మన ఖర్మింతే: డైలాగులు ఘనం.. ఆచరణ శూన్యం!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధించే విషయంలో అటు మోడీ సర్కారు అడ్డగోలుగా ప్రజలను వంచిస్తూ ఉంటే, ఇటు చంద్రబాబు సర్కారు సరైన ప్రయత్నం చేయడంలో విఫలం అవుతున్నదని యావత్తు ప్రజలు నమ్ముతున్నారు.

చంద్రబాబు తన రాజధాని, రెండంకెల అభివృద్ధి, పరిశ్రమల వెల్లువ వంటి ఎన్ని మాటల ద్వారా ఎంతగా ప్రజలను నమ్మించాలని చూస్తున్నా.. ప్రత్యేకహోదా దక్కకపోవడంలో వైఫల్యం పూర్తిగా చంద్రబాబుదే, తెదేపాదే అని జనం నమ్మడంలో ఆశ్చర్యం కూడా లేదు. అయితే ఆ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి తెదేపా నాయకులు చాలా భారీ డైలాగులు సంధిస్తూ ఉండడం విశేషం. తాజాగా కేంద్రమంత్రి వ్యాఖ్యలు, ప్రతిపక్షాలు అన్నీ కలిసి, తెదేపా వైఫల్యాన్ని మరింతగా ఎండగడుతున్న నేపథ్యంలో తెదేపా నేతలు హోదాకోసం పోరాడుతాం అంటూ మాటలు మాత్రం ఘనంగానే చెబుతున్నారు.

తాజాగా గుంటూరులో జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ.. రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఎట్టి పరిస్థితుల్లోనూ ఇచ్చి తీరాల్సిందేనంటూ డిమాండ్‌ చేయడం విశేషం. తమకు మిత్రపక్షం అయినంత మాత్రాన కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపాను వదిలిపెట్టే సమస్యే లేదని, చూస్తూ ఊరుకునేది లేదని మంత్రి ప్రత్తిపాటి ఆగ్రహంగా సెలవివ్వడం విశేషం. విభజన చట్టంలో ఉన్న అన్ని అంశాలను కేంద్రం నెరవేర్చాల్సిందే అని ఆయన అంటున్నారు.

ఈ డైలాగులు అన్నీ బాగానే ఉన్నాయి. కానీ యాక్షన్‌ పార్ట్‌ వరకు వచ్చేసరికి తెలుగుదేశం విఫలం అవుతున్నదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ‘విభజన చట్టంలోని అంశాలు అన్నీ’ అనే మెలిక ద్వారా.. ‘ప్రత్యేకహోదా అంశాన్ని చట్టంలో పెట్టకుండా కాంగ్రెస్‌ వంచించింది’ అనే మాయమాటలు చెప్పడానికి తెదేపా నేతలు పూర్వరంగం సృష్టిస్తున్నారని కూడా జనం అనుమానిస్తున్నారు. జనంలోని అనుమానాలు ఆగ్రహంగా మారకముందే.. రాష్ట్రాన్ని పాలిస్తున్న పార్టీ మీద ఏవగింపు పుట్టకముందే.. హోదా కోసం సరైన యాక్షన్‌ ప్లాన్‌తో చంద్రబాబు సర్కారు సాధించుకురావాలని అంతా కోరుకుంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

ఐటెమ్ గాళ్‌…. పెద్ద స‌మ‌స్యే!

ఇది వ‌ర‌కు ఏ సినిమాలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలా? అని ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డేవారు. అనుకొన్నంత స్థాయిలో, సంఖ్య‌లో హీరోయిన్లు లేక‌పోవ‌డం, స్టార్ హీరోల క్రేజ్‌కు స‌రిప‌డా క‌థానాయిక‌లు దొర‌క్క‌పోవ‌డంతో...

ఇదేం స్ట్రాటజీ ఐ ప్యాక్ – గ్రాఫ్ పెరుగుతోందంటే ఆల్రెడీ తగ్గిపోయిందనే కదా అర్థం !

జగన్ మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరుగుతోందని ప్రచారం చేయాలి . మీకు ఎంత కావాలి ?. ఇది ఐ ప్యాక్ నుంచి వివిధ మీడియా సంస్థలకు.. సోషల్ మీడియా ఖాతాలకు .....

HOT NEWS

css.php
[X] Close
[X] Close