ప్ర‌భాస్ సినిమా టైటిల్ మారిందా?

ప్ర‌భాస్ – రాధాకృష్ణ కాంబినేష‌న్‌లో ఓ చిత్రం రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. యూవీ క్రియేష‌న్స్ నిర్మిస్తున్న చిత్రానికి పూజా హెగ్డే క‌థానాయిక‌. ఈ చిత్రానికి `జాన్‌` అనే పేరు ప‌రిశీల‌న‌లో ఉంది. అయితే ఈ టైటిల్ అభిమానుల‌కు పెద్ద‌గా ఎక్క‌లేదు. పైగా… దిల్ రాజు `96` రీమేక్ కి `జానూ` అనే టైటిల్ పెట్టారు. రెండు టైటిళ్లూ ద‌గ్గ‌ర ద‌గ్గ‌ర‌గా ఉన్నాయి. దాంతో ప్రేక్ష‌కులు క‌న్‌ఫ్యూజ్ అయ్యే ఛాన్సుంది. అందుకే ఇప్పుడు ఈ టైటిల్‌ని మార్చే ఆలోచ‌న‌లోఉన్న‌ట్టు తెలుస్తోంది.

యూవీ క్రియేష‌న్స్‌సంస్థ ఫిల్మ్ ఛాంబ‌ర్‌లో రెండు కొత్త టైటిళ్ల‌ని రిజిస్ట‌ర్ చేయించింది. అందులో `ఓ డియ‌ర్‌`, `రాధే శ్యామ్‌` అనే పేర్లు రిజిస్ట‌ర్ చేయించింది. ఇవి రెండూ ప్ర‌భాస్ సినిమా కోస‌మే అని టాక్‌. ఇదో ప్రేమ క‌థ‌. దానికి త‌గ్గ‌ట్టుగానే టైటిల్ సాఫ్ట్‌గా ఉండాల‌ని చిత్ర‌బృందం భావిస్తోంది. అందుకే జాన్ అనే పేరు ఫిక్స్ చేశారు. ఇప్పుడు ఎందుకైనా మంచిద‌ని ఈ రెండు పేర్లూ రిజిస్ట‌ర్ చేసి పెట్టారు. మ‌రి వీటిలో ఏది ఫైన‌ల్ చేస్తారో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

విశ్వ‌క్ ‘లైలా’వ‌తారం!

https://www.youtube.com/watch?v=9STsOoGDUfA లేడీ గెట‌ప్పులు వేయాల‌న్న ఆశ‌.. ప్ర‌తీ హీరోకీ ఉంటుంది. స‌మ‌యం సంద‌ర్భం క‌ల‌సి రావాలంతే! ఒక‌ప్ప‌టి అగ్ర హీరోలంతా మేక‌ప్పులు మార్చి, శారీలు క‌ట్టి - ఆడ వేషాల్లో అద‌ర‌గొట్టిన‌వాళ్లే. ఈత‌రం హీరోలు...

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close