నితీష్ తర్వాత జేడీయూ వారసుడు ప్రశాంత్ కిషోరేనట..!

రాజకీయ వ్యూహకర్తగా..రూ. వందల కోట్లు ఇచ్చి సలహాలు తీసుకునేందుకు పార్టీలు సిద్ధంగా ఉన్న సమయంలో ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే.. ఎందుకు హఠాత్తుగా రాజకీయాల్లోకి వెళ్లాడు..? అదీ కూడా… బీజేపీ, కాంగ్రెస్‌ల్లాంటి జాతీయ పార్టీల్లోకి వెళ్లకుండా.. బీహార్‌లో ఒంటరిగా కూడా పోటీ చేయలేని..జనతాదళ్ యునైటెడ్ పార్టీలో ఎందుకు చేరారు..?. ఈ సందేహాల్నింటికీ.. సమాధానాన్ని జేడీయూ నేత నితీష్ కుమార్ వెంటనే ఇచ్చేశారు. అదేమిటంటే… నితీష్ కుమార్ తర్వాత జేడీయూ వారసునిగా ప్రశాంత్ కిషోర్‌నేట. అంటే రాజకీయ వారసత్వం… నితీష్ తన కుమారులకు నీ.. బంధువులకు కానీ ఇవ్వకుండా.. ప్రశాంత్ కిషోర్‌కు అప్పగించేస్తున్నారన్నమాట. ఇలా జాక్ పాట్ తగులుతుంది కాబట్టే.. ప్రశాంత్ కిషోర్ కూడా.. తన రాజకీయ వ్యూహాకర్త పనికి పూర్తిగా విశ్రాంతినిచ్చి… ఫుల్ టైమ్ రాజకీయనాయకుడిగా మారిపోయారు.

ప్రశాంత్ కిషోర్ నిర్ణయం.. సరికొత్త చరిత్రే. కానీ భారత రాజకీయాల్లో వారసుల ప్రకటతోనే.. పార్టీలు గుప్పిట్లోకి రావు. దానికి ఎన్నో కొలమానాలు ఉంటాయి. మరి ఎందుకు నితీష్ కుమార్ ప్రశాంత్ కిషోర్‌ను వారసునిగా ప్రకటించారు..?. దానికి కారణం.. పార్లమెంట్ ఎన్నికలేనని.. దేశ రాజకీయాల్లో ప్రచారం జరుగుతోంది. నితీష్ కుమార్ స్ట్రాటజీ అంతే ఉంటుంది. ఆయన మొదట్లో ఎన్డీఏలో ఉన్నప్పుడు.. ఆ కూటమి తరపున తానే ప్రధానమంత్రి అభ్యర్థి కావాలనుకున్నారు. కానీ అనూహ్యంగా బీజేపీ నుంచి మోడీ దూసుకొచ్చారు. మోడీపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసి బయటకు వచ్చారు. కానీ పార్లమెంట్ ఎన్నికల్లో రెండు స్థానాలకే పరిమితయ్యారు. దాంతో.. సీఎం పీఠం నుంచి దిగిపోయి.. దళిత నేత జితన్ రాం మాంఝీకి చాన్సిచ్చారు. వారసునిగా ప్రకటించారు. అయితే మళ్లీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడేసరికి.. మాంఝీపై మరో రకమైన ముద్ర వేసి.. సీఎం పీఠం లాగేసుకున్నారు. దానికి కాంగ్రెస్, ఆర్జేడీ సాయం తీసుకున్నారు. ఇప్పుడు మళ్లీ పార్లమెంట్ ఎన్నికలొస్తున్నాయి. ఈ సమయంలో కొత్తగా మరోసారి వారసుని వాదన నితీష్ తెరపైకి తీసుకొచ్చారు. దానికి క్లీన్ ఇమేజ్ ఉన్న ప్రశాంత్ కిషోర్‌ను ఎంచుకున్నారు.

బీహార్ లో ఆర్జేడీ,కాంగ్రెస్ , జేడీయూలను కలిపి మహాకూటమిగా చేసి.. విజయం సాధించి పెట్టడంతో.. పీకే వ్యూహాలు బాగా పని చేశాయనేది నితీష్ భావన. అప్పుడే ఆయనలో ఓ రాజకీయ నాయకుడ్నిచూసి.. వారసుడిగా చేయాలని నిర్ణయించేసుకున్నారు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల కోసం.. ఒక్క జేడీయూకి మాత్రమే పీకే పని చేస్తాడు. పార్లమెంట్ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలొస్తే.. నితీష్ వారసుడు పీకే అనే వాదనకు బలం చేకూరుతుంది. ఒక వేళ మంచి ఫలితాలు రాకపోతే.. పీకే ఏమీ చేయలేరు. ఆ విషయం నితీష్ కు కూడా తెలుసు. ఇప్పటి పరిస్థితులను బట్టి చూస్తే.. ఆర్జేడీ బీహార్‌లో ఎడ్జ్‌లో ఉందని స్పష్టమైపోతోంది. మరి పీకే తన రాజకీయ వ్యూహాలతో అందివచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని.. కొత్త తరం రాజకీయ నేతగా అవతరిస్తాడా..? … లేక.. పొలిటికల్ కెమిస్ట్రి వర్కవుట్ కాక.. విఫల నేతగా మిగులుతారో చూడాలి..! ఎందుకంటే.. చపాతినీ ఎలా చేయాలో.. చెప్పే వాళ్లు… నిజంగా చపాతీని అంత గొప్పగా చేయలేకపోవచ్చు..! అదే కాన్సెప్ట్ రాజకీయాలకు అన్వయించవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

ట్రబుల్ షూటర్… ట్రబుల్ మేకర్ అవుతున్నారా?

14... ఇది లోక్ సభ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్. అందుకు తగ్గట్టుగానే ప్రచారం చేపడుతున్నారు. అభ్యర్థుల గెలుపు బాధ్యతను తనే తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు.ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో...

కేసీఆర్‌కు సమాచారం ఇచ్చింది చెవిరెడ్డేనా ?

తెలంగాణలో 8 నుంచి 12 లోక్ సభ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుదంటూ కేసీఆర్ చేసిన ప్రిడిక్షన్ వైరల్ అవుతోంది. అదే సమయంలో ఏపీలో జగన్ గెలుస్తారని తనకు సమాచారం వచ్చిందని కూడా ఓ...

ఫ‌హ‌ద్ ఫాజిల్‌పై ‘పుష్ష‌’ ఆశ‌లు

ఆగ‌స్టు 15న 'పుష్ష 2' రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఈ డేట్ కి ఎప్ప‌టి ప‌రిస్థితుల్లోనూ 'పుష్ష 2' రిలీజ్ చేయాల‌ని టీమ్ మొత్తం అహ‌ర్నిశ‌లూ కృషి చేస్తోంది. ఈ సినిమా విడుద‌ల‌పై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close