“పీకే” చెబుతారు ..చేయలేరు… ! బీహార్‌లో చేతులెత్తేశారు..!

ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ రాజకీయ వ్యూహాలను.. పక్కాగా శాసిస్తున్న ఐ ప్యాక్.. ఓనర్, పొలిటికల్ స్ట్రాటజిస్ట్.. బీహార్‌లో చేతులెత్తేశారు. బీహార్‌కు చెందిన ఆయన కొద్ది జోలు క్రితం… నితీష్ కుమార్‌కు చెందిన జేడీయూ పార్టీలో చేరారు. వెంటనే నితీష్ కుమార్ ఆయనను.. ఉపాధ్యక్షుడిగా నియమించి .. లోక్‌సభ ఎన్నికల పర్యవేక్షణ అప్పగించారు. బీహార్ మార్క్ వ్యూహాలను అమలు చేయడంలో.. ప్రశాంత్ కిషోర్ స్టైల్ వేరే. గతంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో… లాలూ ప్రసాద్ యాదవ్ ఆర్జేడీ, నితీష్ కుమార్ జేడీయూలో పొత్తులు పెట్టుకోవడంలో కీలక పాత్ర పోషించారు. ఆ పొత్తులు సక్సెస్ అయ్యాయి. అయితే ఆ తర్వాత నితీష్ కుమార్ లాలూయాదవ్ పార్టీని వదిలించుకుని బీజే్పీతో జట్టుకట్టారు. ఆ తర్వాత బీహార్ లో జరిగిన వరుస ఉపఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. ఇప్పుడు బీజేపీ కూటమితో కలిసి పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంలోనే.. ప్రశాంతి కిషోర్ జేడీయూలోకి వచ్చారు. ఉపాధ్యక్ష పదవి తీసుకున్నారు. 2014లో మోడీకి ప్రచారం చేయడానికి కూడా.. పీకే పని చేశారు.

రాజకీయ పార్టీల్ని తన వ్యూహాలతోనే గెలిపించినట్లు చెప్పుకునే ప్రశాంత్ కిషోర్.. తాను ఉపాధ్యక్షుడిగా ఉన్న పార్టీ బాధ్యతల నుంచి వైదొలగడం బీహార్ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. బీజేపీ-జేడీయూ పరిస్థితి ఏమీ బాగా లేదని అంచనా వేసుకునే ఆయన బాధ్యతల నుంచి తప్పించుకుంటున్నారని చెబుతున్నారు. ఆయన ఉపాధ్యక్ష పదవి తీసుకున్నప్పటి నుంచి.. జేడీయూలోని సీనియర్ నేతలు.. అసంతృప్తిగా ఉన్నారు. పలు సందర్భాల్లో వాగ్వాదానికి దిగారు కూడా. ఈ పరిణామాలన్నింటితో… ప్రశాంత్ కిషోర్ తన పోల్ స్ట్రాటజీలను.. బీహార్‌లో అమలు చేయలేనని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోతంది. అందుకే ఆయన ముందుగానే చేతులెత్తేశారు.

రాజకీయాల్లోకి వెళ్లాలనుకున్న ఆయన తన ఐ ప్యాక్ సంస్థను.. స్నేహితలకు అప్పగించారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఐ ప్యాక్.. ఒక్క వైసీపీకి మాత్రమే సేవలు అందిస్తోంది. ఆ పార్టీకి చెందిన సోషల్ మీడియా ప్రచారం మొత్తం…ఐ ప్యాకే చూస్తోంది. సర్వేలు, అభ్యర్థుల ఎంపిక కూడా పీకే టీం పర్యవేక్షించింది. ఇక పోలీసులపై కులం ముద్ర వేయడం, ఓట్లు తొలగించేందుకు ఫామ్ -7లు దాఖలు చేయించడం కూడా.. పీకే వ్యూహమని చెబుతారు. ఈ విషయంపై క్లారిటీ రావడంతో.. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా పలుమార్లు పీకేను విమర్శించారు. దానికి ఆయన ట్వీట్‌తో చంద్రబాబుపై.. పోస్ట్‌ కూడా పెట్టారు. చివరికి బీహార్‌ రాజకీయాలను తట్టుకోలేక.. సైడైపోతున్నారు. అదే.. చపాతీ ఎలా చేయాలో చెప్పేవాడికో.. చేసేవాడికి చాలా తేడా ఉంటుందని.. పీకే వ్యవహారంతో తేలిపోతుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close