‘కోట్లు- కొనుగోళ్లు’ ఆరోపణలా? ముందు జాగ్రత్తా?

ఖమ్మం జిల్లా పాలేరు ఎమ్మెల్యే స్థానానికి ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. అక్కడ రణభేరి మోగింది. నామినేషన్ల పర్వం కూడా పూర్తయింది. ప్రస్తుతానికి వాతావరణం గమనిస్తే మాత్రం.. గులాబీ పార్టీకే అనుకూల సంకేతాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ.. తమకు చెందిన ఈ సీటును ఏకగ్రీవంగా దక్కించుకోవడానికి చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టి, చాలా పంతానికి పోయి.. పట్టుదలగా ఇప్పుడు పోరాడుతున్నది. తెలుగుదేశం, వైకాపాల మద్దతు కూడా కూడగట్టుకుని.. గెలవాలని ఆరాటపడుతున్నది. ఈ నేపథ్యంలో నామినేషన్లు వేసిన రోజున ఆ పార్టీకి చెందిన కొందరు నాయకులు చేసిన ఆరోపణలు, వ్యాఖ్యానాలు భిన్నమైన అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. వారికి గెలుపు మీద నమ్మకం సన్నగిల్లుతూ, ఇప్పటినుంచే సాకులు వెతుక్కోవడానికి ప్రయత్నిస్తున్నారేమో, పార్టీ పోటీలో ఉన్నా.. వారి శ్రేణులు గులాబీ అనుకూలంగా మారుతున్నాయేమో అనే అభిప్రాయం కలుగుతోంది.

నామినేషన్ల సందర్భంగా ఖమ్మంలో కాంగ్రెస్‌ పార్టీ ఓ సభ పెట్టింది. ఆ సభలో ప్రస్తుతం ఎన్నికల బాధ్యత భుజాన వేసుకున్న కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. కేసీఆర్‌ కోట్ల రూపాయలు పంపిస్తూ ఉంటే.. స్థానికంగా నేతలు, అధికారుల్ని తెరాస వారు కొనుక్కుంటూ ఉన్నారని ఆరోపించారు.

ఈ మాటలు చూస్తే.. పాలేరులో కూడా కాంగ్రెస్‌ శ్రేణులు కట్టుతప్పిపోతున్నాయేమో అనే అనుమానం కలుగుతోంది. గులాబీ ఆకర్ష పథకానికి పాలేరు స్థానిక కాంగ్రెస్‌ నాయకులు అటువైపు వెళ్లిపోతున్నారేమోనని, ఆ అక్కసు ఆపుకోలేకనే మల్లు భట్టి విక్రమార్క ఇలాంటి విమర్శలు చేసి ఉండవచ్చునని పలువురు భావిస్తున్నారు. అయితే జనానికి కలుగుతున్న సందేహం ఏంటంటే.. అసలు భట్టి ఆరోపణల్లో నిజం ఉన్నదా? నిజంగానే గులాబీ శ్రేణులు డబ్బు ఎర వేసి స్థానిక కాంగ్రెస్‌ నేతల్ని కొనుక్కుంటున్నారా? లేదా, భవిష్యత్తులో ప్రాప్తించబోయే ఓటమికి సంబంధించి ఇప్పటినుంచే కాంగ్రెస్‌ వారు సాకులు, కారణాలు సిద్ధం చేసుకుంటున్నారా? అని! కాంగ్రెస్‌లోనే ఐక్యత లేదని, ఇంకా నేతల మధ్య విభేదాలున్నాయని.. ఇన్నింటి మధ్య ఓటమి అనివార్యమైతే దానిని ”కేసీఆర్‌ కోట్లు, కొనుగోళ్లు” అంటూ అటు నెట్టేయడానికి ప్రయత్నం జరుగుతున్నదని పలువురు భావిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close