ఆగ‌స్టు వ‌ర‌కూ ప్ర‌భాస్ రాడు

ప్ర‌భాస్ – రాధాకృష్ణ కాంబినేష‌న్‌లో ఓ సినిమా తెర‌కెక్కుతోంది. `రాధే శ్యామ్‌` పేరు దాదాపు ఖ‌రారైపోయింది. లాక్ డౌన్ వ‌ల్ల అన్ని సినిమాలూ ఆగిపోయిన‌ట్టే.. ఇదీ ఆగిపోయింది. అయితే.. షూటింగుల‌కు ఇప్పుడు ప‌ర్మిష‌న్లు ఇచ్చారు. ఈనెలాఖ‌రున ఈ సినిమా కొత్త షెడ్యూల్ మొద‌ల‌వుతుంద‌ని భావించారు. అయితే.. ఆగ‌స్టు వ‌ర‌కూ ఈ సినిమా ప‌ట్టాలెక్క‌ద‌ని తేలిపోయింది. ఈ సినిమా కోసం మూడు ప్ర‌త్యేక‌మైన సెట్ల‌ని అన్న‌పూర్ణ స్టూడియోలో వేస్తున్నారు. ఓ స్ట్రీట్ సెట్‌, షిప్‌, హాస్పిట‌ల్ సెట్ల‌ని ప్ర‌త్యేకంగా రూపుదిద్దుతున్నారు. అవి పూర్త‌వ్వ‌డానికి మ‌రో నెల రోజులు టైమ్ ప‌డుతుంద‌ట‌. ఆగ‌స్టు నుంచి షూటింగ్ ప్రారంభించే అవ‌కాశాలున్నాయ‌ని చిత్ర‌బృందం చెప్పింది. అప్పుడు కూడా ప్ర‌భాస్ వ‌స్తాడా, రాడా? అన్న విష‌యంలో గ్యారెంటీ లేదు. హీరో, హీరోయిన్లు లేని కొన్ని ప్ర‌ధాన స‌న్నివేశాల‌తో షూటింగ్ ప్రారంభిస్తారు. ప్ర‌భాస్ ఆ త‌ర‌వాత మెల్ల‌గా జాయిన్ అవుతాడు. ఈ సినిమాలో పూజా హెగ్డే క‌థానాయిక‌. ఆమె కాల్షీట్లు దొర‌క‌డం చిత్ర‌బృందానికి క‌ష్ట‌మైపోయింది. ప్ర‌భాస్ – పూజాల‌పై కొన్ని ముఖ్య‌మైన సన్నివేశాల్ని తెర‌కెక్కించాల్సివుంది. పూజా ఎప్పుడు అందుబాటులో ఉంటుంది? అనే విష‌యాన్ని బ‌ట్టే… కొత్త షెడ్యూల్ ఆధార‌ప‌డి ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

RRR రికార్డ్ బ్రేక్ చేసిన ‘పుష్ష 2’

'పుష్ష 2' రికార్డుల వేట మొద‌లైంది. మొన్న‌టికి మొన్న 'పుష్ష 2' హిందీ డీల్ క్లోజ్ అయ్యింది. దాదాపు రూ.200 కోట్లు హిందీ రైట్స్ రూపంలో వ‌చ్చాయి. ఆడియో రైట్స్ విష‌యంలోనూ పుష్ష...
video

‘మిరాయ్‌’… 20 రోజుల్లోనే ఇంత తీశారా?

https://www.youtube.com/watch?v=xnubQ829q0c తేజ స‌జ్జా, కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని కాంబినేష‌న్ లో ఓ చిత్రం రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రానికి 'మిరాయ్‌' అనే టైటిల్ ఫిక్స్ చేసిన‌ట్టు తెలుగు 360 ముందే చెప్పింది. ఇప్పుడు అదే...

కోమ‌టిరెడ్డిలో మ‌రో కోణం… కొడుకు పేరుతో సేవ!

నిత్యం ఆరోప‌ణ‌లు, ప్ర‌త్యారోప‌ణ‌లు... వేలాది మంది కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు.. హ‌డావిడి. వైఎస్ హాయం నుండి వేగంగా ఎదిగిన మంత్రి కోమటిరెడ్డి, సేవా కార్య‌క్ర‌మాల్లోనూ నేనున్నా అని అండ‌గా ఉంటారు. ముఖ్యంగా కోమ‌టిరెడ్డి కుమార్...

పెద్దపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా వెంకటేష్ నేత..?

తెలంగాణలో డబుల్ డిజిట్ స్థానాలపై కన్నేసిన బీజేపీ ప్రచారంలో వెనకబడిన అభ్యర్థులను మార్చాలని నిర్ణయం తీసుకోనుందా..? సర్వేలతో ఎప్పటికప్పుడు రాష్ట్రంలో పరిస్థితిని తెలుసుకుంటున్న జాతీయ నాయకత్వం పెద్దపల్లి లోక్ సభ అభ్యర్థిని మార్చనుందా..?...

HOT NEWS

css.php
[X] Close
[X] Close