జేడీయూలోచేరిన ప్రశాంత్ కిషోర్..! జగన్‌కు పూర్తిగా దూరమైనట్లేనా..?

“ఈయన పేరు ప్రశాంత్ కిషోర్. మోడీని ప్రధానమంత్రిని చేసింది ఈయనే. మనల్ని కూడా గెలిపిస్తాడు..” … రెండేళ్ల క్రితం… జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీలో.. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ను.. పరిచయం చేస్తూ జగన్ అన్న మాటలు ఇవి. జగన్ తనను గెలిపిస్తాడని ఆశ పడిన ఈ ప్రశాంత్ కిషోర్.. ఇప్పుడు నేరుగా.. వెళ్లి.. తనే ఓ పార్టీలో చేరిపోయాడు. స్వరాష్ట్రం బీహార్‌లోని… పాలక పార్టీ జనతాదళ్ యునైటెడ్‌లో చేరిపోయారు. గత వారంలో హైదరాబాద్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు… మీడియాతో మాట్లాడిన ఆయన .. తనకు రాజకీయ ఆకాంక్షలు లేవన్నట్లుగా చెప్పుకొచ్చారు. నాలుగు రోజులు గడవక ముందే.. ఇతర రాజకీయ పార్టీలో చేరిపోయారు.

ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్‌కు మంచి పేరే ఉంది. ఓ రకంగా.. రాజకీయ వ్యూహకర్తలనే వాళ్లకు క్రేజ్ తెచ్చి పెట్టింది ప్రశాంత్ కిషోరే. ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ .. ఐ ప్యాక్ పేరుతో ఓ సంస్థను స్థాపించి.. రాజకీయ పార్టీలకు సలహాలివ్వడం ప్రారంభించారు. 2012 లో ప్రస్తుత ప్రధాని నరేంద్రమోడీకి దగ్గరయ్యారు. బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థిగా మోడీ ఖరారయ్యాక.. పీకే సలహాలను తూ.చ తప్పకుండా పాటించారు. కాంగ్రెస్ నేతలు మోడీపై ఎలాంటి విమర్శలు చేసినా.. వాటిని ప్రచారానికి ఉపయోగించుకునేలా కార్యక్రమాలు తీర్చి దిద్దారు. వాటిలో ఒకటే చాయ్ పే చర్చ. అయితే ఎన్నికల తర్వాత పీకే బీజేపీకి దూరం అయ్యారు. ఆయనతో కాంగ్రెస్ ఒప్పందం చేసుకుంది. బీహార్‌లో జేడీయూ – ఆర్జేడీ – కాంగ్రెస్ లను కలిపడంలో కీలక పాత్ర పోషించారు. అక్కడ ఆ కూటమి బీజేపీని ఓడించి ఘన విజయం సాధించింది. పంజాబ్‌ లో కాంగ్రెస్ సాధించిన విజయంలోనూ ఓ చేయి వేశారు. అయితే.. ఉత్తరప్రదేశ్ లాంటి చోట్ల.. పీకే సలహాలు పని చేయలేదు.

అయినా.. పీకేకు వచ్చిన క్రేజ్ చూసి.. జగన్మోహన్ రెడ్డి ఆయనను సలహాదారుగా నియమించుకున్నారు. ఆయనకు రూ. 250 కోట్ల వరకూ ఫీజుగా ఇచ్చారన్న ప్రచారామూ ఉంది. అది నిజమో కాదో కానీ.. కొన్నాళ్ల పాటు ప్రశాంత్ కిషోర్.. లోటస్‌ పాండ్‌లోనే ఉండి పార్టీ వ్యవహారాలు చక్క బెట్టారు.నిజానికి నంద్యాల ఉపఎన్నికల్లో వైసీపీకి పది వేల ఓట్ల మెజార్టీ వస్తుందని పీకే టీం సర్వే రిపోర్ట్ ఇవ్వబట్టే జగన్.. పోటీకి ముందుకొచ్చారన్నప్రచారం జరిగింది. అలాగే.. ఇటీవల కాపు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడాలనే సలహా కూడా పీకేనే ఇచ్చారని వైసీపీ వర్గాలు చెబుతూంటాయి. ఇలాంటి నిర్ణయాలు ఎదురు తిరగడం.. సీనియర్లను కాదని..జగన్.. పీకేకే ప్రాధాన్యమిస్తండటంతో.. ఆ పార్టీలో పీకేపై తీవ్ర అసంతృప్తి ఉంది. ఆ తర్వాత మెల్లగా దూరం జరగడం ప్రారంభించారు. ప్రస్తుతం ఎన్నికల వరకూ వైసీపీతో కాంట్రాక్ట్ ఉంది కాబట్టి.. తన కంపెనీ ఐప్యాక్ సిబ్బందితోనే.. పనులు కానిచ్చేస్తున్నారు. తాను మాత్రం.. తన రాజకీయ భవిష్యత్ ను వెదుక్కుంటూ బీహార్ వెళ్లిపోయారు. అంటే.. జగన్‌కు ఇక పీకే సలహాలు లేనట్లే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

ప్రియదర్శి తాటతీసే ‘డార్లింగ్’

హనుమాన్ విజయం తర్వాత నిర్మాత నిరంజన్ రెడ్డి కొత్త సినిమా ఖరారు చేశారు. ప్రియదర్శి హీరోగా ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి డార్లింగ్ అనే టైటిల్ పెట్టారు. అశ్విన్ రామ్ దర్శకుడు....

నినాదాలు చేస్తే సస్పెండ్ చేస్తారా..?

ఏపీ సీఎం జగన్ బస్సు యాత్రలో జై పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు చేసిన విద్యార్థులను సస్పెండ్ చేసింది ఆదిత్య విశ్వవిద్యాలయం. ఈమేరకు సర్క్యులర్ జారీ చేసిన వర్సిటీ అధికారులు.. సీఎం...

మార్గదర్శిపై జగన్ ప్రచారాన్ని రోజా కూడా నమ్మలేదే !

మార్గదర్శి నిండా మునిగిపోయిందని చిట్స్ పాడుకున్న వారికి డబ్బులు ఇవ్వడం లేదని జగన్ రెడ్డి అండ్ సీఐడీ కంపెనీ చేసిన ప్రచారం అంతా ఇంతా కాదు. కోర్టుల్లో చెప్పారు.. కేసుల్లో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close