ఆ ట్రైలర్ అంతంత మాత్రమే !

ప్రేమ్ రతన్ ధన్ పాయో… రాజశ్రీ ప్రొడక్షన్ హౌన్ ఆస్థాన హీరో వంటి సల్మాన్ ఖాన్ నటించిన తాజా సినిమా. అందాల నటి సోనమ్ కపూర్ ప్రధాన ఆకర్షణగా ఈ సినిమా సిద్ధమవుతోంది. సల్మాన్, సోనమ్ రొమాన్స్ ఎలా ఉంటుందో, ఆన్ స్క్రీన్ లో ఈ జోడీ కంటికి ఇంపుగా ఉంటుందో లేదో అనే చర్చ జరుగుతోంది. అయితే ఈ సినిమా ట్రయలర్ ను భారీ పబ్లిసిటీ మధ్య రిలీజ్ చేశారు. అయితే అది అంత ఇంప్రెసివ్ గా లేదని టాక్ వచ్చింది. రాజశ్రీ వారి సినిమా, సల్మాన్ హీరో అంటే మై నే ప్యార్ కియా, హమ్ ఆప్ కే హై కౌన్, హమ్ సాథ్ సాథ్ హై సినిమాలు గుర్తుకు వస్తాయి.

ఇప్పుడు ఈ తాజా సినిమా ట్రైలర్ కూడా ఓ పెద్ద హవేలీ సీన్ తో మొదలవుతుంది. ఒక శ్లోకం వినిపిస్తుంది. కొందరు అమ్మాయిలు డాన్స్ చేస్తుంటారు. సల్మాన్ ఎంటర్ అవుతాడు. మై వాపస్ ఆగయాహూ అనే డైలాగ్ చెప్తాడు. భారీ ఖర్చుతోనే ఈ సినిమాను తీసినా తొలి ట్రైలర్ కే బిలో యావరేజ్ అనే టాక్ రావడం నిర్మాతలకు ఇబ్బంది కలిగించే విషయమే.

ఈ సినిమాలో సోనమ్ కపూర్ గ్లామర్ గురించి ఎక్కువగా చర్చ జరుగుతోంది. అందం, అభినయం ఉన్నా పెద్దగా విజయాలు లేని నటి సోనం. అందుకే ఈ సినిమాతో స్టార్ డమ్ పొందాలని తహతహలాడుతోంది. సల్మాన్ సినిమా అంటే సూపర్ హిట్ అయ్యే చాన్స్ ఉంది కాబట్టి తన ఖాతాలో ఒక విజయం చేరడం ఖాయమని ఈ సుందరాంగి ఆశాభావంతో ఉంది. ఈ జంట కన్నుల పంట అనే టాక్ వస్తే ఇంకేం, కలెక్షన్ల వర్షం ఖాయమంటున్నారు దర్శక నిర్మాతలు.

[youtube http://www.youtube.com/watch?v=Vd4iNPuRlx4&w=640&h=360]

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

విశ్వ‌క్ ‘లైలా’వ‌తారం!

https://www.youtube.com/watch?v=9STsOoGDUfA లేడీ గెట‌ప్పులు వేయాల‌న్న ఆశ‌.. ప్ర‌తీ హీరోకీ ఉంటుంది. స‌మ‌యం సంద‌ర్భం క‌ల‌సి రావాలంతే! ఒక‌ప్ప‌టి అగ్ర హీరోలంతా మేక‌ప్పులు మార్చి, శారీలు క‌ట్టి - ఆడ వేషాల్లో అద‌ర‌గొట్టిన‌వాళ్లే. ఈత‌రం హీరోలు...

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close