తెలకపల్లి రవి : చంద్ర యాత్రలపై చావ్లా ఆశ్చర్యం

ఆంధ్ర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవసరాన్ని మించి విదేశీ యాత్రలు చేస్తూ వాస్తవ సమస్యలు వాయిదా వేస్తున్నారనే విమర్శ తరచూ వినిపిస్తుంటుంది. దేశంలోని సీనియర్‌ సంపాదకులలోఒకరుగానే గాక జాతీయ రాజకీయాలలో కూడా అనుభవజ్ఞుడైన ప్రభుచావ్లా ఇప్పుడు దీన్ని సోదాహరణంగా విమర్శించారు. విశేషమైన పాలనానుభవం కలిగిన చంద్రబాబు ఈ స్థాయిలో ఎందుకు తిరుగుతున్నారు? సింగపూర్‌కు మాత్రమే గాక జపాన్‌కు కూడా రెండుసార్లు వెళ్లివచ్చారు.

అగ్రదేశాల నేతలు హాయిగా సేదదీరేందుకు మాత్రమే ఉపయోగించే దావోస్‌ ఆర్థిక శిఖరాగ్రసభకు ఎక్కడ లేని ప్రాధాన్యతనిచ్చి తీరికలేని చర్చలు పవర్‌పాయింట్‌ ప్రెజంటేషన్లు చేశారు. ఇక ఢిల్లీకి 23 సార్లు పర్యటించి 27 రోజులు గడిపారని లెక్కలు చెప్పారు. చంద్రబాబును మినహాయిస్తే కాంగ్రెసేతర ముఖ్యమంత్రులెవరూ మమతా బెనర్జీ, జయలలిత వంటివారెవరూ ఇన్ని సార్లు చక్కర్లుకొట్టలేదని ఆయన వ్యాఖ్యానించారు.

1996 నాటికి ఢిల్లీలో ‘కింగ్‌మేకర్‌’గా వున్న చంద్రబాబు స్థానం ఇప్పుడు బలహీనపడినందునే ప్రత్యేక హోదాతో సహా ఏదీ తెచ్చుకోలేకపోతున్నారని పేర్కొన్నారు. ఆర్థిక సమస్యలనుంచి బయిటపడేందుకు ఇదంతా చేస్తున్నట్టు చంద్రబాబు చెబుతున్నా స్వరాష్ట్రంలో చేయవలసింది వెనక్కుపోయి పర్యటనలతో సమయం హరించుకుపోతున్నదని ఆయన పార్టీవారు కూడా అసంతృప్తిగా వున్నారని ప్రభుచావ్లా రాశారు. ఇన్నిపర్యటనల తర్వాత కూడా తాత్కాలిక రాజధాని నిర్మాణానికి ఎవరూ ముందుకురాని పరిస్థితి చూస్తే చావ్లా వంటివారి వ్యాఖ్యలు వాస్తవమేననిపిస్తాయి. అదే మాట తెలుగువాళ్లు అంటే ఎంతగానో ఆగ్రహించి తనెంత కష్టపడుతున్నదీ ఏకరువు పెట్టే చంద్రబాబు ఈ సీనియర్‌ సంపాదకుడి మాటైనా ఆలకిస్తారా?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఐటెమ్ గాళ్‌…. పెద్ద స‌మ‌స్యే!

ఇది వ‌ర‌కు ఏ సినిమాలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలా? అని ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డేవారు. అనుకొన్నంత స్థాయిలో, సంఖ్య‌లో హీరోయిన్లు లేక‌పోవ‌డం, స్టార్ హీరోల క్రేజ్‌కు స‌రిప‌డా క‌థానాయిక‌లు దొర‌క్క‌పోవ‌డంతో...

ఇదేం స్ట్రాటజీ ఐ ప్యాక్ – గ్రాఫ్ పెరుగుతోందంటే ఆల్రెడీ తగ్గిపోయిందనే కదా అర్థం !

జగన్ మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరుగుతోందని ప్రచారం చేయాలి . మీకు ఎంత కావాలి ?. ఇది ఐ ప్యాక్ నుంచి వివిధ మీడియా సంస్థలకు.. సోషల్ మీడియా ఖాతాలకు .....

భీమవరం రివ్యూ : రౌడీ రాజకీయానికి గడ్డు కాలమే !

ఏపీలో వీఐపీ నియోజకవర్గాల్లో భీమవరం ఒకటి. పవన్ కల్యాణ్ ఇప్పుడు అక్కడ పోటీ చేయకపోయినా అంది దృష్టి ఈ నియోజకవర్గంపై ఉంది. తాను నామినేషన్ వేసినా పవనే అభ్యర్థి అని ...

కాంగ్రెస్‌తో కాదు రేవంత్ తోనే బీజేపీ, బీఆర్ఎస్ పోటీ !

తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో తాము కాంగ్రెస్ తో కాకుండా రేవంత్ తో పోటీ పడుతున్నట్లుగా రాజకీయాలు చేస్తున్నారు. రేవంత్ ను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని ఏమీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close