ప్రభాస్… ఇది నిజమేనా?

బాహుబలి సినిమా తో ఇంటర్నేషనల్ స్టార్ ఐపోయాడు ప్రభాస్. బాహుబలి తరవాత కూడా కొంతకాలం ఇదే ఇమేజ్ కొనసాగే అవకాశం వుంది. ప్రభాస్ తో సినిమాలు తీసేవాళ్లకు ఇది బోనసే. సుజిత్ దర్శకత్వం వహుస్తున్న సినిమాపై తక్షణమే ఈ ఎఫెక్ట్ పడబోతొంది. అందుకే ప్రభాస్ సినిమా పై ఏకంగా 150 కోట్ల పెట్టుబడి పెట్టె సాహసం చేయగలిగారు. ఐతే ఈ స్థాయి లో రిటర్న్స్ రాబట్టడం అంత తేలికైన విషయం కాదు. బాహుబలి స్థాయిలో కాకపోయినా… అందులో సగమైనా ప్రమోషన్స్ చేయగలగాలి. బాహుబలి హీరో తదుపరి చిత్రం ఇదే అంటూ… బాలీవుడ్ లో ప్రచారం జరపాలి. అందుకే… సుజిత్ అండ్ కో అందుకు మార్గాలు అన్వేషిస్తోంది.

అందులో భాగంగానే బాహుబలి 2 తో… ప్రభాస్ తదుపరి సినిమా టీజర్ ని చూపించడానికి రంగం సిద్ధం చేస్తోంది. ఇటీవలే సుజిత్ సినిమా పట్టాలెక్కిన సంగతి తెలిసిందే. టీజర్ కట్ చేయగలిగే స్థాయిలో షూటింగ్ జరగలేదు గానీ టీజర్ రావడం మాత్రం ఖాయం. టీజర్ షాట్స్ ప్రత్యేకంగా బ్లూ మాట్ లో షూట్ చేశారట. దాదాపు 20 సెకన్లు సాగే ఈ టీజర్ కట్ చేసి… ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తున్నారట. ఈ టీజర్ లో ఒక డైలాగ్ కూడా ఉందని… అందుకోసం ప్రభాస్ డబ్బింగ్ కూడా చెప్పేశాడని టాక్. ప్రభాస్ ఫాన్స్ కి ఈ నెల 28 న రెండు పండగలన్న మాట.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at [email protected]