న‌య‌న గురించి నోరువిప్పిన‌ ప్రభుదేవా

ప్రభుదేవాతో న‌య‌న తార ప్రేమ వ్య‌వ‌హారం ఇప్పట్లో మ‌ర్చిపోలేం. ఇద్దరూ పెళ్లి వ‌ర‌కూ వెళ్లిపోయారు. అయితే అంత‌లో ఏమైందో.. ఇద్దరూ బ్రేక‌ప్ చెప్పేసుకొన్నారు. అప్పటి నుంచి ఇద్దరి మ‌ధ్యనా మాటల్లేవు. ప్రభుదేవా గురించి న‌య‌న‌తార ఎప్పుడూ నోరు విప్పదు. ప్రభుదేవా మాత్రం ఇప్పుడు తొలిసారి న‌య‌న‌తార‌తో బ్రేక‌ప్ గురించి పెద‌వి విప్పాడు. ”ప్రేమ అంటే నాకిప్పటికీ గౌర‌వం ఉంది. అయితే అన్ని ప్రేమ‌క‌థ‌లూ సుఖాంతం కావు. నాదీ అంతే. ప్రేమ‌లో ప‌డ‌డం, అందులో విఫ‌లం అవ్వడం కూడా ప్రేమ‌లో ఒక భాగంగానే చూస్తాను. అయ్యిందేదో అయ్యింది. దాని గురించి నేనేం చింతించ‌డం లేదు. నిజానికి అంత టైమ్ కూడా లేదు. నా ప‌ర్సన‌ల్ లైఫ్ నాకుంది. దాంతో నేను హ్యాపీగా ఉన్నా” అంటున్నాడు ప్రభుదేవా. అంతేకాదు.. సృష్టిలో అంద‌రికీ ఏదో ఓ రూపంలో బాధ‌లు వెంటాడుతుంటాయ‌ని, సంపూర్ణ ఆనందంతో ఉన్న వ్యక్తి ఎవ్వరూ ఉండ‌ర‌ని, అలాంటి వ్యక్తి ఎదురైతే.. త‌ప్పకుండా అత‌నికి స‌లాం కొట్టి, స‌హాయ‌కుడిగా మారిపోతాన‌ని అంటున్నాడు ప్రభుదేవా.

అయితే ఇద్దరూ ఎందుకు విడిపోయారో, అస‌లు కార‌ణం ఏమిట‌న్నది ప్రభుదేవా చెప్పడం లేదు. ”వ్యక్తిగ‌త విష‌యాలంటూ కొన్నుంటాయి. అవి.. మ‌న‌లోనే ఐక్యం అయిపోతాయి” అంటూ ఫిలాస‌ఫీ చెబుతున్నాడు. అయితే న‌య‌న‌పై ప్రభుకు ఇంకా ప్రేమ ఉన్నట్టే ఉంది. అందుకే ఆమె గురించి ఒక్క కంప్లైంట్ కూడా చెప్పడం లేదు. న‌య‌న కూడా ప్రభు గురించి వ్యతిరేకంగా ఒక్క స్టేట్‌మెంట్ కూడా ఇవ్వలేదు. ఇద్దరూ ఇష్టపూర్వకంగానే దూరంగా ఉంటున్నార‌ని, ఓ అండ‌ర్‌స్టాండింగ్ ప్రకారమే విడిపోయార‌ని చెప్పడానికి ఇంత‌కంటే ఉదాహ‌ర‌ణ ఏం కావాలి??

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com