ప్ర‌భాస్ సినిమా బ‌డ్జెట్ రూ.300 కోట్లు?

బాహుబ‌లితో మార్కెట్లు ఓపెన్ అయిపోయాయి. `ఎంత ఖ‌ర్చు పెట్టినా తిరిగి వ‌స్తుందిలే` అనే న‌మ్మ‌కం ఏర్ప‌డింది. `గీత గోవిందం`లాంటి చిన్న సినిమానే రూ.100 కోట్లు రాబ‌ట్టుకుంది. తెలుగు సినిమా స్టామినా అది. అందుకే స్టార్ హీరోల సినిమాకైతే ఆకాశ‌మే హ‌ద్దు. అందుకే బ‌డ్జెట్లు పెరిగిపోతూ ఉన్నాయి. `సాహో` కోసం దాదాపు రూ.250 కోట్లు ఖ‌ర్చు పెడుతున్న‌ట్టు స‌మాచారం. ఇప్పుడు ప్ర‌భాస్ కొత్త సినిమాకి మ‌రో రూ.50 కోట్లు ఎక్కువే వేసుకున్నారు. ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా యూవీ క్రియేష‌న్స్‌, గోపీ కృష్ణా మూవీస్ సంస్థ‌లు ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నాయి. ఇటీవ‌లే ఈ సినిమా లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. ఈ సినిమా బ‌డ్జెట్ రూ.300 కోట్ల‌ని స‌మాచారం. సెట్స్ కోస‌మే.. ఏకంగా రూ.40 కోట్లు ఖ‌ర్చు పెడుతున్నార‌ని తెలుస్తోంది. ఈ సినిమా కోసం రైల్వే స్టేష‌న్‌, పోర్టు, ఎయిర్ పోర్ట్ సెట్స్ అవ‌స‌ర‌మ‌వుతున్నాయ‌ట‌. రంగ‌స్థ‌లం లా 1980 నేప‌థ్యంలో సాగే క‌థ ఇది. దానికి త‌గ్గ‌ట్టుగానే సెట్స్‌ని రూపొందిస్తున్నారు. ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్ ర‌వీంద‌ర్ నేతృత్వంలో భారీ సెట్స్ ని తీర్చిదిద్దుతున్నారు. వీటి బ‌డ్జెట్ రూ.40 కోట్లకు పైమాటే అని స‌మాచారం. షూటింగ్ మొత్తం ఇట‌లీలోనే సాగుతుంది. ఇప్ప‌టికే.. అక్క‌డ కొన్ని లొకేష‌న్ల‌ను ఖ‌రారు చేసేసింది చిత్ర‌బృందం. తెలుగు, త‌మిళ, హిందీ భాష‌ల్లో రూపొందుతున్న ఈ చిత్రంలో పూజా హెడ్గే క‌థానాయిక‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com