జమ్మూ కాశ్మీర్ కి మోడీ వరం: 80 వేల కోట్లు

జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో బీజేపీ, పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీలు ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నాయి. ఆ రెండు పార్టీలు కలిసి ఇవ్వాళ్ళ శ్రీనగర్ లో ఒక భారీ బహిరంగ సభ నిర్వహించగా దానిలో ప్రధాని నరేంద్ర మోడి పాల్గొన్నారు. ఆ సందర్భంగా ఆయన జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి రూ. 80, 000 కోట్ల ఆర్ధిక ప్యాకేజినీ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రాభివృద్ధి కోసం తన ప్రభుత్వం ఇంకా ఎంతయినా అందించేందుకు సిద్దంగా ఉందని ప్రకటించారు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం అంటే తనకు చాలా ఇష్టమని, మళ్ళీ చాలా రోజుల తరువాత రాష్ట్రానికి రావడం చాలా సంతోషం కలిగిస్తోందని అన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువత అందరికీ ఉపాధి కల్పించడానికి అవసరమయిన పరిశ్రమలు, అభివృద్ధి కార్యక్రమాలు చేప్పట్టేందుకు జమ్మూ కాశ్మీరు ప్రభుత్వానికి తన ప్రభుత్వం పూర్తి సహాయసహకారాలు అందిస్తుందని ప్రధాని నరేంద్ర మోడి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రెండు పార్టీలకు చెందిన నేతలు, రాష్ట్ర మంత్రులు, ముఖ్యమంత్రి ముఫ్తీ మొహమ్మద్ సయ్యీద్, ఆయన కుమార్తె మహబూబ సయ్యీద్ తదితరులు పాల్గొన్నారు.

ఎవరూ అడగకపోయినా ప్రధాని నరేంద్ర మోడి బిహార్ కి రూ.1.65 లక్షలు కోట్లు ప్యాకేజి మంజూరు చేసారు. మళ్ళీ ఇప్పుడు కూడా ఎవరూ అడగకపోయినా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి రూ. 80, 000 కోట్ల ఆర్ధిక ప్యాకేజినీ మంజూరు చేశారు. కానీ రాష్ట్ర విభజనతో అన్ని విధాల చితికిపోయున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్ధిక సహాయం చేయమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతగా బ్రతిమాలుకొంటున్నా ఇంతవరకు కనికరించలేదు.

జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాభివృద్ధికి ఇంకా అవసరమయితే ఎంతయినా ఇస్తానని చెపుతున్న ప్రధాని నరేంద్ర మోడి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అడిగినా ఇవ్వడంలేదు. ప్రత్యేక హోదా హామీని ఎలాగు గట్టున పెట్టేశారు. కనీసం ఆర్ధిక ప్యాకేజి ఇచ్చి రాష్ట్రాన్ని గట్టేక్కిస్తారని అందరూ ఆశగా ఎదురు చూసారు. ఆయన అమరావతి శంఖుస్థాపన కార్యక్రమానికి వచ్చినప్పుడు తప్పకుండా రాష్ట్రానికి భారీ ఆర్ధిక ప్యాకేజి ప్రకటిస్తారని అందరూ ఆశగా ఎదురు చూసారు. కానీ ఆయన ఎటువంటి ప్రకటన చేయకుండా డిల్లీ నుండి నీట గా ప్యాక్ చేసి తెచ్చిన “చెంబుడు నీళ్ళు…గుప్పెడు మట్టి” చంద్రబాబు నాయుడు చేతిలో పెట్టి చక్కా వెళ్ళిపోయారు. అందుకు రాష్ట్ర ప్రజలు ఆయనపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అయినప్పటికీ బిహార్ ఎన్నికలు పూర్తవగానే రాష్ట్రానికి అంతకంటే భారీ ఆర్ధిక ప్యాకేజి ప్రకటిస్తారని తెదేపా నేతలు భరోసా ఇస్తుండటంతో అందరూ ఇంకా ఆశగా ఎదురుచూస్తూనే ఉన్నారు. బిహార్ ఎన్నికలు కూడా పూర్తయిపోయాయి. చంద్రబాబు నాయుడు నిన్న నీతి ఆయోగ్ అధికారులను కలిసినప్పుడు ఆర్ధిక ప్యాకేజి గురించి మళ్ళీ మరోమారు వారికి గుర్తు చేసారు. త్వరలోనే దీనిపై ఒక ప్రకటన వెలువడుతుందని అందరూ ఆశిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఛోటా కె.నాయుడు Vs హ‌రీష్ శంక‌ర్‌… ఏం జ‌రిగింది?

'మ‌ళ్లీ నా జోలికొచ్చారో... చూసుకొందాం' అంటూ సినిమా ఫ‌క్కీలో కెమెరామెన్‌ ఛోటా కె.నాయుడుకు వార్నింగ్ ఇచ్చాడు హ‌రీష్ శంక‌ర్‌. వీరిద్ద‌రూ క‌లిసి 'రామ‌య్యా వ‌స్తావ‌య్యా' సినిమా చేశారు. అప్ప‌టి నుంచీ ఇద్ద‌రి మ‌ధ్యా...

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close