ఆరువేల‌మందికి ‘నో’ చెప్పిన ప్ర‌భాస్‌

టాలీవుడ్‌లోనే కాదు, ఆల్ ఇండియాలోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్… మ‌న ప్ర‌భాసే. ప్ర‌భాస్ పెళ్లి ఎప్పుడు ఎవ‌రితో? అనేది గ‌త రెండు మూడేళ్ల నుంచీ హాట్ టాపిక్‌. బాహుబ‌లి పూర్తయ్యాకే ప్ర‌భాస్ పెళ్లి అని ఇంట్లోవాళ్లు కూడా చెప్పేశారు. ప్ర‌భాస్‌దీ అదే మాట‌. ‘ఇప్పుడు నా దృష్టంతా బాహుబ‌లి పైనే’ అని చెబుతూ వ‌చ్చాడు. ఇప్పుడు బాహుబ‌లి విడుద‌లైంది. ప్ర‌భాస్ పూర్తిగా రిలాక్స్ అయిపోయాడు. మ‌రి పెళ్లెప్పుడు?

ప్ర‌భాస్‌కి త‌గిన సంబంధాలు వెదుకుతున్నాం అంటున్నారు కృష్ఱంరాజు. ప్ర‌భాస్ తో పెళ్లంటే.. అమ్మాయిలంతా వ‌రుస క‌డ‌తారు. తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పెద్ద వ్యాపార వేత్త‌ల కుటుంబాలు, రాజ‌కీయ నేత‌లు… ప్ర‌భాస్‌ని అల్లుడిగా చేసుకోవాల‌ని త‌హ‌త‌హ‌లాడుతున్నార్ట‌. ఎక్కడెక్క‌డి నుంచో సంబంధాలు వ‌స్తూనే ఉన్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కూ దాదాపు ఆరు వేల సంబంధాలొచ్చాయ‌ట‌. కానీ.. వాటిని ప్రభాస్ రిజెక్ట్ చేస్తూ వ‌చ్చాడ‌ట‌. ఈ విష‌యం తెలిసి `ఆరు వేల సంబంధాలే.. `అంటూ నోరెళ్ల‌బెడుతున్నారంతా. ప్ర‌భాస్ కోసం అంత క్యూ ఉంది మ‌రి. భీమ‌వ‌రంలో ఓ సంబంధం ఖాయ‌మైపోయింద‌ని, అయితే ఆ విష‌యాన్ని ఎవ్వ‌రూ చెప్ప‌డం లేద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. గ‌తంలో ఓ హీరోయిన్‌ని ప్ర‌భాస్‌తో ముడి పెడుతూ కొన్ని వ‌చ్చాయి. అయితే అవేం నిజం కావ‌ని తేలిపోయాయి. త‌న పెళ్లి బాధ్య‌త మొత్తం పెద‌నాన్న కృష్ణంరాజ‌కి అప్ప‌గించాడ‌ట ప్ర‌భాస్. ప్ర‌స్తుతం ఆయ‌న ఆ ప‌నుల్లోనే ఉన్నారని, నెల రోజుల్లో ప్ర‌భాస్ పెళ్లి విష‌యంలో ఓ శుభ‌వార్త వినే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌భాస్ సన్నిహితులు చెబుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close