తెలకపల్లి రవి : బిజెపి దాగుడుమూతల పది కారణాలు

ప్రధాని నరేంద్ర మోడీ శనివారం బీహార్‌ పర్యటనకు వెళ్లారు. గతసారి ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి నితిష్‌ కుమార్‌ను తిట్టిపోసిన నోటితోనే అభినందనలు కురిపించారు. అంతకన్నా ముఖ్యమైన తేడా ఏమంటే అప్పుడు కురిపించిన ప్రత్యేక ప్యాకేజీ మాటే ఎత్తకుండా మరేదో మాట్లాడి వచ్చేశారు. ఆంధ్ర ప్రదేశ్‌ అయినా బీహార్‌ అయినా బిజెపి రాజకీయ క్రీడలో తేడా లేదని దీంతో మరోసారి తేలిపోయింది.

ఎందుకంటూ ఆర్థిక పాలనా పరమైన పరిణామాల వెనక రాజకీయ వైరుధ్యాలు ప్రయోజనాలు పనిచేస్తుంటాయి. ఎపికి ప్రత్యేక హౌదా ఇవ్వాలని కోరి మరీ ప్రకటింపచేసిన బిజెపి తనే అధికారంలోకి వచ్చాక ఎందుకు మంజూరు చేయడం లేదు? ప్రత్యేక హౌదా కాకపోయినా ఘనమైన ప్యాకేజీ ఇస్తామనే మాట కూడా ఎందుకు అమలుకు నోచలేదు? దానికి చాలా కారణాలు. మొదటిది- ఈ రాష్ట్రంలో బిజెపికి బలం అమాంతంగా పెరుగుతుందనే ఆశలేదు రెండు- ఉన్నంతలో ఏమి ఇచ్చినా అధికారంలో వున్న తెలుగుదేశంకు తప్పతనకు రాజకీయంగా లబ్ది చేకూరదు. మూడు- రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రాజకీయ చదరంగంలో తన పావులు ఎలా కదపాలో ఇంకా స్పష్టత రాలేదు. నాలుగు- ఇప్పుడు ఏ ఎన్నికలు లేవు. అయిదు- అధికారంలో వున్న తెలుగుదేశం కూడా కేంద్ర నిధులపై కంటే ప్రైవేటు భాగస్వామ్యంపైనే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నది.ఆరు- టిఆర్‌ఎస్‌తోనూ వైసీపీతోనూ కూడా ప్రత్యక్ష పరోక్ష సంబంధాలకు బిజెపి తలుపులు తెరిచి వుంచడం ఏడు- స్వతహాగా కేంద్రీకృత పెత్తనం కోరే బిజెపి బలమైన రాష్ట్రాలను ఇష్టపడకపోవడం. ఎనిమిది-తమకు కలసి రాని రాష్ట్రాలకు ఇస్తే రేపు తమ కేంద్రాలలో అసంతృప్తి వస్తుందనే భయం. తొమ్మిది- తెలుగు రాష్ట్రాల సీనియర్‌ బిజెపి నేత కూడా కార్పొరేట్‌ ప్రతినిధి కావడం పది- పాలకవర్గాలకు సహజసిద్ధమైన ధనస్వామ్యదృష్టి.

రాజమండ్రి రాజకీయ చోద్యం

హాస్యాస్పదమైన విషయమేమంటే గత ఆదివారం రాజమండ్రిలో బిజెపి అద్యక్షుడు అమిత్‌ షా హాజరైన బహిరంగ సభలో ఎపికి భారీగా సహాయం చేసినట్టు చేంతాడంత జాబితా ప్రకటించడం. ఈ సభ ఏర్పాటే ఒక విధంగా ప్రభుత్వంలో భాగస్వాములుగా వున్న రెండు పార్టీల దాగుడు మూతల వ్యవహారం. తాము నిధులు ఇస్తే లెక్కలు చెప్పలేదని ఆరోపించిన మాజీ కేంద్ర మంత్రి పురందేశ్వరి ఆయనకు అనువాదకురాలుగా వుండటం ఆసక్తికరం. ఆ విమర్శలేవీ లేకపోగా అంతా సానుకూలంగా వున్నట్టు చిత్రించారు అమిత్‌షా. ఆయన ప్రకటించిన జాబితాను కొన్ని పత్రికలు సంపూర్ణంగా ప్రచురించాయి. ే పెద్ద వార్తా విశ్లేషణ యంత్రాంగం గల ఆ మీడియా సంస్థలు కనీసంగా దానిలో నిజానిజాలు నిర్ధారించే పని చేయకపోవడం ఆశ్చర్యకరం. అమిత్‌షా చెప్పిన దానిలో సగం కేంద్రం ప్రారంభించిన లేదా పునాది రాయి వేసిన కేంద్ర పథకాల సంస్థల జాబితా. వాటిని నిధుల కింద ఎలా చూపిస్తారు?. ఐఐటిలు, పరిశోధనా సంస్థలు, లేదా పారిశ్రామిక సంస్థలు కేంద్రం అధీనంలో వుంటాయి. వాటి నిధులు వాటికే సరిపోతాయి. పైగా అవి చాలావరకూ విభజన బిల్లు ప్రకారం హక్కుగా రావలసినవి. వాటిని నగదులో చూపించడం నవ్వులాటకే పనికి వస్తుంది.ఇక అమృత్‌పథకం కింద 33 పట్టణాల ఎంపిక, స్మార్ట్‌ సిటీల వంటివి దీర్ఘకాలిక పథకాలుగా ఖర్చు చేసేవి తప్ప ఆ వేల కోట్లు ఒకేసారి చూపించడం చెల్లుబాటు కాదు. జాతీయ రహదారులని చెబుతూనే ఆ 65 వేల కోట్లు ఎపి ఖర్చు కింద చూపడం ఇంకా హాస్యాస్పదం. ఉత్తర దక్షిణాల వారధిలాటి ఈ రాష్ట్రాన్ని తాకకుండా జాతీయ రహదారులు ఎలా వెళతాయి? హుద్‌హుద్‌కు 500 కోట్లు అని పేర్కొన్న అద్యక్షుల వారికి అసలు తమ అధినేత ఆ రోజున ప్రకటించిన భారీ మొత్తం ఏమిటో తెలుసా? రక్షణ రంగానికి చెందిన డిఆర్‌డివో క్షిపణి కేంద్రం, మిస్సైల్‌ కేంద్రం వంటి వాటి పెట్టుబడులు కూడా ఏపి ఖర్చేనా? 14 వ ఆర్థిక సంఘం సిఫార్సుల కింద కేటాయింపులు పెరుగుతున్నది ఎపికి మాత్రమేనా?నిర్దిష్టంగా రెవెన్యూ లోటు భర్తీకి ఇవ్వాల్సింది 23 వేల కోట్లు కాగా కేవలం 2303 కోట్లు ఇచ్చినట్టు చెప్పుకోవడానికి సంకోచం కూడా లేకపోయిందా?

