక సినిమాల్లోనే కాకుండా వాణిజ్య ప్రకటనల్లో కూడా ప్రభాస్ తన అభిమానులను అలరిస్తుండటం విశేషం. ప్రస్తుతం బాహుబలి కంక్లూజన్ షూట్ లో ఉన్న యంగ్ రెబల్ స్టార్ ఆ సినిమా తర్వాత రన్ రాజా రన్ సుజిత్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తాడని అంటున్నారు.

తన స్నేహితుల నిర్మాణ సంస్థ అయిన యు.వి క్రియేషన్స్ లో ఈ సినిమా ఉంటుందని అంచనా. ఇక పెదన్నాన్న గోపికృష్ణ పతాకంలో కూడా ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. అయితే ఈ రెండు సరిపోవు అన్నట్టు ప్రభాస్ తో ఓ సినిమా కమిట్ అయ్యారట మైత్రి మూవీ మేకర్స్ వారు. మొన్నటిదాకా ఓవర్సీస్ లో సినిమాలను రిలీజ్ చేసిన మైత్రి మూవీ మేకర్స్ సూపర్ స్టార్ మహేష్ శ్రీమంతుడు సినిమాతో సినిమా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. ఇక ఆ సినిమా ఇచ్చిన హిట్ కిక్ తో వరుసెంట క్రేజీ ప్రాజెక్ట్స్ చేసేందుకు సిద్ధమయ్యారు.

ప్రస్తుతం తారక్ తో జనతా గ్యారేజ్ నిర్మిస్తున్న మైత్రి మేకర్స్ వారు ప్రభాస్ తో కూడా చర్చలు జరిపారట. అంతేకాదు తమ బ్యానర్ లో సినిమా చేయాలని ప్రభాస్ కు అడ్వాన్స్ కూడా ఇచ్చారని సమాచారం. మరి ఈ సినిమాకు ఎవరు దర్శకత్వం వహిస్తారు అన్నదాని మీద క్లారిటీ రాలేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

భయమే బంగారమాయెనా…

హారర్ సినిమా అనగానే ఆడియన్స్ లిమిట్ అయిపోతారు. స్టార్ హీరోలు ఈ కథలని వినడానికి పెద్ద ఆసక్తి చూపించారు. కానీ చాలా మంది ఫిల్మ్ మేకర్స్ కి హారర్ సినిమాలంటే క్రేజ్. నిజానికి...

భయమా..? అభద్రతాభావమా..?

కొద్ది రోజుల కిందట వరకు దేశవ్యాప్తంగా బీజేపీకి అనుకూల పరిస్థితి ఉన్నప్పటికీ ఎన్నికలకు సమయం సమీపించే కొద్దీ ఆ పార్టీ గ్రాఫ్ వేగంగా పతనం అవుతూ వస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కాంగ్రెస్...

ఖ‌మ్మం పంచాయితీ మ‌ళ్లీ షురూ… ఈసారి కాంగ్రెస్ లో!

ఖ‌మ్మం జిల్లా రాజ‌కీయాలు అంటేనే ఎప్పుడూ ఏదో ఒక పంచాయితీ న‌డుస్తూనే ఉంటుంది. అధికార పార్టీలో నాయ‌కుల మ‌ధ్య స‌యోధ్య చాలా క‌ష్టం. మొన్న‌టి వ‌ర‌కు బీఆర్ఎస్ అధికారంలో ఉన్న స‌మ‌యంలో తుమ్మ‌ల‌,...

దాస‌రికి ఇదే ఘ‌న‌మైన నివాళి!

మే 4... ద‌ర్శ‌క ర‌త్న దాస‌రి నారాయ‌ణ‌రావు జ‌న్మ‌దినం. దాస‌రి పుట్టిన రోజుని ద‌ర్శ‌కుల దినోత్స‌వంగా జ‌రుపుకొంటుంది టాలీవుడ్. ద‌ర్శ‌కుల‌కు కూడా స్టార్ స్టేట‌స్ క‌ల్పించిన దాస‌రికి ఇది స‌రైన నివాళే. అయితే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close