ప్ర‌పంచ తెలుగు మ‌హా స‌భ‌లు: సినిమా వాళ్ల‌కు రాని పిలుపు

తెలంగాణ ప్ర‌భుత్వం అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హిస్తున్న పండ‌గ‌.. ప్ర‌పంచ తెలుగు మ‌హా స‌భ‌లు. దీని కోసం ఏకంగా రూ.150 కోట్ల‌కు పైగానే బ‌డ్జెట్ కేటాయించింది. క‌నీ వినీ ఎరుగ‌ని రీతిలో ఈ స‌భ‌ల్ని నిర్వ‌హించాల‌ని ప్ర‌భుత్వం అన్ని ర‌కాలుగానూ ప్ర‌య‌త్నిస్తోంది. క‌వి స‌మ్మేళ‌నాలు, సాంస్ర్కృతిక కార్య‌క్ర‌మాలు అంటూ హంగులు చేస్తోంది. తెలంగాణ క‌వుల్ని ప్ర‌త్యేకంగా సన్మానించాల‌ని భావిస్తోంది. అంతా ఓకే. కానీ ఇప్ప‌టి వ‌ర‌కూ తెలుగు చిత్ర‌సీమ‌కు ఎలాంటి ఆహ్వానాలూ అంద‌లేదు. తెలుగు భాష‌పై, సాహిత్యంపై ప‌ట్టున్న ర‌చ‌యిత‌లు, న‌టీన‌టులు, ద‌ర్శ‌కులు టాలీవుడ్‌లో ఉన్నారు. వాళ్లెవ్వ‌రికీ ఇంత వ‌ర‌కూ ఆహ్వానాలు రాలేదు. ‘అంద‌రూ ఆహ్వానితులే.. అన్నారు కాబ‌ట్టి ఆ లిస్టులో మేమూ ఉన్నామేమో’ అంటూ ఓ ర‌చ‌యిత తెలుగు 360తో చెప్పుకొచ్చారు.

”నేను ఆంధ్రావాడినో, తెలంగాణ వాడినో అర్థం కాక పిల‌వ‌లేదేమో.. ఆహ్వానం అందుతుందేమో అని చూస్తున్నా. ఆహ్వానించినా సంతోష‌మే, పిలుపు రాక‌పోయినా సంతోష‌మే” అంటూ మ‌రో ర‌చ‌యిత‌, న‌టుడు… చెప్పుకొచ్చాడు. కె.విశ్వ‌నాథ్ నుంచి త్రివిక్ర‌మ్ వ‌ర‌కూ ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ నుంచి త‌నికెళ్ల భ‌ర‌ణి వ‌ర‌కూ తెలుగు భాష ఖ్యాతిని సినిమాల ద్వారా చాటిచెప్పిన ర‌చ‌యిత‌లు, ద‌ర్శ‌కులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ల‌నీ పిలిస్తే బాగుండేదేమో! అయితే తెలుగు మ‌హా స‌భ‌ల‌కు సంబంధించిన ఓ పాట‌ని ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్‌తో రూపొందించారు. ఈ పాట కోసం ఏకంగా రూ.75 ల‌క్ష‌లు బ‌డ్జెట్ కేటాయించార్ట‌. ఆ డ‌బ్బుతో ఓ సినిమానే తీసేయొచ్చు. ఇప్ప‌టికైనా తెలుగు చిత్ర‌సీమ‌లోని ప్ర‌ముఖుల‌కు తెలంగాణ ప్ర‌భుత్వం ఆహ్వానాలు అందిస్తుందేమో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close