ఏపికి విభజన బిల్లులో నిర్దిష్టంగా ఇచ్చిన హామీలను అమలు చేయలేదనే వాస్తవాన్ని ఒప్పుకునే బదులు పొంతనలేని ఏవేవో వివరాలు ఏకరువు పెట్టడం రాజకీయ నయవంచనే అవుతుంది. పైగా ప్రత్యేక హౌదా ప్యాకేజీలపై భవిష్యత్తులోనైనా ఏం చేయదల్చుకున్నది ఆయన చెప్పింది లేదు. దురదృష్టం ఏమంటే వీటిపై గట్టిగా మాట్లాడేందుకు తెలుగుదేశం సిద్ధంగా లేదు. తమను బిజెపి నేతలు విమర్శించకుండా చూసుకోవడం తప్ప రాష్ట్రం కోసం అందరినీ కలుపుకొని రాజకీయ వత్తిడి చేసేందుకు అది ఇష్టపడదు. అంతా తన స్వంత విషయంలా పరిగణిస్తుంది. పోలవరం కేటాయింపులు అరకొరగా వున్నా నోరు మెదపదు. కేంద్రం చెబుతున్న లెక్కలపై నిజానిజాలు వెల్లడించే శ్వేతపత్రం ప్రకటించరు. గవర్నర్‌ ప్రసంగంలో కేంద్రం నుంచి ఏం రావాలని కోరుతున్నది సుదీర్ఘంగా చెప్పారు. కేంద్ర బడ్జెట్‌పై అసంతృప్తి వెలిబుచ్చిన ఆర్ఖిక మంత్రి యనమల రామకృష్ణుడు తీరా తన బడ్జెట్‌లో దానివల్ల కలిగిన నష్టమేమిటో స్పష్టంగా చెప్పలేదే? కనుక ఇదంతా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడబలుక్కుని నడిపించే కుటిల వ్యూహమే. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్లపై సవివరమైన వ్యాసాలువచ్చాయి గనక పునరావృతి అనవసరం. అప్పులపైన ఆధారపడి అంచనాలు చూపించడం, ఆధారం లేని అభివృద్ధిరేటు అతిశయోక్తులతో వూదరగొట్టడం రేపు ఎదురు కొడుతుంది. కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లను తొమ్మిది వేల కోట్లకు పైగా అధికంగా అంచనా వేయడం వల్లనే బడ్జెట్‌ను భారీగా చూపించారని అగ్రశ్రేణి పత్రికే రాసింది. సొంత అంచనాలను అతిగా చూపడంకూడా ప్రస్తావించింది. రెవెన్యూరాబడులు తగ్గిన విషయాన్ని విస్మరించారనీ పత్రికలు పేర్కొన్నాయి. ఇప్పుడు ఈ అంచనాలు ఏమాత్రం తప్పినా బడ్జెట్‌ లెక్కలు తలకిందులవుతాయని హెచ్చరించింది. కేంద్రం నిర్వాకం ఏమిటో తెలుసు గనక అంత పని జరగడం తధ్యం.

రాష్ట్రానికి రావలసిన కేటాయింపులపై కేంద్రాన్ని నిలదీయని టిడిపి, దానిపై విమర్శలు చేస్తూనే చల్లగా సర్దుకునే బిజెపి రెండింటి తీరు తేటతెల్లమైంది. ఇక ఇప్పుడు అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చారు గనక ఆ చర్చలో ప్రతిపక్షం మరింతగా నిప్పులు కక్కొచ్చు. టిడిపి పాత భాగోతాలు ఏకరువు పెట్టొచ్చు. ఏది ఏమైనా ఇరు పార్టీల నేతలు పరస్పరం తిట్టుకుంటూ పుణ్యకాలం గడిపేస్తారని, ఇద్దరూ కూడా కేంద్ర బిజెపిని సుతిమెత్తగా వదిలేస్తారని చాలాసార్లు రుజువైన అనుభవం. ఇప్పుడైనా అంతేు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close